180 (2011)

చిత్రం: 180 (2011)
సంగీతం: శరత్
సాహిత్యం: వనమాలి
గానం: చిత్ర, సౌమ్య, ఆనంద్ అరవిందాక్షన్
నటీనటులు: సిద్దార్ధ్, నిత్యామీనన్, ప్రియ ఆనంద్
దర్శకత్వం: జయేంద్ర
నిర్మాతలు: కిరణ్ రెడ్డి, స్వరూప్ రెడ్డి, సి. శ్రీకాంత్
విడుదల తేది: 25.06.2011

నిన్న లేని వింతలే చూపెనే కంటిపాపలే
మోములన్ని చింతగా చూడని వెండి నవ్వులే
నీ కన్నుల్నే చూస్తూ కాలాలే దాటేలా
చిరునవ్వే నాదయ్యేనా
నిన్న లేని వింతలే చుపెనే కంటిపాపలే

నీ లో ఆ కసి గుసలే ప్రేమే వల్లించేనా
పలుకే అలిసే పెదవే సెధ తీరేలా
నిరకం నిలిచే పనులే చేద్దాం చేతల్లో
రి ని రి గ రి –  బ్రతుకున ఓఓ
రి మ ని ప గ రి – పరమార్ధమే
మనసా కోరే తీరి
రి గ మ ప ద ని స – మనిషిగా – నిలపదా

నిన్న లేని వింతలే చుపెనే కంటిపాపలే
మోములన్ని చింతగా చూడని వెండి నవ్వులే

నీతో ఈ పయనాలే రోజూ కొనసాగేనా
మలుపే తిరిగే పెరిగే బహుదూరాలే
మననే కడకు నిలిపే గమ్యం నీదైనా
ఆఆ ద ని ద మ గ రి – నిను విడని
రి ప మ ని ప గ రి – చిరు సంబరం
ద ని స ని నీతో నీడై
గ మ ప ద ని స – కదిలితే – చాలదా

నిన్న లేని వింతలే చుపెనే కంటిపాపలే
మొములన్ని చింతగా చూడని వెండి నవ్వులే
నీ కన్నుల్నే చూస్తూ కాలాలే దాటేలా
నీ నవ్వే చిరునవ్వే నాదయ్యేనా…

Your email address will not be published. Required fields are marked *

Previous
Indra (2002)

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

See More Lyrics
Bhargava Ramudu (1987)
error: Content is protected !!