10th Class (2006)

చిత్రం: 10 th క్లాస్ (2006)
సంగీతం: మిక్కి జే మేయర్
సాహిత్యం: కులశేఖర్
గానం: హరిహారన్, శ్రావణి
నటీనటులు: భరత్, శరణ్య, సునైనా
దర్శకత్వం: చందు
నిర్మాత: వెంకట శ్యాంప్రసాద్
విడుదల తేది: 06.04.2006

నమహా నమహా ఎగసే సొగసా నీలో నిగనిగకూ
నమహా నమహా ఉరికే వయసా నీలో తపనలకూ
ఊహల్లో వర్ణాలకు ఊరించే అందాలకు
ఈ కన్నే గ్రంథాలకు వయ్యారాల నడుమొంపుకు
కవ్వించే నీ కళ్ళకు బందించే కౌగిళ్లకు
పదహారేళ్ల పరువాలకూ…

నమహా నమహా ఎగసే సొగసా నీలో నిగనిగకూ
నమహా నమహా ఉరికే వయసా నీలో తపనలకూ

బుగ్గలే చూస్తూవుంటే నాలో ఏదో తాపం
ప్రాయమే అర్పిస్తుంది దాసోహం
ముద్దుకి మారం చేసే మొహం రేపే మైకం
ఇంతగా వేధిస్తుంది ఈ దేహం
చెలీ చమటలలో చిలిపి స్నానం
ప్రియ పెదవులతో మధురగానం హు

నమహా నమహా ఎగసే సొగసా నీలో నిగనిగకూ
నమహా నమహా ఉరికే వయసా నీలో తపనలకూ

ఎప్పుడూ చూడేలేదు కల్లోనైనా మైనా
అందుకే ఆరాటాలు నాలోనా
చెప్పనా నీకోమాట నీలో నేనే లేనా
ఇందుకు నీలో ఇంత హైరానా
చెలీ అందెకాలి దాకా నిన్ను తాకిపోనా
ప్రియా తుంటరీడు లోనా సిగ్గుమాయమౌనా హా

నమహా నమహా ఎగసే సొగసా నీలో నిగనిగకూ
నమహా నమహా ఉరికే వయసా నీలో తపనలకూ

ఊహల్లో వర్ణాలకు ఊరించే అందాలకు
ఈ కన్నే గ్రంథాలకు వయ్యారాల నడుమొంపుకు
కవ్వించే నీ కళ్ళకు బందించే కౌగిళ్లకు
పదహారేళ్ల పరువాలకూ…

నమహా నమహా ఎగసే సొగసా నీలో నిగనిగకూ
నమహా నమహా ఉరికే వయసా నీలో తపనలకూ

*********   ********   ********

చిత్రం: 10 th క్లాస్ (2006)
సంగీతం: మిక్కి జే మేయర్
సాహిత్యం: కులశేఖర్
గానం: కార్తిక్, చిత్ర

కన్నులు రెండు కలవర పడుతుంటే
గుండెల సవ్వడి గుసగుసమంటుంటే
నాలో ప్రతి ఆశ నాలో ప్రతి శ్వాస
నాలో ప్రతి ఆశ నువ్వే కావాలంటే
రోజు కనుపాప నిన్నే చూడాలంటే
ప్రేమేనంటావా… ప్రేమేనంటావా…

కన్నులు రెండు కలవర పడుతుంటే
గుండెల సవ్వడి గుసగుసమంటుంటే
నాలో ప్రతి ఆశ నాలో ప్రతి శ్వాస
నాలో ప్రతి ఆశ నువ్వే కావాలంటే
రోజు కనుపాప నిన్నే చూడాలంటే
ప్రేమేనంటావా… ప్రేమేనంటావా…

