చిత్రం: ఆప్తుడు (2004)
సంగీతం: రమణ గోగుల
సాహిత్యం: సురేంద్ర కృష్ణ
గానం: శ్రీరామ్ , నందిని
నటీనటులు: రాజశేఖర్ , అంజలీ జవేరి
దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య
నిర్మాత: శ్రీమతి జీవితారాజశేఖర్
విడుదల తేది: 2004
పల్లవి:
హేయ్… అనాదిగా అదే కధ అయినామరి కొత్తేకదా
ప్రేమే కదా
ఒక ఉగాదిలా వచ్చేనుగా రుచులెన్నో తెచ్చేకధ
ప్రేమే కదా
కలిసే మనసులలో అర విరిసే కన్నులలొ ఈ ప్రేమే కదా
మహ మాయే కదా
తరిమే తలపులలో వల విసిరే వలపులలో ఈ ప్రేమే కదా
మహ మాయే కదా
చరణం: 1
అంతా ఆనందం నువ్వుంటే నా కంటిముందు
ఎంతో సంతోషం నీ తోడు ఉండగా
గారం సహకారం మమకారం నువు వెంటరాగ
అంతా నా సొంతం నీ ప్రేమ ఉండగా
ఎదురుగ నువ్వే నుంచుంటే ఎదలోన పరవశం
నిముషము నువ్వే లేకుంటే ఎనలేని కలరవం
చరణం: 2
ఇంట్లో మరి గుళ్ళో నే వెళ్ళే ప్రతిదారిలోన
ఎదలో దేవతలా నా చెలియ రూపమే
అంతా మనసంతా అయ్యింది మురిపాలపుంత
వింతే పులకింతే ఈ కొత్త భావమే
ఎవరిని యెపుడు కలిపేనో ఈ ఇంద్రజాలము
మనసున మనసై ముడివేసే ఈ ప్రేమ గాలము