చిత్రం: ఆడపడచు (1967)
సంగీతం: టి. చలపతిరావు
సాహిత్యం: దాశరధి
గానం: పి . సుశీల
నటీనటులు: యన్.టి.ఆర్, శోభన్ బాబు, వాణిశ్రీ, చంద్రకళ
నిర్మాత, దర్శకత్వం: కె.హేమాంబరదర రావు
విడుదల తేది: 30.11.1967
అన్నా నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం
ఓ అన్నా నీ అనురాగం..
పుట్టిన రోజున మీదీవేనలే వెన్నెల కన్నా చల్లదనం
ఓ అన్నా నీ అనురాగం..
మల్లెలవంటి మీమనసులలో చెల్లికి చోటుండాలి
ఎల్లకాలము ఈతీరుగానే చెల్లిని కాపాడాలి..
పుట్టిన రోజున మీదీవేనలే వెన్నెల కన్నా చల్లదనం
ఓ అన్నా నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం ఓ అన్నా..
అన్నలు మీరే నాకన్నులుగా నన్నే నడిపించాలి
తల్లీ తండ్రీ సర్వము మీరై దయతో దీవించాలి
పుట్టిన రోజున మీదీవేనలే వెన్నెల కన్నా చల్లదనం
ఓ అన్నా నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం ఓ అన్నా..
ఇల్లాలినై నేనెచటికేగినా చెల్లిని మదిలో నింపాలి
ఆడపడచుకు అన్నివేళలా తోడూ నీడగా నిలవాలి
పుట్టిన రోజున మీదీవేనలే వెన్నెల కన్నా చల్లదనం
ఓ అన్నా నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం ఓ అన్నా..