Aavida Maa Aavide (1998)

చిత్రం: ఆవిడ మా ఆవిడే (1998)
సంగీతం: శ్రీ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రాజేష్ , పౌర్ణిమ
నటీనటులు: నాగార్జున, టబు , హీరా రాజగోపాల్
దర్శకత్వం: ఇ. వి.వి.సత్యనారాయణ
నిర్మాత: డి.కిషోర్
విడుదల తేది: 14.01.1998

చుమ్మదే చుమ్మదే చుం చుమ్మని చక్కని చుమ్మదే
అమ్మా దేక్ అమ్మ దేక్ జుం జుమ్మున యెగబడుటున్నడే
సొంపులు పెరిగిన సోనా
చంపలు కొరకన కూనా
నెమ్మది కష్టము లోన
తిమ్మిరి తెగ ముదిరేనా
కాదన్న అవ్నన్న వదలను యేమైనా

చుమ్మదే చుమ్మదే చుం చుమ్మని చక్కని చుమ్మదే
అమ్మా దేక్ అమ్మ దేక్ జుం జుమ్మున యెగబడుటున్నడే

నాకు తెలిసి నువ్ love లో పడటం first time అనుకుంతా హ హ
face చూసి ఆ సంగతి యెట్టా పసి గడతావంటా
practies ఉంటె ప్రేమికుడెవడూ permission అడగడు kiss కోసం
warning ఇచ్చి fairing చేద్దం అనుకోవదమా నా దోషం
వాదనలో time అంతా waste ఐపోతుంది

చుమ్మదే చుమ్మదే చుం చుమ్మని చక్కని చుమ్మదే
అమ్మా దేక్ అమ్మ దేక్ జుం జుమ్మున యెగబడుటున్నడే

ఒక్కసారి kiss తగిలిందంటె once more అంటావే
మల్లి మల్లి ఇమ్మన్నానంటె వమ్మో అంటావే
ఇచ్చిన కొద్ది ముచ్చట ముద్దే లక్షనముందే ముద్దుల్లో
లక్షల కొద్ది అచ్చులు గుద్దే ప్రెస్స్ ఉందా నీ లిప్పుల్లో
యేముందో చూదనిదే వద్దనుకోవద్దే

చుమ్మదే చుమ్మదే చుం చుమ్మని చక్కని చుమ్మదే
అమ్మా దేక్ అమ్మ దేక్ జుం జుమ్మున యెగబడుటున్నడే
సొంపులు పెరిగిన సోనా
చంపలు కొరకన కూనా
నెమ్మది కష్టము లోన
తిమ్మిరి తెగ ముదిరేనా
కాదన్న అవ్నన్న వదలను యేమైనా

********  *******   *******

చిత్రం: ఆవిడ మా ఆవిడే (1998)
సంగీతం: శ్రీ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు , చిత్ర ,స్వర్ణలత

ఇంటికెళదాం పదవమ్మో ..
అంత అర్జెన్టేన్తమ్మో

ఓహ్…ఓహ్…ఓహ్…ఓహ్…
ఓహ్…ఓహ్…ఓహ్…ఓహ్…
నిను చూస్తూ ఉంటే మూడొస్తుందమ్మో…
నను కదిలిస్తుంటే కాదలేనమో……
ఓహ్…ఓహ్…ఓహ్…ఓహ్…
ఓహ్…ఓహ్…ఓహ్…ఓహ్…
ఇంటికెళదాం.పదవమ్మో ..
అంత అర్జెన్టేన్తమ్మో …