ఏ గాలి తెమ్మెర వస్తున్నా పరిమళాల స్వరాలుగా
ఆ రాక నీదే అంటున్నా…
ఏ పాట పల్లవి వింటున్నా పరవశాన చటుక్కునా
ఆ పాట నీదే అంటున్నా…
ఏమైనదేమో నాలోన యద లోలోనా గోదారి గాని పొంగేనా…
ఈరోజే నేను వింటున్నా మది ఆలాపించే ప్రేమ కీర్తన…

కన్నులు రెండు కలవర పడుతుంటే
గుండెల సవ్వడి గుసగుసమంటుంటే

నీ వెంట నీడై వస్తున్నా పరిచయాలు వరాలుగా
నీ తీపి కలలే కంటున్నా…
ఏ రోజు ఏ పని చేస్తున్నా ఆ క్షణాలు యుగాలుగా
నీ ఊహలోనే ఉంటున్నా… హా
ఈ మాయ అంతా నీదేనా తొలిప్రేమేనా నీలోన కూడ ఇంతేనా…
ఈ హాయి అంతా ప్రేమేనా మహ బాగుందయ్యా మూగ వేదన…

కన్నులు రెండు కలవర పడుతుంటే
గుండెల సవ్వడి గుసగుసమంటుంటే
నాలో ప్రతి ఆశ నాలో ప్రతి శ్వాస
నాలో ప్రతి ఆశ నువ్వే కావాలంటే
రోజు కనుపాప నిన్నే చూడాలంటే
ప్రేమేనంటావా… ప్రేమేనంటావా…

*********   *********   *********

చిత్రం: 10 th క్లాస్ (2006)
సంగీతం: మిక్కి జే మేయర్
సాహిత్యం: కులశేఖర్
గానం: హరిణి

ఓ ప్రేమా ఎందుకే ఇలా ఆ గుడిగంటలు ఘణఘణ మోగే గుండె లోపల
ఓ ప్రేమా లోలోనా ఆశల వెల్లువ అల్లుకుపోయే మల్లె తీగలా
నువ్వే కాదా యదలో గోదారిలా పొంగిందిలా ఈవేళ
నాలో ఈ మౌనం పాడే ఈ గానం ఏమిటో ఎందుకో చెప్పవా

నువ్వేరోజు చేరావో నా చెంతకి అదేరోజు సంక్రాంతి నా గుండెకి
నువ్వే జంట కావాలి ఏనాటికి
అవునన్నా కాదన్నా నువు లేని నేను ఉన్నానా
ప్రేమైనా ఏమైనా నువ్వే సుమా
ఓ ప్రేమా ఎందుకే ఇలా ఆ గుడిగంటలు ఘణఘణ మోగే గుండె లోపల
ఓ ప్రేమా లోలోనా ఆశల వెల్లువ అల్లుకుపోయే మల్లె తీగలా

సందేశాలు పంపింది ఈ రాతిరి సంగీతాలు పాడింది నా ఊపిరి
సంతోషాలు రేపింది నీ అల్లరి
ఓ ప్రేమా ఓ ప్రేమా ఈ మాయ నీది అనుకోనా
ఎంతైనా బాగుంది ఈ వేదన

*********   *********   *********

చిత్రం: 10 th క్లాస్ (2006)
సంగీతం: మిక్కి జే మేయర్
సాహిత్యం: కులశేఖర్
గానం: శ్రావణి

ఏమైనదో ఎదలోపలా
నీ ఊసులే సిరిమువ్వలా
అలాపించే ఈ గీతం
ఆరాతీసే నీ కోసం
నింగీ నేలా నీ రూపం
నువ్వే కాదా ఈ లోకం

ఏమైనదో ఎదలోపలా..
నీ ఊసులే సిరిమువ్వలా

తొలి చూపులే విడిపోయెనా
చిగురాశలే చితులాయెనా
మౌనాలన్నీ ఇంతేనా
దూరం చేసీ వింతేనా
ఏమవుతుందో ఈ ప్రేమా
మళ్ళీ మళ్ళీ కలిసేనా

తొలి చూపులే విడిపోయెనా
చిగురాశలే చితులాయెనా !

Show Comments (5)

Your email address will not be published.