చిత్రం: 143 (I MISS YOU) (2004)
సంగీతం: చక్రి
సాహిత్యం: చంద్రబోస్
గానం: చక్రి , కౌశల్య
నటీనటులు: సాయిరామ్ శంకర్, సమీక్ష , ఫ్లోరా షైనీ (ఆశా షైనీ)
దర్శకత్వం: పూరి జగన్నాధ్
నిర్మాత: పూరి జగన్నాధ్
విడుదల తేది: 27.08.2004
త… తాననినా తన్నానా తాననినా తాన్నానా
ధిరనా ధిక్ ధిరనా ధిరనా ధిరనా ధిరనా
రా… రాగమై రమ్మన్నా! తా… తాళమై నేనున్నా!
ధిరనా ధిక్ ధిరనా ధిరనా ధిరనా ధిరనా
రా… రాధనై రమ్మన్నా.! రా… రాతిరై నేనున్నా.!
ధిరనా ధిక్ ధిరనా ధిరనా ధిరనా ధిరనా
స్నేహపురి దారుల్లో ప్రేమపురి వీధుల్లో
సిగ్గుపురి నీడల్లో సొగసుపురి మేడల్లో
చేరుకోనా సిరిమల్లెల గుర్రం పైనా చేర్చుకోనా నిను నాలో
రా… రాగమై రమ్మన్నా! తా… తాళమై నేనున్నా!
ధిరనా ధిక్ ధిరనా ధిరనా ధిరనా ధిరనా
ధిరనా ధిక్ ధిరనా ధిరనా ధిరనా ధిరనా
విరహం నన్నే తరిమేస్తుంటే పైపై కొస్తూ భయపెడుతుంటే
దాగుండిపోనా నీ గుండెల గుహలోన బందీనైపోనా.!! నీ చేతుల చెరలోన
పైన నీ పైన పడుతుంటే చీకటివాన లేనా నేలేనా చంద్రుణ్ణే గొడుగుగ తేనా
చూపుల సుందర వదనా మాపటి వేళల మదనా
అయిదారడుగులు ఉన్నా.! నీ అడుగుకు మడుగవనా
రా… రాధనై రమ్మన్నా.! రా… రాతిరై నేనున్నా.!
ధిరనా ధిక్ ధిరనా ధిరనా ధిరనా ధిరనా
ధిరనా ధిక్ ధిరనా ధిరనా ధిరనా ధిరనా
తాపం నన్నే వేధిస్తుంటే దాహం నేడే పీడిస్తుంటే
తలదాచుకోనా నీ పెదవుల తడిలోనా పడవేసుకోనా.? నీ మధువుల నదిలోనా
లోనా నీలోనా పుడుతుంటే తుమ్మెదకూనా
కానా జతకానా ప్రాయాన్నే పువ్వుగ తేనా
మనసున దోచిన సుగుణ మలుపుల తిరిగిన రచన
పరువపు హిమగిరినైనా.!! నీ ప్రేమకు నీరవనా
రా… రాగమై రమ్మన్నా! తా… తాళమై నేనున్నా!
ధిరనా ధిక్ ధిరనా ధిరనా ధిరనా ధిరనా
ధిరనా ధిక్ ధిరనా ధిరనా ధిరనా ధిరనా
********* ********* *********
చిత్రం: 143 ( I MISS YOU )
సంగీతం: చక్రి
సాహిత్యం: సుద్ర అప్పు
గానం: చక్రి, పల్లవి
నా ఒంటిలోన వేడిపుట్టి చంపేస్తోంది పిల్లడ
నా కన్నె ఈడు పోరుపెట్టి పిలుస్తోంది పిల్లడ
నా ఒంటిలోన వేడిపుట్టి చంపేస్తోంది పిల్లడ
నా కన్నె ఈడు పోరుపెట్టి పిలుస్తోంది పిల్లడ
ఎయ్ కళ్ళలోన కళ్ళుపెట్టి అలా చూడకే తల్లే
నా గుండెలోన కవ్వమెట్టి ఇలా తిప్పకే తల్లే
అరే పాలకోవ బిళ్ళలాగ నన్నూరించకే తల్లే
నీ అందమంత ముందరెట్టి కిర్రెక్కించకే తల్లే
నువ్ మసేర మస్సే మసేర మసేర మసేర మసేర
ఇక ఢంకా పలాసే పలాసే పలాసే పలాసే పలాసే
ఏయ్ లేలే లెలలా లేలే లెలలా లేచిపోదామా…
ఏయ్ లేలే లెలలా లేలే లెలలా లేచిపోదామా…
అరె పిల్లో… పిల్లో…
నువు మరీ ఇంతలా గుబాళించితే ఏలా?
