చిత్రం: ఆరాధన (1976)
సంగీతం: ఎస్. హనుమంత రావు
సాహిత్యం: డా. సి. నారాయణ రెడ్డి
గానం: మహమ్మద్ రఫీ
నటీనటులు: యన్.టి.రామారావు, వాణిశ్రీ, జగ్గయ్య
దర్శకత్వం: బి.వి.ప్రసాద్
నిర్మాత: అట్లూరి. పుండరీ కాక్షాయా
విడుదల తేది: 1976
ఓ ప్రియతమా… ప్రియతమా… ప్రియతమా…
నా మది నిన్ను పిలిచింది గానమై
వేణు గానమై నా ప్రాణమై
నా మది నిన్ను పిలిచింది గానమై
వేణు గానమై నా ప్రాణమై
ఎవ్వరివో నీవు నేనెరుగలేను
ఏ పేరున నిన్ను నే పిలవగలనూ
ఎవ్వరివో నీవు నేనెరుగలేను
ఏ పేరున నిన్ను నే పిలవగలనూ
తలపులలోనే నిలిచేవు నీవే
తలపులలోనే నిలిచేవు నీవే
తొలకరి మెరుపుల రూపమై
నా మది నిన్ను పిలిచింది గానమై
వేణు గానమై నా ప్రాణమై
ఎన్ని యుగాలని నీ కొరకు వేచేను
ఈ మూగ బాధా ఎందాకా దాచేను
ఎన్ని యుగాలని నీ కొరకు వేచేను
ఈ మూగ బాధా ఎందాకా దాచేను
వేచిన మదినే వెలిగింప రావే
వేచిన మదినే వెలిగింప రావే
ఆరని అనురాగ దీపమై
నా మది నిన్ను పిలిచింది గానమై
వేణు గానమై నా ప్రాణమై
నా మది నిన్ను పిలిచింది గానమై
వేణు గానమై నా ప్రాణమై
********* ********* ********
చిత్రం: ఆరాధన (1976)
సంగీతం: ఎస్. హనుమంత రావు
సాహిత్యం: డా. సి. నారాయణ రెడ్డి
గానం: మహమ్మద్ రఫీ, యస్.జానకి
ఓ ప్రియతమా… ప్రియతమా… ప్రియతమా…
నా మది నిన్ను పిలిచింది గానమై
వేణు గానమై నా ప్రాణమై
నా మది నిన్ను పిలిచింది గానమై
వేణు గానమై నా ప్రాణమై
నా మది నిన్ను పిలిచింది గానమై
వేణు గానమై నా ప్రాణమై
జీవన యమునా తరంగాలపైన
మోహన మురళీ రాగాలలోన
జీవన యమునా తరంగాలపైన
మోహన మురళీ రాగాలలోన
మన అనురాగమే పలికేను కాదా
మన అనురాగమే పలికేను కాదా
మధురిమలొలికే నాధమై
నా మది నిన్ను పిలిచింది గానమై
వేణు గానమై నా ప్రాణమై
సూర్య చంద్రులు వెలిగే దాక
తరులు గిరులు నిలిచేదాకా
సూర్య చంద్రులు వెలిగే దాక
తరులు గిరులు నిలిచేదాకా
మన అనుబంధమే నిలిచేను కాదా
మన అనుబంధమే నిలిచేను కాదా
మరువగా రాని వేదమై
నా మది నిన్ను పిలిచింది గానమై
వేణు గానమై నా ప్రాణమై
ఆ రఘురాముని పోలిక నీవై
అలనాటి జానకి కోరిక నీదై
ఆ రఘురాముని పోలిక నీవై
అలనాటి జానకి కోరిక నీదై
మన కలయికయే వెలిచేను కాదా
మన కలయికయే వెలిచేను కాదా
ప్రణయ జగతికే తేజమై దివ్య తేజమై
నా మది నిన్ను పిలిచింది గానమై
వేణు గానమై నా ప్రాణమై
********* ********* ********
చిత్రం: ఆరాధన (1976)
సంగీతం: ఎస్.హనుమంతరావు
సాహిత్యం: డా.సి.నారాయణరెడ్డి
గానం: మహమ్మద్ రఫీ, యస్.జానకి
నేడే తెలిసింది ఈ నాడే తెలిసింది
నేడే తెలిసింది ఈ నాడే తెలిసింది
కమ్మనికళకే రూపంవస్తే
కమ్మనికళకే రూపంవస్తే
అది నీ లాగే ఉంటుందని
నేడే తెలిసింది ఈ నాడే తెలిసింది
ఓ… నేడే తెలిసింది ఈ నాడే తెలిసింది
నేడే తెలిసింది ఈ నాడే తెలిసింది
తియ్యని పాటకు ప్రాణం వస్తే
తియ్యని పాటకు ప్రాణం వస్తే
అది నీ లాగే ఉంటుందని
నేడే తెలిసింది ఈ నాడే తెలిసింది
ఇంత మంచి రూపానికి అంత మంచి మనసుంటుందనీ
ఇంత మంచి రూపానికి అంత మంచి మనసుంటుందనీ
ఆ మనసున అంతరాలకూ తావన్నది లేనేలేదనీ
ఆ మనసున అంతరాలకూ తావన్నది లేనేలేదనీ
అది వలచేదొకసారేనని ఆ వలపే విడిపోలేనిదని
నేడే తెలిసింది ఈ నాడే తెలిసింది
మారుమూల పల్లెలోనా మధురగానముదయించేనని
మారుమూల పల్లెలోనా మధురగానముదయించేనని
శిలలకైనా ఆ గానం పులకింతలు కలిగించేనని
శిలలకైనా ఆ గానం పులకింతలు కలిగించేనని
అది జతగా నను చేరాలని నా బ్రతుకే శృతి చేయాలని
నేడే తెలిసింది ఈ నాడే తెలిసింది
కమ్మని కళకే రూపం వస్తే అది నీ లాగే ఉంటుందని
నేడే తెలిసింది ఈ నాడే తెలిసింది
ఓ… తియ్యని పాటకు ప్రాణం వస్తే
అది నీ లాగే ఉంటుందని
నేడే తెలిసింది ఈ నాడే తెలిసింది
నేడే తెలిసింది ఈ నాడే తెలిసింది
super
su
super excited
super