చిత్రం: ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే (2007)
సంగీతం: యావన్ శంకర్ రాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు
నటీనటులు: వెంకటేష్ , త్రిష , శ్రీకాంత్ (శ్రీరామ్)
దర్శకత్వం: శ్రీ రాఘవ (సెల్వ రాఘవన్)
నిర్మాతలు: యన్.వి.ప్రసాద్, యస్.నాగ అశోక్ కుమార్
విడుదల తేది: 17.04.2007
అల్లంత దూరాల ఆ తారక కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా
అరుదైన చిన్నారిగా
కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా
భూమి కనలేదు ఇన్నాళ్ళుగా ఈమెలా ఉన్న ఏ పోలిక
అరుదైనా చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా
అల్లంత దూరాల ఆ తారక
కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా
చరణం: 1
కన్యాదానంగా ఈ సంపద చేపట్టే ఆ వరుడు శ్రీహరి కాడా
పొందాలనుకున్నా పొందే వీలుందా అందరికి అందనిదీ సుందరి నీడ
ఇందరి చేతులు పంచిన మమత పచ్చగా పెంచిన పూలతో
నిత్యం విరిసే నందనమవదా
అందానికే అందం అనిపించగా
దిగివచ్చినొ ఏమో దివి కానుక
అరుదైనా చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా
చరణం: 2
తన వయ్యారంతో ఈ చిన్నది లాగిందో ఎందరిని నిలబడనీకా
ఎన్నో ఒంపులతో పొంగే ఈ నది తనే మదిని ముంచిందో ఎవరికి ఎరుకా
తొలిపరిచయమొక తియ్యని కలగా
నిలిపిన హృదయమే సాక్షిగా
ప్రతి జ్ఞాపకం దీవించగా చెలి జీవితం వెలిగించగా…
అల్లంత దూరాల ఆ తారక
కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా
******** ********* *********
చిత్రం: ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే (2007)
సంగీతం: యావన్ శంకర్ రాజా
సాహిత్యం: కులశేఖర్
గానం: ఉదిత్ నారాయణ్
Can you feel her?
Is your heart speaking to her?
Can you feel the love?
Yes…
ఏమైందీ ఈ వేళా ఎదలోఈసందడేలా
మిల మిల మిల మేఘమాలా చిటపట చినుకేయువేళా
చెలి కులుకులు చూడ పల్లవి:
ఏమైందీ ఈ వేళా ఎదలోఈసందడేలా
మిల మిల మిల మేఘమాలా చిటపట చినుకేయువేళా
చెలి కులుకులు చూడగానే చిరు చెమటలు పోయనేలా
ఏ శిల్పి చెక్కెనీ శిల్పం సరికొత్తగా ఉంది రూపం
కనురెప్ప వేయనీదు ఆ అందం
మనసులోన వింతమోహం
మరువలేని ఇంద్రజాలం వానలోన ఇంత దాహం
చరణం: 1
చినుకులలో వానవిల్లూ నేలకిలా జారెనే
తళుకుమనే ఆమె ముందూ వెలవెల వెలబోయెనే
తన సొగసే తీగలాగ నా మనసే లాగెనే
అది మొదలు ఆమె వైపే నా అడుగులు సాగెనే
నిశీధిలో ఉషోదయం ఇవాళిలా ఎదురే వస్తే
చిలిపి కనులు తాళమేసే చినుకు తడిపి చిందులేసే
మనసు మురిసి పాట పాడే తనువు మరిచి ఆటలాడే
ఏమైందీ ఈ వేళా ఎదలో ఈ సందడేలా
మిల మిల మిల మేఘమాలా చిటపట చినుకేయు వేళా
చెలి కులుకులు చూడగానే చిరు చెమటలు పోయనేలా
చరణం: 2
ఆమె అందమే చూస్తే మరి లేదు లేదు నిదురింకా
ఆమె నన్నిలా చూస్తే ఎద మోయలేదు ఆ పులకింత
తన చిలిపి నవ్వుతోనే పెను మాయ చేసేనా
తన నడుము ఒంపులోనే నెలవంక పూచెనా
కనుల ఎదుటే కలగ నిలిచా
కలలు నిజమై జగము మరిచా
మొదటిసారి మెరుపు చూశా కడలిలాగే ఉరకలేశా
********* ********** ********
చిత్రం: ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే (2007)
సంగీతం: యావన్ శంకర్ రాజా
సాహిత్యం: చంద్రబోస్
గానం: కార్తీక్, గాయత్రి అయ్యర్
నా మనసుకి ప్రాణం పోసీ..
