చిరు చిరు చిరు చినుకై కురిశావే… లిరిక్స్
చిత్రం: ఆవారా (2010)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: చంద్రబోస్
గానం: హరి చరణ్ , తన్వి
నటీనటులు: కార్తీ, తమన్నా
దర్శకత్వం: లింగు స్వామి
నిర్మాత: సుభాష్ చంద్రబోస్
విడుదల తేది: 21.05.2010
చిరు చిరు చిరు చినుకై కురిశావే…
మరుక్షణమున మరుగై పోయవే…
నువ్వే ప్రేమబాణం.. నువ్వే ప్రేమ కోణం
పువ్వై నవ్వగానే గాలై ఎగిరేను ప్రాణం
చెయ్ చెయ్ చెలిమిని చెయ్
అంటూ హృదయం పలికినదే
సై సై సరసకు సై
అంటూ పాదం కదిలినదే
ఎదనే నీతో ఎత్తుకేళ్ళావే
చిరు చిరు చిరు చినుకై కురిశావే
మరుక్షణమున మరుగై పోయవే
దేవతా తనే ఒక దేవత ముఖాముఖీ అందమే చూడగా ఆయువే చాలునా
గాలిలో తనేకదా పరిమళం చెలి సఖి అనుమతే
అడగకా పూవ్వులే పుయునా
సిగలో కురులే మేఘల్లలే ఆడేవేళ గుండెల్లోన మేరుపెమేరిసే చూపే మైమరచే
చెలి చెక్కిళ్ళే ముద్దుల్తోనే తడిమేయ్యాల..
చెంగు చెంగు అడుగుల్లోన మువ్వై మదిమురిసే
ఎదనే తనతో ఎత్తుకెళ్ళిందే
చెయ్ చెయ్ చెలిమిని చెయ్
అంటూ హృదయం పలికినదే
సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే
తోడుగా ప్రతి క్షణం వీడక అనుక్షణం
ఆమెతో సాగనా ఆమే నా స్పందన…
నేలపై పడే ఒక నీడనే చక చక చేరనా
ఆపనా గుండెలో చేర్చనా
దారం బదులు ప్రాయంతోనే కట్టేసిందే
గాయంలాగా కోసేసిందే హాయిగా నవ్వేసిందే
నాలోనేను మౌనంగానే మాటడేస్తే మొత్తం తాను వింటూ ఉంటే తీయగా వేధిస్తుందే
ఎదనే తనతో ఎత్తుకెళ్ళిందే
చెయ్ చెయ్ చెలిమిని చెయ్
అంటూ హృదయం పలికినదే
సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే
చిరు చిరు చిరు చినుకై కురిశావే…
మరుక్షణమున మరుగై పోయవే…
చిరు చిరు చిరు చినుకై కురిసావే…
మరుక్షణమున మరుగై పోయవే…
******** ********* ********
అరెరె వాన జడి వాన… లిరిక్స్
చిత్రం: ఆవారా (2010)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: రాహుల్ నంబియర్, సైంధవి
అరెరె వాన జడి వాన
అందాల నవ్వులే పూల వాన
అరెరె వాన జడి వాన
అందాల నవ్వులే పూల వాన
మళ్ళీ మళ్ళీ వానోస్తే మనసు గొడుగు చెలి పడితే
గారం పెరిగింది దూరం తరిగింది
ఏమైంది ఏమైంది ఏదేదో జరిగింది
నెమలి కన్ను లాగ చెలి నాట్యమాడుతుంటే
ఎదే పాలపుంతై నా మనసునాడమంది
ఏమైంది ఏమైంది ఏదేదో జరిగింది
అరెరె వాన జడి వాన
అందాల నవ్వులే పూల వాన
ఆటా పాటా ఓ పాడని పాట
వానే పాడింది అరుదైన పాట
నిన్ను నన్ను కలిపిన ఈ వానకొక సలాం కొట్టు
నేను తప్పిపోయాను నీలోన వెతికి పెట్టు
మంత్రంలాగ ఉంది ఇది తంత్రం లాగ ఉంది
చిత్రంగానే మదిలో ఒక యుద్దం జరుగుతుంది
దేవత ఏది నా దేవత ఏది
తను సంతోషంగా ఆడుతూ ఉంది
నిన్ను మించి వేరెవరూ లేరే
నన్ను మించి నీకెవరూ లేరే
చిన్న చిన్న కళ్ళు రెండు దేవుడు నాకు ఇచ్చాడంట
