A Aa E Ee (2009)

చిత్రం: అ ఆ ఇ ఈ (2009)
సంగీతం: యమ్.యమ్.శ్రీలేఖ
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: కార్తిక్, యమ్.యమ్.శ్రీలేఖ
నటీనటులు: శ్రీకాంత్ , సదా, మీరా జాస్మిన్
దర్శకత్వం: శ్రీనివాస రెడ్డి
నిర్మాతలు: బొద్దం అశోక్ యాదవ్
విడుదల తేది: 06.11.2009

పల్లవి:
అచ్చట ముచ్చట తీరాలట ఇప్పుడే ఇచ్చట
ఎచ్చట ఎచ్చట ఏవైనట సంగతే చెప్పటా
చీకటైతే చాలట చీర చాటు గోలట
రాజుకుంటే ఈడట దానిపేరె మూడట
ఊరుకోరాదట ఊసులాడాలట
ఊయలూపాలటా ట ట ట ట ట ట

అచ్చట ముచ్చట తీరాలట ఇప్పుడే ఇచ్చట
ఎచ్చట ఎచ్చట ఏవైనట సంగతే చెప్పట

చరణం: 1
మొట్టమొదట నుదుటిమీద చెమట
వెల్లువై నదిలా మారింది
చుట్టుకొలత చూడగానే చిలక
భగ్గుమని వయసే రగిలిందే
ఎగుడు దిగుడు వెతికే దారుల్లో
జడతో జగడం జరిగేవేళల్లో
కన్నె కనకాంబరం సోకు చీనాంబరం
అరె తిరగ మరగ నలగలంటా ట ట ట ట ట ట

అచ్చట ముచ్చట
అచ్చట ముచ్చట తీరాలట ఇప్పుడే ఇచ్చట
ఎచ్చట ఎచ్చట ఏవైనట సంగతే చెప్పటా

చరణం: 2
పట్టి మంచం కిర్రుమంటు గొడవ
యవ్వనం ఈలలు వేస్తుంటే
ఇంత మైకం ఇందులోన కలదా
నరనరం మెళికలు పడుతుంటే
ఒకటి ఒకటి కలిసే చప్పట్లో
అలుపు సొలుపు రాదే ఇప్పట్లో
నేనే గుడిగోపురం నీవే నా పావురం
నా ఎదపై నువ్వే వాలాలంటా ట ట ట ట ట ట

అచ్చట ముచ్చట
అచ్చట ముచ్చట తీరాలట ఇప్పుడే ఇచ్చట
హా… ఎచ్చట ఎచ్చట ఏవైనట సంగతే చెప్పటా
చీకటైతే చాలట చీర చాటు గోలట
రాజుకుంటే ఈడట దానిపేరె మూడట
ఊరుకోరాదట ఊసులాడాలట
ఊయలూపాలటా హ హ హ హ హ హ

అచ్చట ముచ్చట హు హు హు ఇప్పుడే ఇచ్చట
ఎచ్చట ఎచ్చట హు హు సంగతే హు హు హు

error: Content is protected !!