నీ మనసును కానుక చేసీ
నిలిచావే ప్రేమను పంచీ ఓ ఓ ఓ ఓ ఓ
ఒహొ హొ ఓ ఓ ఓ ఓ
నా మనసుకి ప్రాణం పోసి
నీ మనసుని కానుక చేసి
నిలిచావే ప్రేమను పంచి ఓ ఓ ఓ ఓ ఓ
నా వయసుకి వంతెన వేసి
నా వలపుల వాకిలి తీసి
మది తెర తెరిచి ముందే పరచి
ఉన్నావు లోకం మరిచి
నా మనసుకి ప్రాణం పోసీ
నీ మనసును కానుక చేసీ
నిలిచావే ప్రేమను పంచీ ఓ ఓ ఓ ఓ ఓ
ఒహొ హొ ఓ ఓ ఓ ఓ
నీ చూపుకి సూర్యుడు చలువాయే
నీ స్పర్శకి చంద్రుడు చెమటాయే
నీ చొరవకి నీ చెలిమికి మొదలాయే మాయే మాయే
నీ అడుగుకు ఆకులు పువులాయే
నీ కులుకికి కాకులు కవులాయే
నీ కలలకి నీ కథలకి కదలాడే హాయే హాయే
అందంగా నన్నే పొగిడి అటుపైన ఏదో అడిగి
నా మనసునె ఒక సరసులో అలజడులే సృష్టించావే
నా మనసుకి ప్రాణం పోసీ
నీ మనసును కానుక చేసీ
నిలిచావే ప్రేమను పంచీ ఓ ఓ ఓ ఓ ఓ
ఒహొ హొ ఓ ఓ ఓ ఓ
ఒక మాట ప్రేమగ పలకాలే
ఒక అడుగు జత పడి నడవాలే
ఆ గురుతులు నా గుండెలో
ప్రతి జన్మలో పదిలం పదిలం
ఒక సారి ఒడిలో ఒదగాలే
ఎద పైన నిదుర పోవాలే
తీయ తీయని నీ స్మృతులతో
బ్రతికేస్తా నిమిషం నిమిషం
నీ ఆశలు గమనించాలే
నీ ఆత్రుత గుర్తించాలే
ఎటు తేలక బదులీయక మౌనంగా చూస్తున్నాలే
*********** ********* *********
చిత్రం: ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే (2007)
సంగీతం: యావన్ శంకర్ రాజా
సాహిత్యం: చంద్రబోస్
గానం: హరిచరన్ , జెన్నీ మతాంగి, భార్గవి పిళ్ళై
ఓ బేబీ ఓ బేబీ
ఓ బేబీ ఓ బేబీ
యు ఆర్ సో సెక్సీ
ఓ బేబీ ఓ బేబీ
ఓ బేబీ ఓ బేబీ
యు ఆర్ గివ్ టచ్ మీ
కళ్లలో స్వర్గం నువ్వే
గుండెలో నరకం నువ్వే
మాటలో మధురం నువ్వే
గొంతులో గరళం నువ్వే
నా ప్రేమగాథ నువ్వే
ఓ చెలియ చెలియా
ప్రియమైన బాధ నువ్వే
నా ప్రేమజోల నువ్వే
ఓ సఖియ సఖియా
మదిలోన జ్వాల నువ్వే
చరణం: 1
పువ్వై పువ్వై పరిమళించినావే
ముళ్లై ముళ్లై మనసు కోసినావే
మెరుపై మెరుపై వెలుగు పంచినావే
పిడుగై పిడుగై కలలు కూల్చినావే
ప్రేమకు అర్థం అంటే
కన్నీట్లో పడవేనా
ప్రేమకు గమ్యం అంటే
సుడిగుండంలోకేనా
