చిత్రం: ఆపద్బాంధవుడు (1992)
సంగీతం: యమ్.యమ్. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర
నటీనటులు: చిరంజీవి , మీనాక్షి శేషాద్రి
దర్శకత్వం: కె.విశ్వనాథ్
నిర్మాత: ఏడిద నాగేశ్వరరావు
విడుదల తేది: 09.10.1992
ఊఁ…ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్లా
ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్లా
అంత వింతగాధల్లో ఆనందలాల
ఊఁ హు – ఉఁ తందనాననానన తందనాననానన తందనాననానన
ఆఁ ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్లా
అంత వింతగాధల్లో…
అమ్మలాల పైడి కొమ్మలాల వీడు ఏమయ్యోడో
జాడ లేడియ్యాల పోని తందనాలమ్మా వందనాలా
గోవుల్లాల పిల్లంగ్రోవుల్లాల గొల్లభామల్లారా
ఈడ మొగుడియ్యాల నారి నందనాలమ్మా ఆనందలీలా
అమ్మలాల పైడి కొమ్మలాల వీడు ఏమయ్యోడో
జాడ లేడియ్యాల పోని తందనాలమ్మా వందనాలా
ఆ… ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్లా
అంత వింతగాధల్లో ఆనందలాల
బాపురే బ్రహ్మకుచెల్లా వైనమంత వల్లించవల్లా
రేపల్లె వాడల్లో ఆనంద లీల
అయినవాడే అందరికి అయినా అందడు ఎవ్వరికి
అయినవాడే అందరికి అయినా అందడు ఎవ్వరికి
బాలుడా గోపాలుడా లోకాల పాలుడా
తెలిసేది ఎలా ఎలా చాంగుభళా
తెలిసేది ఎలా ఎలా చాంగుభళా
ఔరా అమ్మకచెల్లా ఆలకించి నమ్మడమెల్లా
అంత వింతగాధల్లో ఆనందలాల
చరణం: 1
ఊఁ నల్లరాతి కండలతో కరుకైనవాడే
ఊఁ వెన్నముద్ద గుండెలతో కరుణించు తోడే
నల్లరాతి కండలతో కరుకైనవాడే ఆనందలాల
వెన్నముద్ద గుండెలతో కరుణించు తోడే ఆనందలీల
ఆయుధాలు పట్టను అంటూ బావ బండి తోలిపెట్టే ఆనందలాల
జాణ జాన పదాలతో జ్ఞాననీతి పలుకునటే ఆనందలీల
బాలుడా గోపాలుడా లోకాల పాలుడా
తెలిసేది ఎలా ఎలా చాంగుభళా
ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్లా
అంత వింతగాధల్లో ఆనందలాల
బాపురే బ్రహ్మకుచెల్లా వైనమంత వల్లించవల్లా
రేపల్లె వాడల్లో ఆనంద లీల
చరణం: 2
ఆలమంద కాపరిలా కనిపించలేదా ఆనందలాల
ఆలమందు కాళుడిలా అనిపించు కాదా ఆనందలీల
వేలితో కొండను ఎత్తే కొండంత వేలు పట్టే ఆనందలాల
తులసి దళానికే తేలిపోయి తూగునటే ఆనందలీల
బాలుడా గోపాలుడా లోకాల పాలుడా
తెలిసేది ఎలా ఎలా చాంగుభళా
ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్లా
అంత వింతగాధల్లో ఆనందలాల
బాపురే బ్రహ్మకుచెల్లా వైనమంత వల్లించవల్లా
రేపల్లె వాడల్లో ఆనంద లీల
******** ******** *********
చిత్రం: ఆపద్బాంధవుడు (1992)
సంగీతం: యమ్.యమ్. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర, యస్.పి. బాలు
చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలీ
మబ్బుల్లారా మంచుల్లారా తప్పుకోండే దారికీ
వెళ్ళనివ్వరా వెన్నెలింటికీ
విన్నవించరా వెండి మింటికీ
జో జో… లాలీ, జో జో… లాలీ
జో జో… లాలీ, జో జో… లాలీ
మలి సంధ్య వేళాయే చలి గాలి వేణువాయే
మలి సంధ్య వేళాయే చలి గాలి వేణువాయే
నిదురమ్మా ఎటు పోతివే
మునిమాపు వేళాయే కను పాప నిన్ను కోరె
కునుకమ్మా ఇటు చేరవే
తన్న నన్న తాన నా తన్న నన్న తాన నా
