118 (2019)

చిత్రం: 118 (2019)
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం: కళ్యాణ్ త్రిపురనేని
గానం: నూతన్ మోహన్
నటీనటులు: కళ్యాణ్ రామ్, నివేద థామస్, షాలిని పాండే
దర్శకత్వం: కె.వి.గుహన్
నిర్మాత: మహేష్ ఎస్.కోనేరు
విడుదల తేది: 01.03.2019

పాదాలు నీదారి నడిపించలేనంటే
ఓ సారి నీ నవ్వు వినిపించినా
ఆకాశ దీపాలు కనిపించలేదంటే
నీ చూపు ఓసారి వెతికించనా

ఇంతలో ఇంతలో నన్ను నలువైపు చేరి
మారావు గారాల చిరు దివ్వెలా

ఋతువులకు జతులను నేర్పావే
అడుగులకు అలకలను నేర్పావే
చినుకులకు కుళుకులు నేర్పావే
నీవు జతగా ఆడుకుంటూ

పాదాలు నీ దారి నడిపించలేనంటే
ఓ సారి నీ నవ్వు వినిపించినా

నేల మేలుకొని ముద్దాడే
వెలుగులమ్మ సిరినీవేళ
పాలుగారు పసిరాగాలే
పరుగులైన లలనా
ఏ గతమో విడువ కుండా
నీ జతగా నడుపుతుందా
నిను చూస్తే కాలమంతా మరిచేంతగా

ఇంతలో ఇంతలో నన్ను నలువైపు చేరి
మారావు గారాల చిరు దివ్వెలా

ఋతువులకు జతులను నేర్పావే
అడుగులకు అలకలను నేర్పావే
చినుకులకు కుళుకులు నేర్పావే
నీవు జతగా ఆడుకుంటూ

పాదాలు నీ దారి నడిపించలేనంటే
ఓ సారి నీ నవ్వు వినిపించినా

Previous
NOTA (2018)
error: Content is protected !!