చిత్రం: ఆరడుగుల బుల్లెట్ (2017)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: శ్రీమణి
గానం: దినకర్, సుదామయి
నటీనటులు: గోపిచంద్, నయనతార
కథ: వక్కంతం వంశీ
దర్శకత్వం: బి.గోపాల్
నిర్మాత: తాండ్ర రమేష్
విడుదల తేది: 2017
సనసన్నగా మెరుపునే నరికే చూపుతో
తియ తియ్యగా మనసునే కొరికేశావులే
ప్రేమకు ఆకలి ఎక్కువ నేనంటే మక్కువా
నీకన్నా ఎవరెక్కువా నాకే నువు దక్కవా
ఓ లవ్లీ హార్ట్ ఎటాకె నువు తెప్పించావులే
నును ఫుల్లీ లాఫ్ ట్రాకె నువు ఎక్కించావులే
ఓ తీయని గుండెకోతే నువు తెప్పించావులే
ఓ కమ్మని మాటనోట నను చంపేశావులే
సనసన్నగా మెరుపునే నరికే చూపుతో
తియ తియ్యగా మనసునే కొరికేశావులే
నీ అడుగులపై గొడుగులా నా అడుగులనే వెయ్యనా
నీటిలో నలువైపులా నీ నీడై నేనున్నా
రెక్కలు నా కనురెప్పలై కన్నులనే ఎగరేయనా
ప్రతిక్షణం నీ జాడనే నే జల్లడ పడుతున్నా
నువ్వే తెలియక ముందర నా గతమే చిందరవందర
నీతో బతికే తొందర ముందడుగెయ్ రా సుందరా
ఓ లవ్లీ హార్ట్ ఎటాకె నువు తెప్పించావులే
నును ఫుల్లీ లాఫ్ ట్రాకె నువు ఎక్కించావులే
ఓ తీయని గుండెకోతే నువు తెప్పించావులే
ఓ కమ్మని మాటనోట నను చంపేశావులే
సనసన్నగా మెరుపునే నరికే చూపుతో
తియ తియ్యగా మనసునే కొరికేశావులే
నాతో నాకే యుద్ధమై నన్నే నే ఓడించానుగా
నిన్నిలా గెలిపించనా మరి నన్నే గెలిచేలా
నీలో ఈ నిశ్శబ్దమే నన్నే కదిలించిందిగా
వెదురులో ఓ మురళిలా సంగీతం కురిసేలా
సూర్యుని కన్నా వెచ్చని నిను ప్రేమించే నా మది
ప్రాణం కన్నా గొప్పని నువు నాకిచ్చే వరమిది
ఓ లవ్లీ హార్ట్ ఎటాకె నువు తెప్పించావులే
నును ఫుల్లీ లాఫ్ ట్రాకె నువు ఎక్కించావులే
ఓ తీయని గుండెకోతే నువు తెప్పించావులే
ఓ కమ్మని మాటనోట నను చంపేశావులే