సైడ్ యాంగిల్ లో నువ్వు శ్రీదేవి అవుతావు .
టాప్ యాంగిల్ లో టబు లాగ తికమక పెడుతున్నావు …
నన్నే చూస్తూ తమరు దేన్నో ఊహిస్తారు ..
నేనూ ఇంకో హీరో పేరు చెబితే ఏమవుతారు
పోన్లే పోలేరమ్మ పోలిక చాలించమ్మా
పోలిక లేనే అందం నాదని పొగడాలండి తమరు….
పొగరు ఫిగరు నీతో సరి ఎవ్వరు
ఓహ్..హా….హా….ఓహ్..హా……ఓహ్..హా
ఓహ్..హా….హా….ఓహ్..హా……ఓహ్..హా
ఇంటికెళదాం పదవమ్మో ..
అంత అర్జెన్టేన్తమ్మో…

బాహాటంగా అయినా బాగానే ఉంటుంది ….
భార్య భర్తల భాగోతానికి
లైసెన్సు ఉంటుంది ….yess ..
బాగోదని కాదండి….పాపం అటు చుడండి..
మననే చూస్తూ ఒంటరి వాళ్ళకి మనసేమవుతుందీ …..
కళ్ళని మూస్తే చాలు కనిపించరు ఇంకెవరు ….
కిందటి జన్మలో మీరు తప్పక పిల్లై పుట్టుంటారు ..
అందరి ముందర ….అల్లరి సరదాలే…
ఓహ్..హా….హా….ఓహ్..హా..హా.హా..హా
ఓహ్..హా….హా….ఓహ్..హా……ఓహ్..హా
ఇంటికెళదాం పదవమ్మో ..
అంత అర్జెన్టేన్తమ్మో…
హా….హా…హా…..లా..లా…లా…. లా
హా….హా…హా…..లా..లా….లా… లా
నిను చూస్తూ ఉంటే మూడొస్తుందమ్మో…
నను కదిలిస్తుంటే కాదలేనమ్మో……
యా….యా..యా….యా.. .యా..యా
యా ..యా…..యా .ఒకే…..యా..యా
లా లా…లా లా…లా లా…లా లా…
లా లా…లా లా…లా లా…లా లా…

********  *******   *******

చిత్రం: ఆవిడ మా ఆవిడే (1998)
సంగీతం: శ్రీ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హరిహరన్, చిత్ర

ఓం నమామీ అందమా ఆనందమే అందించుమా
ఓం నమామీ బంధమా నా నోములే పండించుమా
కౌగిల్ల కారగారం చేరడానికి ఏ నేరం చెయ్యాలో మరీ
నూరెల్లు నీ గుండెల్లొ ఉండడానికి ఏమేమి ఇయ్యలో మరీ
ప్రాణమై చేరుకో ప్రియతమా ఓ ఓ

ఓం నమామీ అందమా ఆనందమే అందించుమా

ఓ.. సోనా సొగసు వీన నిలువునా నిను మీటనా
నే రాన నర నరాన కలవరం కలిగించనా
కల్లార నిన్నె చూస్తు ఎన్నొ కలలే కంటున్నా
ఇల్లాగె నిత్యం ఆ కలోనే ఉండాలంటున్నా
ఈ క్షణం శాస్వతం చెయ్యుమా

ఓం నమామీ అందమా ఆనందమే అందించుమా

నీ యెదలో ఊయలూగే ఊపిరి నాదే మరీ
నా.. ఒడిలో హాయిలాగే అయినది ఈ జాబిలీ
యెన్నెన్నొ జన్మాలెత్తి నేనె నేనై పుట్టాలి
అన్నిట్లొ మల్లి నేనె నీతో నేస్తం కట్టాలి
కాలమే ఏలుమా స్నేహమా ఓ ఓ

ఓం నమామీ అందమా ఆనందమే అందించుమా
ఓం నమామీ బంధమా నా నోములే పండించుమా
కౌగిల్ల కారగారం చేరడానికి ఏ నేరం చెయ్యాలో మరీ
నూరెల్లు నీ గుండెల్లొ ఉండడానికి ఏమేమి ఇయ్యలో మరీ
ప్రాణమై చేరుకో ప్రియతమా ఓ ఓ

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

See More Lyrics
Soukhyam (2015)
error: Content is protected !!