Aahuthi (1987)

చిత్రం: ఆహుతి (1987)
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
సాహిత్యం: యం. యస్. రెడ్డి
గానం: ఎస్.పి.బాలు
నటీనటులు: రాజశేఖర్ , జీవిత
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాత: శ్యామ్ ప్రసాద్ రెడ్డి
విడుదల తేది: జనవరి. 1987

అందమైన నా ఊహల మేడకు ఆవిడ మణిదీపం
అందీ అందని నా ఆశలకు ఆమే ప్రతి రూపం
ఆ తలపే నా ధ్యానం ఆ అభినవ దేవత నా ప్రాణం

మల్లెపూల కన్నా మంచు పూల కన్నా
నా చెలి ముసి ముసి నవ్వులు అందం…
ఆ… నెమలి హొయలకన్నా…
సెలయేటి లయల కన్నా…
నా చెలి జిలిబిలి నడకలు అందం
అపురూపం ఆ నవ లావణ్యం…
అపురూపం ఆ నవ లావణ్యం
అది నా మదిలో చెదరని స్వప్నం…

పైడి బొమ్మ లాంటి ఆమె పక్కనుంటె
పగలే వెన్నెల నే కురిపిస్తా…
ఆ… నీడ లాగ నాతో…
ఏడడుగులు సాగితే…
ఇలలో స్వర్గం నే సృష్టిస్తా…
రస రమ్యం ఆ రాగ విలాసం…ఆ..ఆ..
రస రమ్యం ఆ రాగ విలాసం
వసి వాడదు అది ఆజన్మాంతం….

Previous
Yatra (2019)

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Aalaya Sikharam (1983)
error: Content is protected !!