నిదురమ్మా ఎటు పోతివే కునుకమ్మా ఇటు చేరవే
గోధూళి వేళాయే గూళ్ళన్నీ కనులాయే
గోధూళి వేళాయే గూళ్ళన్నీ కనులాయే
గువ్వల రెక్కల పైనా రివ్వు రివ్వున రావే
జోల పాడవా బేల కళ్ళకి
వెళ్ళనివ్వరా వెన్నెలింటికీ
జో జో… లాలీ, జో జో… లాలీ
పట్టుపరుపులేల పండువెన్నెలేల
అమ్మ ఒడి చాలదా బజ్జోవే తల్లి
పట్టుపరుపేలనే
అమ్మ ఒడి చాలునే నిన్ను చల్లంగా జో కొట్టునే
నారదాదులేల నాధబ్రహ్మలేల
అమ్మ లాలి చాలదా బజ్జోవే తల్లి
నారదాదులేలనే నాధబ్రహ్మలేలనే
అమ్మ లాలి చాలునే నిన్ను కమ్మంగ లాలించునే
చిన్ని చిన్ని కన్నుల్లో ఎన్ని వేల వెన్నెల్లో
తీయనైన కలలెన్నో ఊయలూగు వేళల్లో
అమ్మలాల పైడి కొమ్మలాల వీడు ఏమయ్యోడీవైపు లేడియ్యాల కోటి తందనాల ఆనందలాల
గోవుల్లాల పిల్లంగ్రోవుల్లాల గొల్లభామల్లారా యాడనుందియ్యల నాటి నందనాల ఆనందలీలా
జాడ చెప్పారా చిట్టితల్లికి వెళ్ళనివ్వరా వెన్నెలింటికి
జో జో… జోలాలీ, జో జో… లాలీ
చుక్కలారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలీ
మబ్బుల్లారా మంచుల్లారా తప్పుకోండే దారికీ
********* *********** *********
చిత్రం: ఆపద్బాంధవుడు (1992)
సంగీతం: యమ్.యమ్. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర
చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలీ
మబ్బుల్లారా మంచుల్లారా తప్పుకోండే దారికీ
వెళ్ళనివ్వరా వెన్నెలింటికీ
విన్నవించరా వెండి మింటికీ
జో జో… లాలీ, జో జో… లాలీ
మలి సంధ్య వేళాయే చలి గాలి వేణువాయే
మలి సంధ్య వేళాయే చలి గాలి వేణువాయే
నిదురమ్మా ఎటు పోతివే
మునిమాపు వేళాయే కను పాప నిన్ను కోరె
కునుకమ్మా ఇటు చేరవే
నిదురమ్మా ఎటు పోతివే కునుకమ్మా ఇటు చేరవే
నిదురమ్మా ఎటు పోతివే కునుకమ్మా ఇటు చేరవే
గోధూళి వేళాయే గూళ్ళన్నీ కనులాయే
గోధూళి వేళాయే గూళ్ళన్నీ కనులాయే
గువ్వల రెక్కల పైనా రివ్వు రివ్వున రావే
జోల పాడవా బేల కళ్ళకి
వెళ్ళనివ్వరా వెన్నెలింటికీ
జో జో… లాలీ, జో జో… లాలీ
జో జో… లాలీ, జో జో… లాలీ
********* *********** *********
చిత్రం: ఆపద్బాంధవుడు (1992)
సంగీతం: యమ్.యమ్. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి. బాలు
అతల వితల పాతాల సప్తకము
అతల కుతలమవు అపస్రుతీ
గగన గహన బూపాలి పెటిల్లున
పగిలి పతనమవు అశనిహతీ
తజ్జను తకజను తాళతతుల
బీబస్త భయానక రసాక్రుతీ
తద్దిమి దిందిమి తత్తరి తోత్తుత
భీషన బైరవ పదోత్తతీ
బగ్న హృదయ బదబాగ్నులు చిమ్మెను
బగ్న బాగాల బీమాక్రుటీ
దగ్ద సహచరిని తలపులుగా దిశలల్లెను
తాంబ్రజటా జూటీ
ధరని దద్ధరిల్ల జలకలుప్పదిల
తరణి తత్తరిల్ల వాతమతిష్యయిల్ల
ఝటలు ప్రక్కదల యుగాంతవేళా ముహూర్థమో
సమస్థ సమ్హారక సన్నద్ధుని
క్రుద్ధుని రుద్రుని
వీరభద్ర స్రుశ్టున్యుఖమ్మైన
అప్రతిహధ పదఘట్టనమో
********* *********** *********
చిత్రం: ఆపద్బాంధవుడు (1992)
సంగీతం: యమ్.యమ్. కీరవాణి
సాహిత్యం: సి.నారాయణరెడ్డి
గానం: యస్.పి. బాలు, చిత్ర
పువ్వు నవ్వె గువ్వ నవ్వే
