30 Rojullo Preminchadam Ela (2020)

మీకో దండం లిరిక్స్

అరె! ఆడవాళ్ళ మాటలకు అర్థాలెన్నో
అన్నాడు పవను కళ్యాణన్న…
ఆడవాళ్ళ లైఫ్ లోన లాభాలెన్నో
చెబుతున్న నేను చూడన్న…

ఓయ్…
ఫేసుబుక్కు లోన లైకులు మీకే
మిస్టేకు మీదైనా సింపథీ మీకే..
నక్క తోక కాదు, అమ్మాయిలూ దాని అక్క తోక తొక్కినారే..

ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్…

వద్దొద్దు తల్లోయ్ మీకో దండం
వద్దొద్దు తల్లోయ్ మీకో దండం
వద్దొద్దు తల్లోయ్ మీకో దండం
అరె! వద్దొద్దు తల్లోయ్ మీకో దండం

అయ్యో రామ అయ్యో రామ
అబ్బాయిలే మీరు.. అదృష్టానికి జిరాక్స్ లే.. ఓ
ఇంటిపేరు నిలబెట్టే వారసులంటూ
మీరు పుట్టగానే పెద్ద సర్టిఫికెట్…

చొక్కా విప్పేసుకుంటే స్టైల్ అంటారే
మా చున్నీ జారితే, రచ్చ రచ్చ అవుతుందే…

నైట్ అంతా మీరింకా ఫ్రీక్ అవుట్ లే
మేము లేటైతే, ఇంట్లోనా షూట్ అవుట్ లే…
మీరు ఎంత మంది అమ్మాయిలతో
తిరిగేస్తూ ఉన్నా కృష్ణుడితో పోలుస్తారే..

ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్…

వద్దొద్దు బాబోయ్ మీకో దండం
వద్దొద్దు బాబోయ్ మీకో దండం
వద్దొద్దు బాబోయ్ మీకో దండం
అరె! వద్దొద్దు బాబోయ్ మీకో దండం

దండం … దండం .. దండం … దండం …

ట్వంటీ రూపీస్తో బ్రదర్ కె రాఖీ కడతారే
టోటల్ పర్సు అంతా గుంజుతారే.. ఓయ్ ఓయ్..

అర్జెంటు అంటారే సిస్టర్ నే అప్పడిగేస్తారే
ఆపై ఐపీ పెడతారే, ముంచుతారే… ఓయ్ ఓయ్..

ఫోన్ బిల్లు, ఫుడ్డు బిల్లు… గుళ్ళోన వేసే హుండీ బిల్లు
బాయ్ ఫ్రెండు జేబు నుండి కొల్లగొడతారే…

చైల్డ్ హుడ్ నుండి చదువుల బిల్లు,
గర్ల్ ఫ్రెండ్స్ అందరికీ కట్టిన బిల్లు
జిఎస్టి తో కలిపి డౌరీ రూపంలో దోచేసుకుంటారే..

ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్…

వద్దొద్దు బాబోయ్ మీకో దండం
వద్దొద్దు బాబోయ్ మీకో దండం
వద్దొద్దు తల్లోయ్ మీకో దండం
అరె! వద్దొద్దు తల్లోయ్ మీకో దండం

దండం… దండం…

స్ట్రాంగ్ గా మేమంటే.. అట్టిట్యూడ్ అంటూ తిడతారే
అది మీలో ఉంటే కాన్ఫిడెన్సే…

మీకేమన్నైతే మీడియా సపోర్టు చేస్తుందే
మాకేమన్నైతే ఎవడూ రాడే.. ఓయ్ ఓయ్..

మ్యారేజ్ మీకైతే ఫామిలీతో మీరు కలిసుంటారే
మేమేమో పేరెంట్స్ ని వదిలేసి వెళ్ళాలే

పెద్దవాళ్ళే మ్యాచే చూస్తారంటూ చిన్న సారీ చెప్పి
మీరే హ్యాండే ఇస్తే మా సేతిలోన సీసాలే..

అరె! మా సేతిలోనా సీసాలే
మీకు ఫారిన్ వీసా లే..

