Aalaya Sikharam (1983)
Aalaya Sikharam (1983)

Aalaya Sikharam (1983)

చిత్రం: ఆలయశిఖరం (1983)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల
నటీనటులు: చిరంజీవి, సుమలత
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాత: శ్రీ లలితా మూవీస్
విడుదల తేది: 07.05.1983

పల్లవి:
నీ రూపు మారింది గోపాలుడా..
లేని నాజూకు పెరిగింది నా రాముడా..
పూలఉయ్యాల ఊపాలా..ఓ బాలుడా..బాలుడా..గోపాలుడా..
హా..ఆ బాలుడా..గోపాలుడా..

హ్హా..హ్హా..హ్హా..
ఈ రాధ కన్నేస్తే గోపాలుడే..మరి ఈ సీత కరుణిస్తే శ్రీరాముడే..
వీడు..ఈనాడు..ఏనాడు..నీ బాలుడే..
బాలుడే..గోపాలుడే..బాలుడే..గోపాలుడే..

చరణం: 1
మెరిసే నీ కళ్ళలోనా..గండు మీనై నేనీది రానా..ఆ..ఆ
వలపే నీ గుండెలోనా..మురళి పిలుపై నే ఊగిపోనా..
మెరిసే నీ కళ్ళలోనా..గండు మీన నేనీది రానా..ఆ..ఆ
ఓ..ఓ..వలపే నీ గుండె లోనా..మురళి పిలుపై నే ఊగిపోనా..
నీ కమ్మని పెదవి పిల్లనగ్రోవి కావాలంటనా..
అది ఊదుతుంటే ఒళ్ళే మరచి ఊగుతుంటాను

ఆహ.. నీ రూపు మారింది గోపాలుడా..
లేని నాజూకు పెరిగింది నా రాముడా..
వీడు..ఈనాడు..ఏనాడు..నీ బాలుడే..
బాలుడే..గోపాలుడే..బాలుడే..గోపాలుడే..

చరణం: 2
ఎదురుగ నీవుండిపోతే..జీవనదిలా ఉప్పొంగిపోనా..
నదిలా ఉప్పొంగిపోతే..నిన్ను ఎదలో నేదాచుకోనా..ఆ
ఎదురుగ నీవుండిపోతే..జీవనదిలా ఉప్పొంగిపోనా..
ఆ..ఆ..నదిలా ఉప్పొంగిపోతే..నిన్ను ఎదలో నేదాచుకోనా..ఆ
హద్దులు దాటి..మబ్బులు మీటి..ఆడుకుందామా…
ముద్దులతోనే..మిద్దెలు కట్టి ముచ్చటగుందామా…

ఆహ..నీ రూపు మారింది గోపాలుడా..
లేని నాజూకు పెరిగింది నా రాముడా..
పూలఉయ్యాల ఊపాలా..ఓ బాలుడా..బాలుడా..గోపాలుడా..
హా..ఆ బాలుడా..గోపాలుడా..

హ్హా..హ్హా..హ్హా..
ఈ రాధ కన్నేస్తే గోపాలుడే..మరి ఈ సీత కరుణిస్తే శ్రీరాముడే..
వీడు..ఈనాడు..ఏనాడు..నీ బాలుడే..
బాలుడే..గోపాలుడే..బాలుడే..గోపాలుడే..

********  *********   *********

చిత్రం: ఆలయశిఖరం (1983)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఉపద్రష్ట సాయి
గానం: యస్.పి. బాలు

పల్లవి:
హే.. హేహే..

ఇది ఆశలు రేపే లోకం.. అడియాశలు చేసే లోకం
హే.. స్వార్థం మరిగిన మనుషుల్లారా..
సాగదు సాగదు మీ మోసం..ఊ..
సాగదు.. సాగదు.. మీ మోసం..

ఇది ఆశలు రేపే లోకం.. అడియాశలు చేసే లోకం
హే.. స్వార్థం మరిగిన మనుషుల్లారా..
సాగదు సాగదు మీ మోసం..ఊ..
సాగదు.. సాగదు.. మీ మోసం..

చరణం: 1
కోటలు కట్టిన రాజులెక్కడో..ఓ.
బాటలు వేసిన కూలీలెవరో..

కోటలు కట్టిన రాజులెక్కడో.. బాటలు వేసిన కూలీలెవరో..
కాలం నడిచే కాలినడకలో.. సమాధిరాళ్ళై నిలిచారు..ఊ ఊ
చరిత్రగానే మిగిలేరు….

ఇది ఆశలు రేపే లోకం.. అడియాశలు చేసే లోకం
హే.. స్వార్థం మరిగిన మనుషుల్లారా..
సాగదు సాగదు మీ మోసం..ఊ..
సాగదు.. సాగదు.. మీ మోసం..

చరణం: 2
మనుషుల మమతలు మట్టిగోడలు
కలిసిన మనుసులు మర్రి ఊడలు
మనుషుల మమతలు మట్టిగోడలు
కలిసిన మనుసులు మర్రి ఊడలు
కన్నవారి కల పండించాలీ..ఈ..
కన్నవారి కల పండించాలి.. రేపటి వెలుగయి నిలవాలి..

ఇది ఆశలు రేపే లోకం.. అడియాశలు చేసే లోకం
హే.. స్వార్థం మరిగిన మనుషుల్లారా
సాగదు సాగదు మీ మోసం..ఊ..
సాగదు.. సాగదు.. మీ మోసం..

హై.. హేహే..
హై..