24 (2016)

చిత్రం: 24 (2016)
సంగీతం: ఏ.అర్.రెహమాన్
సాహిత్యం: చంద్రబోస్
గానం: నిత్యామీనన్
నటీనటులు: సూర్యా , సమంత , నిత్యామీనన్
దర్శకత్వం: విక్రమ్ కుమార్
నిర్మాత: సూర్యా
విడుదల తేది: 06.05.2016

లాలీజో… లాలీజో…
కన్నాజో…  చిన్నిరాజుకు లాలీజో
లాలీజో… లాలీజో…
కన్నాజో…  చిన్నిరాజుకు లాలీజో
లేతవేళ్ళుకు లాలీజో
లేలేతకాళ్ళకు లాలీజో

నాలోని కళలను వెలిగించే
నీళాల కళ్ళకు లాలీజో
నీ చిట్టి చేతుల సైగలతో
నీ చుట్టు గాలై తిరిగానే

నీ చిరు గుండెల సవ్వడిలో
నింపానురా నా కాలాన్ని

లాలీజో… లాలీజో…
కన్నాజో…  చిన్నిరాజుకు లాలీజో

జన్మం ఉంది ప్రతి జీవికి
ఏదో అర్ధం ఉంటుందిరా

నాకు అర్ధం నువ్వేరా
నాకు అర్ధం నువ్వేరా
తపస్సు నీకై చేస్తున్నా
నా ఆయుస్సు నీకే పోస్తున్న
సిరుల నెలవో లాలీజో

చిత్రాల కొలువా లాలీజో
సిరుల నెలవో లాలీజో
చిరంజీవా లాలీజో
లాలీజో… లాలీజో…
కన్నాజో…  చిన్నిరాజుకు లాలీజో
లాలీజో… లాలీజో…
కన్నాజో…  చిన్నిరాజుకు లాలీజో
కన్నాజో…  చిన్నిరాజుకు లాలీజో
చిన్నిరాజుకు లాలీజో

*******     *******     *******

చిత్రం: 24
సంగీతం: ఏ.అర్.రెహమాన్
సాహిత్యం: చంద్రబోస్
గానం: హ్రిదయ్ గట్టాని, చిన్మయ శ్రీపద

ప్రేమ పరిచయమే దైవదర్శనమే
ప్రేమ స్వరములలో దైవస్మరణములే
అది తెలిసింది తొలిసారి నీ ప్రేమతో
మది మునిగింది నీ ప్రేమలో
ప్రేమ పరిచయమే దైవదర్శనమే
ప్రేమ అడుగులలో దేవతార్చనమే

చరణం: 1
కోకిలసలు కోరుకొనని ప్రేమ తపస్సు మనదిలే
అతిధులెవరు ఎదురు పడని ప్రేమ తిధులు మనవే అమృతములు ఎగసిపడిన ప్రేమ నదులు మనవే
చరితల కాగితాల లోన చెలిమిలేని ప్రేమనే నీలో చదివా ఈ క్షణమే
ప్రేమ పరిచయమే  దైవదర్శనమే
ప్రేమ అడుగులలో దేవతార్చనమే

చరణం: 2
హృదయ గళము పాడుతున్న ప్రేమ గీతి మనదిలే
కనుల కలము రాసుకున్న ప్రేమ లేఖ మనదే
పెదవి ప్రమిద పంచుతున్న ప్రేమ జ్యోతి మనదే
మనుషుల ఊహాలోన సైతం ఉండలేని ప్రేమతో ఎదుటే ఉన్నా ఈ క్షణాలలో
ప్రేమ పరిచయమే  దైవదర్శనమే
ప్రేమ అడుగులలో దేవతార్చనలే
అది తెలిసింది తొలిసారి నీ ప్రేమతో మది మునిగింది నీ ప్రేమలో
ప్రేమ పరిచయమే  దైవదర్శనమే
ప్రేమ స్వరములలో దైవస్మరణములే
అది తెలిసింది తొలిసారి నీ ప్రేమతో మది మునిగింది నీ ప్రేమలో
ప్రేమ పరిచయమే దైవదర్శనమే

Previous
Nijam (2003)
error: Content is protected !!