కళ్ళు రెండు మూసుకున్నా నీవున్నదే మాయమట
మల్లెపూల పొద్దు నాకు ఇచ్చి పోవే ముద్దు
ముద్దు చాటు సద్దు చెరిపేయమంది హద్దు
పులకించింది ఎద పులకించింది
చెలి అందాలనే చిలికించింది
అరెరె వాన జడి వాన
అందాల నవ్వులే అగ్గి వాన
అరెరె వాన జడి వాన
అందాల నవ్వులే అగ్గి వాన
మళ్ళీ మళ్ళీ వానోస్తే పగటి వేళ మెరుపొస్తే
నింగే వంగింది భూమే పొంగింది
నా శ్వాస తగిలాక వణుకు వేడి సోకింది
గొడుగు పట్టీ ఎవరూ ఈ వాననాపవద్దు
అడ్డమొచ్చి ఎవరూ నా మనసునాపవద్దు
ఆడాలి ఆడాలి వానతో ఆడాలి
******** ********* ********
నీ ఎదలో నాకు చోటే వద్దు… లిరిక్స్
చిత్రం: ఆవారా (2010)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: సాగర్ దేశాయ్
నీ ఎదలో నాకు చోటే వద్దు
నా ఎదలో చేటే కోరవద్దు
మన ఎదలో ప్రేమను మాటే రద్దు
ఇవి పైపైన మాటలులే…హే
నీ నీడై నడిచే ఆశ లేదే
నీ తోడై వచ్చే ద్యాస లేదే
నీ తోటే ప్రేమ పోతేపోనీ
అని అబద్దాలు చెప్పలేనులే
నీ జతలోన నీ జతలోన
ఈ ఎండకాలం నాకు వానాకాలం
నీ కలలోన నీ కలలోన
మది అలలాగ చేరు ప్రేమ తీరం
నీ ఎదలో నాకు చోటే వద్దు
నా ఎదలో చేటే కోరవద్దు
మన ఎదలో ప్రేమను మాటే రద్దు
ఇవి పైపైన మాటలులే…హే
చిరుగాలి తరగంటి నీమాటకే ఎద పొంగేను ఒక వెల్లువై
చిగురాకు రాగాల నీ పాటకే తనువూగేను తొలిపల్లవై
ప్రేమ పుట్టాక నాకళ్ళలో దొంగచూపేదో పురివిప్పెనే
కొంచెం నటనున్నది కొంచెం నిజమున్నది
ఈ సయ్యాట బాగున్నది
నువ్వల వేస్తే నువ్వల వేస్తే
నా ఎద మారే నా కథ మారే
అరె ఇది ఏదో ఒక కొత్త దాహం
అది పెరుగుతుంటే వీచే చెలి స్నేహం
ఒకసారి మౌనంగా నను చూడవే ఈ నిమిషమే యుగమౌనులే
నీ కళ్ళలో నన్ను బందించవే ఆ చెర నాకు సుఖమౌనులే
నిన్ను చూసేటి నా చూపులో కరిగే ఎన్నెన్ని మునిమాపులో
పసిపాపై ఇలా నా కనుపాపలే
నీ జాడల్లో దోగాడెనే
తొలి సందెలలో తొలి సందెలలో
ఎరుపే కాదా నీకు సింధూరం
మలి సందెలలో మలి సందెలలో
నీ పాపిటిలో ఎర్రమందారం
నీ ఎదలో నాకు చోటే వద్దు
నా ఎదలో చేటే కోరవద్దు
మన ఎదలో ప్రేమను మాటే రద్దు
ఇవి పైపైన మాటలులే…హే
నీ నీడై నడిచే ఆశ లేదే
నీ తోడై వచ్చే ద్యాస లేదే
నీ తోటే ప్రేమ పోతేపోనీ
అని అబద్దాలు చెప్పలేనులే
******** ********* ********
చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి… లిరిక్స్
చిత్రం: ఆవారా (2010)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: భువనచంద్ర
గానం: సునీతా సారధి
చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి
గాలిపటమల్లె మారెమల్లె స్వామి
చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి
గాలిపటమల్లె మారెమల్లె స్వామి
రా రా రా రాధే రాధే రాధే అలకల రాధే
పాటల్ని పాడి పాడి పాడి పిలిచిన రాధే
ఎదలోన వింత మోహం మనసున ఏదో మాయ దాహం
తెలిసేనా ఎందుకాత్రం హృదయములోన పూల నాట్యం
చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి
గాలిపటమల్లె మారెమల్లె స్వామి
చనువు చనువుగా మాటలాడితే మెరుపులే నువ్వు విసిరినా
రాణివంటూ నీ చెంత చేరితే దొంగలా ఎటు దాగినా
అందం చందం ఉన్న పసిడి మొలకవే
బ్రహ్మకైనా నిన్ను పొగడతరమటే
ముద్దు ముద్దు నడుమే అది తట్టి తట్టి వలలో పడితినే
చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి
గాలిపటమల్లె మారెమల్లె స్వామి
చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి
గాలిపటమల్లె మారెమల్లె స్వామి
హృదయం మంచులా కరిగిపోయెనే ప్రేయసి నా ప్రేయసి
ఒక్క నిమిషము నిన్ను విడవనే తామసి నా తామసి
ఇది వయసుకి వసంత కాలమా
వలపుల తడి తరిగి పోదామా
ఇప్పటి ఒక క్షణపు అనుబంధ గంధం హృదయం మరుచునా..హే
చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి
గాలిపటమల్లె మారెమల్లె స్వామి
చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి
గాలిపటమల్లె మారెమల్లె స్వామి
రా రా రా రాధే రాధే రాధే అలకల రాధే
పాటల్ని పాడి పాడి పాడి పిలిచిన రాధే
నీ అందం నన్ను కుదిపి చిట్టి చిట్టి కలల పానుపు వేసె
నీ గొలుసై పొంగిపోవా నక్షత్రాలే వచ్చి వాలిపోవా
******** ********* ********
ఏదో అలజడి నను పిలిచే… లిరిక్స్
చిత్రం: ఆవారా (2010)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: ఎస్.పి.చరణ్
ఏదో అలజడి నను పిలిచే..
కళ్లే దాటి కలలే నడిచే..
చుట్టూ అంతా నాటకమైతే..
నటన రాక నే వెళ్ళిపోతే..
కాలం కదిలి నన్నే వదిలి
నీతో సాగి పోయనా…
పోదే పొడిచి నింగే విడిచి
వెన్నెల వెళ్ళిపోవునా…
పిల్ల నీ తలపులతో..
ఎదకి ప్రాణం పోసానే..
నీకే దూరం అవుతున్నా…
ఎదని వదిలి వెళుతున్నా…
నన్నే నువ్వుగా మార్చా నేనిక
ఏమి కాక మిగిలానిల
ఎటూ వెళ్ళక ఏమి తోచక
ఉన్న వేచి నువ్వు లేక ఎల
నీ రాక జీవితంలో
నా పగలు రేయిని మరిపించిందిలే
నువ్వు వెంట లేకపోతే
నా చావుకు బతుకుకు తేడా లేదులే
మంటే రేపు తడి జ్వాలముఖి
కన్నీల్లారవే ఓ చెలియా
నువ్వే జ్ఞాపకం అయ్యావు ఈ క్షణం అంతేనా ఓ…
పిల్ల నీ తలపులతో..
ఎదకి ప్రాణం పోసానే..
నీకే దూరం అవుతున్నా…
ఎదని వదిలి వెళుతున్నా…
ఏదో అలజడి నను పిలిచే
కళ్లే దాటి కలలే నడిచే
చుట్టూ అంతా నాటకమైతే
నటన రాక నే వెళ్ళిపోతే
కాలం కదిలి నన్నే వదిలి
నీతో సాగి పోయనా…
పోదే పొడిచి నింగే విడిచి
వెన్నెల వెళ్ళిపోవునా…
పిల్ల నీ తలపులతో..
ఎదకి ప్రాణం పోసానే..
నీకే దూరం అవుతున్నా…
ఎదని వదిలి వెళుతున్నా…
ఓఓ.. ఓఓఓ… ఓఓ.. ఓఓఓ…
ఏద??? ???ల???డి నను song upload cheyandi
ఏద??? ???ల???డి నను song upload cheyandi
Sure We will update. 🙂 Just comment one time, for user saftey and against bad comments we will review your comment.
only music
and
wowww