వద్దొద్దు తల్లోయ్ మీకో దండం
వద్దొద్దు బాబోయ్ మీకో దండం
వద్దొద్దు తల్లోయ్ మీకో దండం
అరె! వద్దొద్దు బాబోయ్ మీకో దండం

ఇదేరా స్నేహం లిరిక్స్

ఇదేరా స్నేహం 
ఇదేరా స్నేహం 
ఇదేరా స్నేహం 
ఇదేరా స్నేహం
కని విని ఎరుగని స్నేహం 
ఇది కాలం చూడని స్నేహం 
దేహం అడగని స్నేహం 
ఇది హృదయం అడిగే స్నేహం
నింగిని నేలని వానా చినుకై
కలిపే స్నేహం
తూర్పుకి పడమరకి
కాంతి తోరణం అయ్యిందే స్నేహం
ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం
ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం
ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం
ఇదేరా స్నేహం
కని విని ఎరుగని స్నేహం 
ఇది కాలం చూడని స్నేహం
దేహం అడగని స్నేహం
ఇది హృదయం అడిగే స్నేహం
హూ మీ మధ్యన ఉంటానంటూ
బతిమాలింది చిరుగాలి
మీ పాదమ్తాకాలంటూ
అలలైంది ఆ కడలి
తన మచ్చను
మీ స్వచ్చత తో
కడగాలంది జాబిల్లి
మీ భారం మోసేటందుకే
పుట్టానంది ఈ పుడమి
ఆశలు ఆకర్షనలు లేనిదే
మీ ఆడా మగ స్నేహం
నీతోనే ఇంకో నువ్వే
చేసే స్నేహమే
మీ ఇద్దరి స్నేహం
ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం 
ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం
ఇదేరా స్నేహం
హో తన చూపులు
నువ్వు చూస్తుంటే
నీ కలలను తానూ కంటోంది
తన మాటలు నువ్వు అంటుంటే
నీ నవ్వులు తాను నవ్వింది
తను అడుగులు వేస్తూ ఉంటే
గమ్యమ్ నువ్వే చేరావు
నీలో నువ్వు చేయని పనులే
నీలా తానే చేసేను
జన్మలే చాలక
మల్లీ మల్లీ జన్మిన్చే స్నేహం
దేవూడే ప్రేక్షకుడై
చూసి చూసి మురిసే మీ స్నేహం
ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం
ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం
ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం
ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం

నీలి నీలి ఆకాశం ఇద్దాం అనుకున్నా లిరిక్స్

నీలి నీలి ఆకాశం ఇద్దాం అనుకున్నా
మబ్బులు నిన్ను కమ్మేస్తాయని
మానేస్తూ ఉన్నా 
నెలవంకను ఇద్దామనుకున్నా
ఒహోహో నీ నవ్వుకు
సరిపోదంటున్నా 

నువ్వే నడిచేటి తీరుకే 
తారలు మొలిచాయి నేలకే 
నువ్వే వదిలేటి శ్వాసకే 
గాలులు బ్రతికాయి చూడవే 
ఇంత గొప్ప అందగత్తెకి ఏమి ఇవ్వనే 

నీలి నీలి ఆకాశం ఇద్దాం అనుకున్నా 
మబ్బులు నిన్ను కమ్మేస్తాయని 
మానేస్తూ ఉన్నా 

ఓహో వానవిల్లులో 
ఉండని రంగు నువ్వులే 
ఏ రంగుల చీరను నీకు నేయాలే 
నల్ల మబ్బులా మెరిసే కళ్ళు నీవిలే 
ఆ కళ్ళకు కాటుకా ఎందుకేట్టాలే 
చెక్కిలిపై చుక్కగా దిష్టే పెడతారులే 
నీకైతే తనువంతా ఆ చుక్కను పెట్టాలే 

ఎదో ఇవ్వాలి కానుకా ఎంతో వెతికాను ఆశగా 
ఏది నీ సాటి రాదికా  అంటూ ఓడాను పూర్తిగా 
కనుకే ప్రాణమంతా తాళి చేసి నీకు కట్టనా 
నీలి నీలి ఆకాశం ఇద్దాము అనుకున్నా 
నీ హృదయం ముందర 
ఆకాశం చిన్నది అంటున్నా 

ఓహో అమ్మ చూపులో 
వొలికే జాలి నువ్వులే 
ఆ జాలికి మారుగా ఏమి ఇవ్వాలే . 
నన్ను వేలితో నడిపే  ధైర్యమే నీదే 
నీ పాపనై పసి పాపనై ఏమి ఇవ్వాలే 
దయగలిగిన దేవుడే మనలను కలిపాదులే 
వరమోసిగే దేవుడికే నేనేమి తిరిగివ్వాలె 
ఎదో ఇవ్వాలి కానుక ఎంతో వెతికాను ఆశగా 
ఏది నీ సాటి రాదికా  అంటూ అలిసాను పూర్తిగా 
కనుకే మళ్ళీ మళ్ళీ జన్మనేత్తి నిన్ను చేరనా 
నీలి నీలి ఆకాశం ఇద్దాము అనుకున్నా 
మబ్బులు నిన్ను కమ్మేస్తాయని 
మానేస్తూ ఉన్నా