Aatma Gowravam (1965)

చిత్రం: ఆత్మగౌరవం (1965)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దాశరధి
గానం: పి. సుశీల
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, కాంచన
దర్శకత్వం: కె.విశ్వనాథ్
నిర్మాత: డి.మధుసూదనరావు
విడుదల తేది: 1965

అందెను నేడే అందని జాబిల్లి
నా అందాలన్నీ అతని వెన్నెలలే
అందెను నేడే అందని జాబిల్లి

ఎన్నేళ్ళకు విరిసె వసంతములు
ఇన్నాళ్ళకు సమ్మెను మల్లియలు
నిదురించిన ఆశలు చిగురించెలే
నిదురించిన ఆశలు చిగురించెలే
చెలికాడే నాలో తలపులు రేపెనులే

అందెను నేడే అందని జాబిల్లి

నా చెక్కిలి మెల్లగ మీటగనే
నరనరముల వీణలు మ్రోగినవి
గిలిగింతల్ నా మేను పులకించెలే
గిలిగింతల్ నా మేను పులకించెలే
నెలరాజే నాతో సరసములాడెనులే

అందెను నేడే అందని జాబిల్లి

ఇక రాలవు కన్నుల ముత్యములు
ఇక వాడవు తోటల కుసుమములు
విను వీధిన నా మది విహరించెలే
వలరాజే నాలో వలపులు చిలికెనులే

అందెను నేడే అందని జాబిల్లి
నా అందాలన్నీ అతని వెన్నెలలే
నా అందాలన్నీ అతని వెన్నెలలే

*********  *********   ********

చిత్రం: ఆత్మగౌరవం (1966)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఘంటసాల

ప్రేమించి పెళ్ళి చేసుకో
నీ మనసంత హాయి నింపుకో
ప్రేమించి పెళ్ళి చేసుకో
నీ మనసంత హాయి నింపుకో

వరుణి వలపేమిటో
వధువు తలపేమిటో
తెలుసుకోలేక పెళ్ళిళ్ళు జరిపించినా
తెలిసి కట్నాలకై బ్రతుకు బలిచేసినా
కడకు మిగిలేది ఎడమోము పేడమోములే

మనిషి తెలియాలిలే
మనసు కలవాలిలే
మరచి పోలేని స్నేహాన కరగాలిలే
మనిషి తెలియాలిలే
మనసు కలవాలిలే
మరచి పోలేని స్నేహాన కరగాలిలే
మధుర ప్రణయాలు మనువుగా మారాలిలే
మారి నూరేళ్ళ పంటగా వెలగాలిలే

నలుడు ప్రేమించి పెళ్ళాడె దమయంతిని
వలచి రుక్మిణియె పిలిపించె శ్రీ కృష్ణున్ని
నలుడు ప్రేమించి పెళ్ళాడె దమయంతిని
వలచి రుక్మిణియె పిలిపించె శ్రీ కృష్ణున్ని
తొలుత మనసిచ్చీ మనువాడే దుష్యంతుడు
పాత పరవళ్ళు తిప్పాలి మీరందరూ..

********   ********   ********

చిత్రం: ఆత్మగౌరవం (1966)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: ఘంటసాల, పి. సుశీల

వలపులు విరిసిన పూవ్వులే కురిపించే తేనియలు
మనసులు కలిసిన చూపులే పులకించి పాడెలే
వలపులు విరిసిన పూవ్వులే కురిపించే తేనియలు

బరువు కనుల నను చూడకూ మరులు గొలిపి మదీ రేపకూ
బరువు కనుల నను చూడకూ మరులు గొలిపి మదీ రేపకూ
చెలి తలపే తెలిపెనులే సిగలోనిలే మల్లెలూ
ఓ..వలపులు విరిసిన పూవ్వులే కురిపించే తేనియలు

ఉరిమిన జడిసే నెచ్చెలీ అడుగక ఇచ్చెను కౌగిలీ
ఉరిమిన జడిసే నెచ్చెలీ అడుగక ఇచ్చెను కౌగిలీ
నీ హృదయములో వొదిగినచో బెదురింక యేమున్నదీ
వలపులు విరిసిన పూవ్వులే కురిపించే తేనియలు

తొలకరి చినుకుల చిటపటలూ చలి చలి గాలుల గుస గుసలూ
తొలకరి చినుకుల చిటపటలూ చలి చలి గాలుల గుస గుసలూ
పెదవులపై మధురిమలే చిలికించ మన్నాయిలే
ఓ.. వలపులు విరిసిన పూవ్వులే కురిపించే తేనియలు
మనసులు కలిసిన చూపులే పులకించి పాడెలే

********   ********   ********

చిత్రం: ఆత్మగౌరవం (1966)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఘంటసాల, పి. సుశీల

రానని రాలేనని ఊరకే అంటావు
రావాలని ఆశలేనిదే ఎందుకు వస్తావు
రానని రాలేనని ఊరకే అంటావు
రావాలని ఆశలేనిదే ఎందుకు వస్తావు

చరణం: 1
కొంటెచూపు చూడకు గుండెకోత కోయకు
కోపమందు కులుకు చూపి కోర్కె పెంచకు
కొంటెచూపు చూడకు గుండెకోత కోయకు
కోపమందు కులుకు చూపి కోర్కె పెంచకు
వేషమైన మోసమైన అంతా నీకోసం… ఊహూ అలాగ

 ॥రానని॥

చరణం: 2
ఎదను గాయమున్నది ఊరడించమన్నది
మొదట ముద్దు తీర్చమని మూల్గుచున్నది… పాపం
ఎదను గాయమున్నది ఊరడించమన్నది
మొదట ముద్దు తీర్చమని మూల్గుచున్నది… పాపం
గుండెమీద వాలిచూడు గోడువింటావు ఆ! అబ్బబ్బబ్బా…

 ॥రానని॥

చరణం: 3
దోరవయసు వేడిలో కోరచూపు వాడిలో
దూరమైన మనసుపడే బాధ అయ్యయ్యో!
దోరవయసు వేడిలో కోరచూపు వాడిలో
దూరమైన మనసుపడే బాధ అయ్యయ్యో!
కరుణచూపు కరుగకున్నా టాటా చీరియో
టాటా చీరియో…

 ॥రానని॥

error: Content is protected !!