చరితల్లోనే ఉందమ్మా
చేరద్దంటూ ఈ ప్రేమ
వినక మతిపోయి
ప్రేమించానమ్మా
కనుక మూల్యాన్ని
చెల్లించానమ్మా
॥ప్రేమగాథ॥
చరణం: 2
నువ్వే నువ్వే ఆదరించినావే
ఆపై ఆపై చీదరించినావే
నిన్నే నిన్నే ఆశ్రయించగానే
నాలో నాలో ఆశ తుంచినావే
కోవెలలో కర్పూరం
నా తనువును కాల్చిందే
దేవత మెళ్లో హారం
ఉరి తాడై బిగిసిందే
ప్రేమపైనే నమ్మకం
కోల్పోయానే ఈ క్షణం
ప్రేమ పనిలేని చోటుకి వెళ్లాలి
నువ్వు కనలేని గూటికి చేరాలి
********* ********* *********
చిత్రం: ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే (2007)
సంగీతం: యావన్ శంకర్ రాజా
సాహిత్యం: కందికొండ
గానం: అద్నాన్ సామి, అనుష్క మంచందా, శ్వేత
హాయ్! ఆర్ యూ సింగిల్?
అయామ్ యువర్ డ్రింక్!
హే లెట్స్ గో అవుట్ మాన్!
యువర్ ప్లేస్ ఆర్ మైన్?
చెలి చెమకు కనులు వలవేసెనులే తొలిగ తొలిగా
తడి చెరుకు పెదవి నను పిలిచెనులే జతగ జతగా
పసి నడుమే నయగారా..అడుగేసే నను చేరా
చెలి చెమకు కనులు వలవేసెనులే తొలిగ తొలిగా
తడి చెరుకు పెదవి నను పిలిచెనులే జతగ జతగా
సిమ్హమల్లే పొగరు ఉందీ..నన్ను గిచ్చీ చంపుతుందీ
చక్కిలి నొక్కా..చేరర పక్కా
హే వన్నె చిన్నె ఉన్న కన్నె..లాగమాకే పైకి నన్నే
సెగతో నా మతి పోయెనా..నీ పరువం మడతడి పోవులే
అంత మగసిరి నీలోనా..ఉన్నది కద మరి రావా
చప్పునొచ్చెయ్ .. వహ్చ్చి వాటెయ్ .. చురకలే వేసేయ్
అంతగ త్వరపడలేనులే..నా మదిలో చోటిక లేదులే
ఆడుకో కధకళి ఆటలే.. పాడుకో చలిగిలి పాటలే
చెమకు కనులు వలవేసెనులే తొలిగ తొలిగా
తడి చెరుకు పెదవి నను పిలిచెనులే జతగ జతగా
హే రూపు చూపీ కవ్విస్తారూ..గుండె పిండీ చంపుతారూ
మగువల జన్మా..అరె ఏవిటిర బ్రహ్మా
హో అవును అంటే కాదు అనిలే..కాదు అంటే అవును అనిలే
చల్లగ అల్లుకు పోవులే..మా చూపుల భాషలు వేరులే
ఆశ కలిగెను నీ పైనా..అల్ల్రి పెరిగెను నవ్వునా
దాచలేకా చెప్పలేకా ఏమిటో తడబాటూ
గుప్పెడు మనసున ఆశలూ..నెరవేరవు పూర్తిగ ఊహలూ
చెప్పకు పొడి పొడి మాటలే..అనుకున్నది అందితె హాయిలే