చనువిచ్చాను కనుకా చుట్టుకోరా ఇలా
చలి గిల్లేస్తోందనీ సతాయించితే ఎలా?
అరే నీదేర చిలకా రెచ్చిపోరా ఇలా
నా నవ్వే తమాషా… తమాషా తమాషా తమాషా
నేనాలు సమోసా… సమోసా సమోసా సమోసా
ఏయ్ లేలే లెలలా లేలే లెలలా లేచిపోదామా…
ఏయ్ లేలే లెలలా లేలే లెలలా లేచిపోదామా…
అరె పిల్లో …పిల్లో…
నే యాపిల్ పండులా బాగున్నానుగా ఇలా
నన్నొగ్గెయ్ పిల్లో దారికాస్తే ఏలా?
నే మొగల్ పువ్వులా ముద్దొస్తానుగా ఇలా
కొంపముంచద్దె పిల్లో కూతపెడితే ఎలా?
నేనేమో అనాసా… అనాసా అనాసా అనాసా
నీతోనే కులాసా… కులాసా కులాసా కులాసా
ఏయ్ లేలే లెలలా లేలే లెలలా లేచిపోదామా…
ఏయ్ లేలే లెలలా లేలే లెలలా లేచిపోదామా…
యహా… పిల్లో పిల్లో…
******** ******* *********
చిత్రం: 143 ( I MISS YOU )
సంగీతం: చక్రి
సాహిత్యం: కందికొండ
గానం: చక్రి
కలలోన నువ్వే ఇలలోన నువ్వే
కలలోన నువ్వే ఇలలోన నువ్వే
కన్నీటి వరదై కమ్మేసినావే
గుండెలోన కూసిన కోయిలా
గొంతుమూగదైనది ఏంటిలా
హృదయపు లయలకు కిలకిలా
మరి నేర్పిన చెలిమే లేదెలా
నీలి నీలి కన్నులా నిండిపోవె ఇలా
జాలువారె వెన్నెలా పొంగిపోవే అలా
కలలోన నువ్వే ఇలలోన నువ్వే
కన్నీటి వరదై కమ్మేసినావే
ఆపవే ఆపవే అల్లరింకా
ఈ అల్లిబిల్లి ఆగడాలు ఏలా
చేరవే చేరవే చంద్రవంకా
చిమ్మి చీకటేగ చిన్నినవ్వు లేకా
నువ్వు వాగల్లే వస్తే
చెలి మెరుపుల అలనే నేనౌతా
చిరుగాలై వీస్తే నే ఎదురుగ నిలబడి అల్లుకుంటా
ఓ…పాపను నేనంటా
ఓ…అమ్మవు నీవంటా
నీలి నీలి కన్నులా నిండిపోవె ఇలా
జాలువారే వెన్నెలా పొంగిపోవే అలా
కలలోన నువ్వే ఇలలోన నువ్వే
కన్నీటి వరదై కమ్మేసినావే
మెత్తగా మత్తుగా మల్లెపువ్వా
నీ చెంపమీద కోటి ముద్దులివ్వా
మెల్లగా చల్లగా చిట్టిగువ్వా
సన్నమూగ సైగ చేసే కాలిమువ్వా
నువు ఎదపై పడుకుంటే నిను ఊపే ఊయల నేనవుతా
చిరునవ్వే వరమిస్తే నీ పెదవిని చినుకై తడిపేస్తా
ఓ…మృదుపాదం నీవంటా
ఓ…నేలను నేనంటా
నీలి నీలి కన్నులా నిండిపోవె ఇలా
జాలువారే వెన్నెలా పొంగిపోవే అలా
కలలోన నువ్వే ఇలలొన నువ్వే
కన్నీటి వరదై కమ్మేసినావే
********* ********* ********
చిత్రం: 143 ( I MISS YOU ) (2004)
సంగీతం: చక్రి
సాహిత్యం: కందికొండ
గానం: రవివర్మ , సునంద
రండీ రండీ పెళ్ళికి రండీ (2)
ఓరోరి దేవుడా మొగుడే రాకా
ఈ పెళ్ళియోగం నాకింక లేదా
వయసు బరువై ఇలా…
నిదర రాదే ఎలా…
ఈ చీరకట్టు నా ఒంటి చుట్టు
బిగించి కట్టిన నిలువదు ఎలా
ఒక్క మగవాడు… ఏడి జతగాడు
హె… చెయ్ పట్టేసుకోరా
హె… ముడి వేసేసి పోరా
హెయ్ ఇక అల్లేసుకోరా
హెయ్ నన్ను గిల్లేసి పోరా
హో…దింతక దింతక దింతక దింతక
హో…దింతక దింతక దింతక దింతక హో…
వస్తడు వస్తడు వస్తడు వస్తడు వస్తడు వస్తడు
