చిత్రం: ఆగడు (2014)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: ఎస్.ఎస్.థమన్, దివ్య
నటీనటులు: మహేష్ బాబు , తమన్నా
దర్శకత్వం: శ్రీనువైట్ల
నిర్మాతలు: రామ్ అచంట, గోపి అచంట, అనీల్ సుంకర
విడుదల తేది: 19.09.2014
నారీ నారీ మాయలమారీ
దందా చేస్తున్నావే గుండెల్లోనా దూరీ
పోరీ పోరీ మాటలమారీ
బోల్తా కొట్టించావే వయ్యారాలా లారీ
నడుమే ఇట్టొక్కసారీ అటొక్కసారీ తిప్పకె నాంచారీ
ప్రాణం గట్టుక్కుమంటూ ప్రతొక్కసారీ పోదా పొలమారీ
నేన్ నీ ఇలాకలోనా తడాకచూపీ పెడతా కచ్చేరీ
ఓ సుకుమారీ దరిచేరీ చేస్తానే దర్కారీ నా టక్కుటమారీ
నారీ నారీ… మాయలమారీ…
నారీ నారీ మాయలమారీ
దందా చేస్తున్నావే గుండెల్లోనా దూరీ…
దీని తస్సాదియ్యా పిల్లకి దిస్టే తియ్యా
బమ్ బమ్ బత్తాయిలాగా కనిపిస్తావే బుగ్గలు పిండేయా
నువ్వో కొరకని కొయ్యా అస్సలు మాటినవయ్యా
గూట్లో బెల్లం కూడా నోట్లో వేసి మింగేస్తావయ్యా
వేసానే గస్తీ బస్తీ నీతోనే గస్తీ కుస్తీ
అమ్మో ఎగేసి నన్నూ లాగేస్త ఉందే ఒంపుల తందూరీ
అబ్బో గోడెక్కి అట్టా దూకేయమాకూ ఏంటా కంగారీ
ఏరీ కోరీ పిలిచాకా తప్పదుగా సవ్వారీ తప్పైతే సారీ…
నారీ నారీ… మాయలమారీ…
నువు చెయ్యే వేస్తే కాలే జారీ కాదంటున్నా కొంగే జారీ
చింగారీ సింగారీ ఊపేద్దాం ఒక్కసారీ
జాగారం చేద్దాం తెల్లావారీ కట్టుకువస్తా కాటన్ శారీ…
ఓ రయ్యో రయ్యా బొమ్మే అదిరిందయ్యా
సోకుల సబ్బుని రుద్ది కాఖీ డ్రెస్సుని ఉతికేసిందయ్యా
అరె ఓ మామామియ్యా బాగా బుక్కైపోయా పక్కా పోలీసోడి జీపుని గుద్దిన ఆటోనైపోయా
చుమ్మానే పెట్టే పెట్టే చలానా కట్టే కట్టే
ఆల్లం ఓరబ్బలాంటీ నీజబ్బచూసీ తబ్బిబైపోయా
నడీచే కరెంటులాంటి కుర్రాడ్ని చూసీ కనెట్టు ఐపోయా
గోరీ గోరీ చిన్నారీ చంపల్లో సిందూరీ చేస్తాలే చోరీ
నారీ నారీ మాయలమారీ… ఓ…
********* ********* **********
చిత్రం: ఆగడు (2014)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: భీమస్ సెసిరోలె
అరె జంక్షన్ లో… అరె జంక్షన్ లో
ముద్దుగా నాపేరు బొండుమల్లీ నవ్వితే నేనేమొ జుంకామల్లీ
అరె జంక్షన్ లో… అరె జంక్షన్ లో
ముద్దుగా నాపేరు బొండుమల్లీ నవ్వితే నేనేమొ జుంకామల్లీ
అరె నేనెంతో ఫేమస్సు ముదునేపల్లీ టూ ముంబై డెల్లీ
అరె నేనెంతో ఫేమస్సు ముదునేపల్లీ టూ ముంబై డెల్లీ
పుట్టలో దాచాను బంగినపల్లీ వరసకే నేనేమో రంభకు చెల్లీ
అరె నేనెంతో ఫేమస్సు ముదునేపల్లీ టూ ముంబై డెల్లీ
ఓసోసి మద్రాసి రబ్బరుబొమ్మా నీ ఈ స్మైలూ ఈ స్టైలూ అదిరిందమ్మా
ఇక నాపక్కా నీజోడి కుదిరిందమ్మా ఎహ రాయే దేశివళి గుమ్మ
జంక్షన్ లో ఒయ్ జంక్షన్ లో
నీ జంక్షన్ లో నా ఫన్షన్ పెడితేపిల్లో గోల పెడతవె తల్లో
జోడుగుర్రాళ్ళ బండెక్కి వచ్చే బుల్లో ఊరేగింపే ఒడిలో
దే దే పప్పీ పప్పీ బన్జా హబ్బీ హబ్బీ మేక్ మీ చబ్బి చబ్బీ కావాలీ వన్ బేబీ
డే అండ్ నైటు హనీ ఓన్లీ డైటు హనీ
షో మీ లాట్స్ అఫ్ మనీ ఐవిల్ మేక్ యూ హ్యపీ హ్యపీ…
ఫాంటూ షర్టూ…
ఫాంటూ షర్టూ వేసుకున్నా పక్కా మాసూ పోకిరి నువ్వూ
హె కోకా రైకా కట్టుకున్నా మొక్కజొన్న కంకివి నువ్వు
నీచూపు ఈతముల్లులే నవ్వు ముంత కల్లులే…
జుంబరబర్ జుంబ రా రుంబరబర్ రుంబ రా
ఇప్ప సార ఎస్సరుల నాటు మందు పస్సరులా
జాతరులో అత్తరులా దొరికావె నువ్విలా…
జంక్షన్ లో ఒయ్ జంక్షన్ లో
నీ జంక్షన్ లో నా ఫన్షన్ పెడితేపిల్లో గోల పెడతవె తల్లో
జోడుగుర్రాళ్ళ బండెక్కి వచ్చే బుల్లో ఊరేగింపే ఒడిలో
గల్లీ గల్లీలల్లీ యూ వాంట్ పేకట్ మిల్లీ
ఐ లవ్ గల్లీ గల్లీ ఉయ్ వాంట్ పేకట్ మిల్లీ
సిల్లీ సిల్లీ సిల్లీ డోంట్ బీ లిల్లి సిల్లీ
రావే లిల్లీ సిల్లీ సిల్లీ సిల్లీ సిల్లీ
గడ్డివామూ…
హ గడ్డివామూ బెడ్డుపైనా గుడుగుడు గుంజా ఆటలాడేద్దామా
పంపుసెట్టూ రూములోనా కర్రాబిల్లా ఆడి పాడెద్దామా
అరె కప్పవయ్య దుప్పటీ పెట్టావయ్యో కుంపటీ
జుంబరబర్ జుంబ రా రుంబరబర్ రుంబ రా
ఓసోసి బుజ్జికొండ ఊపావె పచ్చజండా పెట్టెస్తా రచ్చబండ ఎక్కిస్తా గోలుకొండా…
జంక్షన్ లో ఒయ్ జంక్షన్ లో
నీ జంక్షన్ లో నా ఫన్షన్ పెడితేపిల్లో గోల పెడతవె తల్లో
జోడుగుర్రాళ్ళ బండెక్కి వచ్చే బుల్లో ఊరేగింపే ఒడిలో హే