Seetimaarr (2021)

జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి… లిరిక్స్

చిత్రం: సీటీమార్ (2021)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: మంగ్లీ, శంకర్ బాబు
నటీనటులు: గోపీచంద్, తమన్నా
దర్శకత్వం: సంపత్ నంది
నిర్మాణం: శ్రీనివాసా చిట్టూరి
విడుదల తేది: 02.04.2021

Jwala Reddy Song Telugu Lyrics

ఓయ్..! జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి
తెలంగాణ బిడ్డరో… కారా బూందీ లడ్డురో
కారా బూందీ లడ్డురో… ఆడించే కబడ్డిరో
జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి
జ్వాలారెడ్డి… ఓయమ్మో జ్వాలారెడ్డి

జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి
తెలంగాణ బిడ్డరో… కారా బూందీ లడ్డురో
కారా బూందీ లడ్డురో… ఆడించే కబడ్డిరో

బాలారెడ్డి బాలారెడ్డి
ఆంధ్ర టీము హెడ్డురో… కోనసీమ బ్లడ్డురో
కోనసీమ బ్లడ్డురో… పోరడు ఏ టూ జెడ్ రో
బాలారెడ్డి బాలారెడ్డి
బాలారెడ్డి… ఓరయ్యో బాలారెడ్డి

బాలారెడ్డి బాలారెడ్డి
ఆంధ్ర టీము హెడ్డురో… కోనసీమ బ్లడ్డురో
కోనసీమ బ్లడ్డురో… పోరడు ఏ టూ జెడ్ రో

జాజిరి జాజిరి జ జ
కాముని ఆటకు రారా రాజా
డిమిడిమి డిమిడిమి డిమిడిమి
జాజిరి జాజిరి జ జ
జామ చెట్లల్ల ఆటకు వచ్చా
డిమిడిమి డిమిడిమి డిమిడిమి

గోరింటాకు మెత్తగా నూరి… గోరుముద్దలు మింగావా
అంతా ఎర్రగా పుట్టావే… అందరి కడుపులు కొట్టావే
ఇనప గుండ్లు, మినప గుండ్లు… అట్లూ పోసుకు తిన్నావా
హట్టకట్టా ఉన్నవ్ రో… అట్లా ఎట్లా కన్నదిరో

జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి
పోరి చూస్తే కత్తిరో… ఫిగరు అగరు బత్తిరో
ఫిగరు అగరు బత్తిరో… ఇది అసలు మీద మిత్తిరో

బాలారెడ్డి బాలారెడ్డి
ఏసినాడు దస్తిరో… గుండెలోన దాస్తిరో
గుండెలోన దాస్తిరో… వీడు నాకు ఆస్థిరో

హే మామా… ఏస్కోరా బీటు
రిమరిమరిమ రిమరిమరిమ… రిమరిమరిమ
హే రిమరిమరిమ రిమరిమ
ఎయ్, కొట్టో… హే జులి జులి జులి జుబ
జులి జులి జులి జుబ… హ అహ్హా, హ అహ్హా
ఐపాయ్… అబ్బ దుబ్బరేపినవ్ పో

ముద్దు పెట్టుకుంటే సౌండు… మూడు ఊర్లు మొగాలే
వాటేసుకుంటే చాలే… ఊరువాడా సవ్వాలే
నడుమే ఉన్నది నడిమిట్లా… ఇరికిందయ్యో పిడికిట్లా
ఏంజేస్తావో సీకట్ల… ఇజ్జతు తియ్యకు వాకిట్ల

జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి
జీలకర్ర బెల్లమే… నువ్వు నాకు పెండ్లమే
నువ్వు నాకు పెండ్లమే… పూలు పండ్ల పళ్ళెమే

బాలారెడ్డి బాలారెడ్డి
సాప తెచ్చుకుంటరో… నీ సాతి మీద పంటరో
సాతి మీద పంటరో… శానా మందిని కంటరో

Seetimaarr Movie Songs Telugu Lyrics

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

సీటిమార్ సీటిమార్… లిరిక్స్

చిత్రం: సీటీమార్ (2021)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: అనురాగ్ కులకర్ణి, రేవంత్, వరం
నటీనటులు: గోపీచంద్, తమన్నా
దర్శకత్వం: సంపత్ నంది
నిర్మాణం: శ్రీనివాసా చిట్టూరి
విడుదల తేది: 02.04.2021

Seetimaarr Title Song Telugu Lyrics

గెలుపు సూరీడు చుట్టు తిరిగేటి… పొద్దు తిరుగుడు పువ్వా
మా పాపికొండల నడుమ… రెండు జెల్లేసిన చందమామ నువ్వా
మలుపు మలుపూలోన గలగల పారేటి… గోదారి నీ నవ్వా
నీ పిలుపు వింటే చాలు… పచ్ఛా పచ్చాని చేలు ఆడెనే సిరిమువ్వా

సీటిమార్ సీటిమార్… సీటిమార్ మార్ మార్
కొట్టు కొట్టూ ఈలే కొట్టు… ఈలే కొట్టు ఈలే కొట్టు
ప్రపంచమే వినేటట్టు… వినేటట్టు వినేటట్టు
దించితేనే అడుగులు ఈ నేల గుండెపై
ఎదుగుతావు చిగురులా… ఎత్తితేనే నీ తల
ఆకాశం అందుతూ… ఎగురుతావు జెండాలా
గెలుపే నడిపే బలమే గెలుపే

కబడ్డి కబడ్డి కబడ్డి… కబడ్డి కబడ్డి కబడ్డి
సీటిమార్ సీటిమార్… సీటిమార్ సీటిమార్ సీటిమార్
ఓయెఓ ఓయెఓ ఓయెఓ ఓ ఓ
ఓయెఓ ఓఓ ఓఓ
ఓయెఓ ఓయెఓ ఓయెఓ ఓ ఓ
ఓయెఓ ఓఓ ఓఓ

అలా పట్టుపావడాలు… నేడు పొట్టి నిక్కరేసే జట్టుకాగా
చలో ముగ్గులేసె చెయ్యి నేడు… బరికి ముగ్గు గీసెలే భలేగా
ఉన్నసోట ఉండిపోక అలాగ చిన్నదైనా రెక్క విప్పే తూనీగ
లోకమంత చుట్టు గిరగిరా
కబడ్డి కబడ్డి కబడ్డి… కబడ్డి కబడ్డి కబడ్డి
సీటిమార్ సీటిమార్… సీటిమార్ సీటిమార్ సీటిమార్

కబడ్డి కాంచన దూది మెత్తన
ఎగిరి తందున పాయింట్ తెద్దున
పచ్చి ఉల్లిపాయ్ పాణమెల్లిపాయ్
చెడుగుడు చెడుగుడు… చెడుగుడు చెడుగుడు

సదా ధైర్యమే నీ ఊపిరైతే… చిమ్మచీకటైనా వెన్నెలేగా
పదా లోకమేసే రాళ్ళనైనా మెట్లు చేసి నువ్వు పైకి రాగా
జంకు లేక జింకలన్నీ ఇవ్వాలే… చిరుతనైనా తరుముతుంటే సవాలే
చెమట చుక్క చరిత మార్చదా
కబడ్డి కబడ్డి కబడ్డి…
సీటిమార్ సీటిమార్… సీటిమార్ సీటిమార్ సీటిమార్

Seetimaarr Movie Songs Telugu Lyrics

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

3 thoughts on “Seetimaarr (2021)”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top