చిత్రం: ఆస్తిపరులు (1966)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ, కొసరాజు
గానం: పి.సుశీల
నటీనటులు: నాగేశ్వరరావు, జగ్గయ్య , వాణిశ్రీ, గరికపాటి వరలక్ష్మి
దర్శకత్వం: వి.మధుసూదనరావు
నిర్మాత: వి.బి రాజేంద్రప్రసాద్
విడుదల తేది: 18.11.1966
సోగ్గాడే చిన్ని నాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడు
సోగ్గాడే చిన్ని నాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడూ సోగ్గాడు
కట్టె తుపాకెత్తుకోని కట్ట మీద నడుస్తుంటె కాలు జారి పడ్డాడె సోగ్గాడు
కట్టె తుపాకెత్తుకోని కట్ట మీద నడుస్తుంటె కాలు జారి పడ్డాడె సోగ్గాడు
పగటి వేషగాడల్లె పల్లెటూళ్ళు తిరుగుతుంటె కుక్క పిల్ల భౌ అంది
పడుచు పిల్ల ఫక్కు మంది
సోగ్గాడే చిన్ని నాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడూ సోగ్గాడు
కళ్ళజోడు ఏసుకోని గల్ల కోటు తొడ్డుక్కోని పిల్ల గాలికొచ్చాడె సోగ్గాడు
కళ్ళజోడు ఏసుకోని గల్ల కోటు తొడ్డుక్కోని పిల్ల గాలికొచ్చాడె సోగ్గాడు
చిట్టివలస వాగుకాడ పిట్ట తుర్రుమంటేను
చిట్టివలస వాగుకాడ పిట్ట తుర్రుమంటేను
బిక్కమొహమేసాడు సుక్కలెంక చూసాడు
బిక్కమొహమేసాడు సుక్కలెంక చూసాడు
సోగ్గాడే చిన్ని నాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడూ సోగ్గాడు
మూతి మీసం గొరుక్కోని బోసి మొహం పెట్టుకోని యాటకోసం వచ్చాడె సోగ్గాడు
మూతి మీసం గొరుక్కోని బోసి మొహం పెట్టుకోని యాటకోసం వచ్చాడె సోగ్గాడు
బుల్లి దొర వచ్చెనని కుక్క పిల్ల ఎక్కిరిస్తె ఎర్రి మొహం యేసాడు
మిర్రి మిర్రి చూసాడు
సోగ్గాడే చిన్ని నాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడు
సోగ్గాడే చిన్ని నాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడూ సోగ్గాడు
******* ******* *******
చిత్రం: ఆస్తిపరులు (1966)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: గంటసాల
మిడిసి పడకు మిడిసి పడకు అత్త కూతురా
ముందు ముందు ఉందిలే సంబరాల జాతరా
మిడిసి పడకు మిడిసి పడకు అత్త కూతురా
ముందు ముందు ఉందిలే సంబరాల జాతరా
మిడిసి పడకు మిడిసి పడకు అత్త కూతురా రా రా
చరణం: 1
దోరవయసు అలవి కాని భారమయింది
ఆ బరువు మోయలేక నడుము పలచబడింది
దోరవయసు అలవి కాని భారమయింది
ఆ బరువు మోయలేక నడుము పలచబడింది
నడుములేని నడకే ఒక నాట్యమయింది
నడుములేని నడకే ఒక నాట్యమయింది
చూచి చూచి బావ మనసు సొమ్మసిల్లింది.. సొమ్మసిల్లింది!
చరణం: 2
అత్తకూతురంటేనే హక్కు ఉందిలే
అల్లరెంత చేసినా చెల్లుతుందిలే
అత్తకూతురంటేనే హక్కు ఉందిలే
అల్లరెంత చేసినా చెల్లుతుందిలే
ముక్కు తాడు వేయువేళ ముంచుకొచ్చు సిగ్గులో
ముక్కు తాడు వేయువేళ ముంచుకొచ్చు సిగ్గులో
ఇంత అత్త కూతురూ కొత్త పెళ్ళి కూతురే .. కొత్త పెళ్ళి కూతురే !
మిడిసి పడకు మిడిసి పడకు అత్త కూతురా
ముందు ముందు ఉందిలే సంబరాల జాతరా
******* ******* ******
చిట్టిఅమ్మలూ… చిన్నినాన్నలూ…
మన ఇద్దరికే తెలుసు ఈ మమతలు
చిట్టి అమ్మలూ… చిన్ని నాన్నలూ…
మన ఇద్దరికే తెలుసు ఈ మమతలు…
చిట్టి అమ్మలూ….
చరణం: 1
హృదయాలను మూయవీ తలుపులు
విడదీశారమ్మా మన తనువులు
ఉన్నవాళ్ళే నీకింక నీ వాళ్ళు
ఉన్నవాళ్ళే నీకింక నీ వాళ్ళు ..
తుడిచివేయవమ్మా నీ కన్నీళ్ళు
చరణం: 2
అన్నఒడివెచ్చదనంకోసం
కన్ను మూయకున్నావు పాపం
అన్న ఒడి వెచ్చదనం కోసం
కన్ను మూయకున్నావు పాపం
ఎదనుచీల్చిపాడుతున్నజోలలు
ఎదనుచీల్చిపాడుతున్నజోలలు
నిదురపుచ్చులేనిన్నుఅమ్మలు
నిదురపుచ్చులేనిన్నుఅమ్మలు.!