కొత్తగా పిల్లడు చాటింగ్ లో చేపలా తగిలాడు
అమెరికా మొగుడని మురిసే నే పొంగిపోయాను
ముఖాన కొంచెం పౌడర్ అద్దిన ఫోటో పంపాడు
కన్నుల మూస్తే కల్లోకొచ్చి కిరికిరి చేసాడు
హ్… తైతక తైతక తైతక తైతక తైతక తైతక తైతక తైతక
కలలింక ఆపక ముందే కన్నుల ముందుకు చేరాడు
ఏముంది తీరాచూస్తే నాలుగు అడుగుల పొట్టోడు
పొట్టి పొట్టి పొట్టి పొట్టి పొట్టి పొట్టి పొట్టి పొట్టి
బలె బలె బలె బలె బలె బలె బలె బలె బలె బలె బలె బలె
సిరిపురం పోరడు ఈడుజోడిలే అన్నారు
ఏం కళైన ఫేసులే సుందరాంగుడే అన్నారు
చేపల చెరువుల రొయ్యల చెరువులు నీవే అన్నారు
ఎక్స్ పోర్టంటు ఇంపోర్టంటు చుక్కలు చూపారు
హ్… తైతక తైతక తైతక తైతక తైతక తైతక తైతక తైతక
ఏముంది తీరా చూస్తే నాకు మామలా ఉన్నాడు
అచ్చంగా ఆ నిలువెత్తు తుమ్మమొద్దు ఆ బండోడు
బల్లా బండ బండర బండ బల్లా బండ బండర బండ బర బర బర బర బర బర బర బర బర బర
ఓరోరి దేవుడా మొగుడే రాకా
ఈ పెళ్ళియోగం నాకింక లేదా
వయసు బరువై ఇలా…
నిదర రాదే ఎలా…
ఈ చీరకట్టు నా ఒంటి చుట్టు
బిగించి కట్టిన నిలువదు ఎలా
ఒక్క మగవాడు… ఏడి జతగాడు
హె… చెయ్ పట్టేసుకోరా
హె… ముడి వేసేసి పోరా
హెయ్ ఇక అల్లేసుకోరా
హెయ్ నన్ను గిల్లేసి పోరా
హ్…రత్తకు రత్తకు రత్తకు రత్తకు
హ్…వస్తడు వస్తడు వస్తడు వస్తడు హ్…
********* ******** ********
చిత్రం: 143 ( I MISS YOU ) (2004)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్
గానం: ఆదర్శిని, వేణు
తా తడి కంటపడి చంపుతున్నారే
వావ్ అనీ వెంటపడీ దంచుతున్నరే
ఆల్రెడీ గుండెసడీ పెంచుతున్నారే
హాయ్ అనీ అడ్దుపడీ ఆపుతున్నారే
కందిరీగలాంటి నడుం కదుపుతున్నారే
దొండపండులాంటి పెదవి కొరుకుతున్నారే
అమ్మోయమాయమ్మా ఏం కులుకుతున్నారే
ఘుమా ఘుమా గుమ్మా గుండెల్లో గుభేలే
తా తడి కంటపడి చంపుతున్నారే
వావ్ అనీ వెంటపడీ దంచుతున్నరే
కందిరీగలాంటి నడుం కదుపుతున్నారే
దొండపండులాంటి పెదవి కొరుకుతున్నారే
అమ్మోయమాయమ్మా ఏం కులుకుతున్నారే
ఘుమా ఘుమా గుమ్మా గుండెల్లో గుభేలే
ఓయ్… ఓ చాందినీ, ఏయ్… ఏ నందినీ
ఓయ్… ఓ అంజనీ ఏంటే ఫోజూ
ఏయ్… మీ కళ్ళుపడి, మేం… కంగారుపడి
మా… బుర్రంతచెడి లైఫే క్లోజూ
ముద్దుగా పిలవడం ముగ్గులో దించడం ప్రేమలో ముంచడం చేస్తారంట
ఏంటీ మార్కులు నీలో మార్పులు అంటూ ఇంట్లో తిడతారంట
హే దేఖో రే మా జోరే
మీరే మ్యాచీసు మీరే మిర్చీసు మీతో వర్రీసు తడి తడి తడి తడి
తా తడి కంటపడి చంపుతున్నారే
వావ్ అనీ వెంటపడీ దంచుతున్నరే
మేం… మేం ఇష్టపడి, మేం… మేం కష్టపడి
మేం… మేం మోజుపడి ఎన్నో చేశాం
ఆ… ఆ సైగలకే, ఆ… ఆ నవ్వులకే
ఆ… ఆ చేష్టలకే బకరాలయ్యాం
అయ్యో దేవుడా ఆలోచించకా అన్నీ వాళ్ళకే ఇచ్చేశావా?
