చిత్రం: ఆత్మబంధువు (1985)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, యస్.జానకి
నటీనటులు: జెమిని గణేషన్, రాధ
దర్శకత్వం & నిర్మాత: పి. భారతీరాజా
విడుదల తేది: 15.08.1985
మనిషికో స్నేహం మనసుకో దాహం
లేనిదే జీవం లేదు జీవితం కానే కాదు
మమతనే మధువు లేనిదే చేదు
మనిషికో స్నేహం మనసుకో దాహం
ఒక చిలక ఒద్దికైంది మరు చిలక మచ్చికైంది
వయసేమో మరిచింది మనసొకటై కలిసింది
కట్టగట్టి ఆపాలన్నా గంగ పొంగులాగేనా
ప్రేమలేని నాడీ నేల పూవులిన్ని పూచేనా
మనిషిలేని నాడు దేవుడైన లేడు
మంచిని కాచే వాడు దేవుడికి తోడు
మనిషికో స్నేహం మనసుకో దాహం
మనిషికో స్నేహం మనసుకో దాహం
లేనిదే జీవం లేదు జీవితం కానే కాదు
మమతనే మధువు లేనిదే చేదు
మనిషికో స్నేహం మనసుకో దాహం
వయసు వయసు కలుసుకుంటే
పూరి గుడిసె రాచనగరు…
ఇచ్చుకోను పుచ్చుకోను..
ముద్దులుంటే పొద్దుచాలదు
ప్రేమ నీకు కావాలంటే పిరికివాడు కారాదు
గువ్వ గూడు కట్టే చోట కుంపటెట్టి పోరాదు
ఓర్వలేని సంఘం ఒప్పుకోదు నేస్తం
జాతి మత భేదాలన్నీ స్వార్థపరుల మోసం
మనిషికో స్నేహం మనసుకో దాహం
మనిషికో స్నేహం మనసుకో దాహం
లేనిదే జీవం లేదు జీవితం కానే కాదు
మమతనే మధువు లేనిదే చేదు
మనిషికో స్నేహం మనసుకో దాహం