పువ్వు నవ్వె గువ్వ నవ్వే మువ్వ నవ్వే
రవ్వల బొమ్మ నవ్వదేమే
వాన నవ్వే మబ్బు నవ్వే
మాట నవ్వే మనసు నవ్వే
మాలచ్చిమి నవ్వదేమే
చిలకకు చీరే కడితే హైలెస్సా
మొలకకు చిగురే పుడితే హైలెస్సో
అది యెవరెవరమ్మా ఇదిగిదిగోమ్మా
అది యెవరెవరమ్మా ఇదిగిదిగోమ్మా
పువ్వు గువ్వా సువ్వీ అంటే
మాను మబ్బు రివ్వు మటే
రవ్వల బొమ్మా నవ్వాలమ్మా
రాచారమ్మా నవ్వాలమ్మా
కోయిలాలో కూయవేమే
కొండగాలో వీచవేమే
కుహూ కుహూ తప్ప కోయిలమ్మ కేం తెలుసూ
ఒహోం ఒహోం తప్ప కొండగాలికేం తెలుసూ
గజ్జకట్టుకోకున్నా ఘల్లు ఘల్లు మంటుందీ
ఏ అడుగూ…నువ్వే అడుగూ
ఎవరిదా అడుగూ…నాకేం తెలుసూ
ఎవరిదా అడుగూ…నాకేం తెలుసూ
పోనీ గొంతుదాటిరాకున్నా గుండె ఊసు చెబుతుందీ
ఏం పలుకూ…అమ్మా పలుకూ
నీ పలుకూ….ఉహు నీ పలుకూ…నీ పలుకూ
కామాక్షమ్మ కరునుంచిందో
మీనాక్షమ్మ వరమిచ్చిందో
రవ్వల బొమ్మా నవ్విందమ్మా
రాచనిమ్మ నవ్విందమ్మా
నవ్వులేమో దివ్వలాయే
నదకలేమో మువ్వలాయే
ఆలమందలు కాసినవాడేనా
పాల బిందెలు మోసినవాడేనా
ఏమి కవితలలాదమ్మా ఎన్ని కళలు నేర్చాడమ్మా
ఏమి కవితలలాదమ్మా ఎన్ని కళలు నేర్చాడమ్మా
కనుల ముందు నీవుంటే కవిత పొంగి పారిందమ్మా
మాటా నీదే పాటా నీదే
మనసూరించే ఆటా నీడే
పున్నమి రెమ్మా పుట్టీన రోజు
వెన్నెల చిందు నాదే నాదే
********* *********** *********
చిత్రం: ఆపద్బాంధవుడు (1992)
సంగీతం: యమ్.యమ్. కీరవాణి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి. బాలు
ఒడియప్పాహూ ఒడియప్పాహూ
ఒడియప్పా ఒడియప్పా ఒడియప్పా ఒడియప్పా ఒడిఒడియప్పా
ఓనమాలొప్పా శివాయహ తప్పా
చెప్పెయ్ అప్పా ఓపిగ్గా ఓచెల్లప్పా
ఆవులు మేపే అల్లరి గోపాలప్పా
పల్లవి చెప్పా పై చరనం నువ్వే చెప్పేయ్ రప్పా
ఒడియప్పాహూ ఒడియప్పాహూ
ఒడియప్పా ఒడియప్పా ఒడియప్పా ఒడియప్పా ఒడిఒడియప్పా
ఒడియప్పాహూ ఒడియప్పాహూ
ఒడియప్పా ఒడియప్పా ఒడియప్పా ఒడియప్పా ఒడిఒడియప్పా
ఒకరికి ఒకరప్పా ఒంటిగ లేమప్పా
నువ్వే నేనప్పా నేనే నువ్వప్పా
నీకు నాకు ఉన్నాడప్పా ఆ పై ఉన్నప్పా
ఉన్నప్పా ఉన్నప్పా ఉన్నప్పా
ఒడియప్పా ఒడియప్పా ఒడియప్పా ఒడియప్పా ఒడిఒడియప్పా
ఓనమాలొప్పా శివాయహ తప్పా
చెప్పెయ్ అప్పా ఓపిగ్గా ఓచెల్లప్పా
ఆవులు మేపే అల్లరి గోపాలప్పా
పల్లవి చెప్పా పై చరనం కూడా నేనే చెప్పా
ఒడియప్పాహూ ఒడియప్పాహూ
ఒడియప్పా ఒడియప్పా ఒడియప్పా ఒడియప్పా ఒడిఒడియప్పా
********* *********** *********
చిత్రం: ఆపద్బాంధవుడు (1992)
సంగీతం: యమ్.యమ్. కీరవాణి
సాహిత్యం:
గానం:
పరమేశ్వరుని హితము పాటించి దాక్షాయనీ
తండ్రి తలపెట్టిన క్రతువు చూడ వచ్చి
అచ్చట కొలువై ఉన్న పూజ్యుల సమక్యమందున
తండ్రిచే పరావబవించబడి పరి పరి వీదముల పరితపించుచూ
శివనింద చెవిన పడి పాపమంటిన జన్మ
పతి పాద సేవకిక పనికిరాదమ్మా
శితికంటు జతనంటు భోగంబు బగ్గాయి
సతి గుండె చితి గుండమాయే
దూర్జటిని దూషించు దక్షసుతగా బ్రతుకు తుచ్చ జీవస్తవం ఆయే
అగ్ని బట్టారకా అంటరాననకా
అగ్ని బట్టారకా అంటరాననకా
యోగార్చి రగిలించవయా
అనువనువు సుచి శిఖలలో కడతేర్చవయ్యా