మళ్ళీ జన్మలో మా అందర్నీ లేడీసల్లె పుట్టించవా?
చాల్లేరా… మీగోలా మేమే ఆల్వేజు ఎంతో హేపీసు
మీరే బేవార్స్ తడి తడి తడి తడి…
తా తడి కంటపడి చంపుతున్నారే
వావ్ అనీ వెంటపడీ దంచుతున్నరే
ఆల్రెడీ గుండెసడీ పెంచుతున్నారే
హాయ్ అనీ అడ్దుపడీ ఆపుతున్నారే
కందిరీగలాంటి నడుం కదుపుతున్నారే
దొండపండులాంటి పెదవి కొరుకుతున్నారే
అమ్మోయమాయమ్మా ఏం కులుకుతున్నారే
ఘుమా ఘుమా గుమ్మా గుండెల్లో గుభేలే
తా తడి కంటపడి చంపుతున్నారే
వావ్ అనీ వెంటపడీ దంచుతున్నరే
కందిరీగలాంటి నడుం కదుపుతున్నారే
దొండపండులాంటి పెదవి కొరుకుతున్నారే
అమ్మోయమాయమ్మా ఏం కులుకుతున్నారే
ఘుమా ఘుమా గుమ్మా గుండెల్లో గుభేలే
*********** ********* ********
చిత్రం: 143 ( I MISS YOU )
సంగీతం: చక్రి
సాహిత్యం: కందికొండ
గానం: చక్రి
ఎందుకనీ… ఎందుకనీ… ఏమిటనీ… ఏమిటనీ…
బిగి బిగి చెరసాలా బిగిసెను ప్రియురాలా
చిటపట చిరుజ్వాలా కురిసెను హృదయాలా
మనసే అవుతోంది మసిబారిన కిరణంలా
వలపే మిగిలింది తడి ఆరని నయనంలా
అమావాస్యపు గగనంలా
ఎందుకనీ… ఏమిటనీ…
నీ అడుగులలో అడుగులు వేసి నడిచిన బంధమిలా
ఒంటరి తనమై క్షణమొక యుగమై మిగిలే ఏమిటిలా
ఆరిన పెదవుల మాటలికా… నామాటలికా నామాటలికా
చేరున చెలి నీదాకా… దాకా… దాకా… దాకా
ప్రియతమా నమ్ముమా ప్రాణం వున్నది నీకోసం
నా కనులలో నిన్నటి నీరూపం
ఎందుకనీ…. ఎందుకనీ…. ఎందుకనీ…. ఎందుకనీ…. ఏమిటనీ….
వెలుగులు చిలికే చిరు జాబిలని మబ్బులు కమ్మె ఇలా
చిగురులు తొడిగే చిరు నగవులపై చీడే చేరెనెలా
చిలిపిగా చేసిన బాసలిలా… ఆ బాసలిలా ఆ బాసలిలా
నా మదినే తొలిచేనా… తొలిచేనా
కాటుకై చేరనా కంటిలో దాగిన కన్నీరై నీ చెక్కిలి తాకన చిరు ఆశై
ఎందుకనీ…. ఏమిటనీ….
బిగి బిగి చెరసాలా బిగిసెను ప్రియురాలా
చిటపట చిరుజ్వాలా కురిసెను హృదయాలా
మనసే అవుతోంది మసిబారిన కిరణంలా
వలపే మిగిలింది తడి ఆరని నయనంలా
అమావాస్యపు గగనంలా