చిత్రం: ఆయనకి ఇద్దరు (1995)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: మనో, సుజాత
నటీనటులు: జగపతిబాబు, రమ్యకృష్ణ , ఊహ(శివరంజిని)
దర్శకత్వం: ఇ. వి.వి.సత్యనారాయణ
నిర్మాతలు: కంటిపూడి సత్యన్నారాయణ, Ch. సత్యన్నారాయణ
విడుదల తేది: 1995
అరెరరె కొత్తగా ఉందిరో ఈ కుర్రదాని చూపు
అరెరరె మత్తుగా ఉందిరో ఈ కుర్రవాడి ఊపు
కళ్ళల్లో పుట్టింది కోరిక ఓ యమ్మో
ఒళ్ళంతా పాకింది వెచ్చగా
గుండెల్లో దూరాడే గుట్టుగా అమ్మమ్మో
కౌగిళ్లే కోరాడే కమ్మగా
అందాలు చూపించి బంధాలు వేసిందే నీ ప్రేమ
అరెరరె మత్తుగా ఉందిరో ఈ కుర్రవాడి ఊపు
అరెరరె కొత్తగా ఉందిరో ఈ కుర్రదాని చూపూ
ఒడే చేరుకో వయ్యారాల వెల్లువలా
సరే పంచుకో యవ్వనాల జ్వాల
మోజుమొగ్గ విచ్చుకున్న వేళలో
నిన్ను తాకి వెచ్చనాయే వెన్నెల
నచ్చాక మెచ్చాలే ఇచ్చేది ఇవ్వలే పూబాల
అరెరరె మత్తుగా ఉందిరో ఈ కుర్రవాడి ఊపు
అరెరరె కొత్తగా ఉందిరో ఈ కుర్రదాని చూపూ
అదేం మోహమో అలుముకుంది వేకువలా
ఇదేం బిడియమో విరహమాగదేలా
దోర సిగ్గు దోచుకోకు పోకిరి
చెప్పలేని చోటరేగె ఆవిరి
ఔనంటే కాదంట కాదంటే ఔనంట ఈ పూట
అరెరరె కొత్తగా ఉందిరో ఈ కుర్రదాని చూపు
అరెరరె మత్తుగా ఉందిరో ఈ కుర్రవాడి ఊపు
కళ్ళల్లో పుట్టింది కోరిక ఓ యమ్మో
ఒళ్ళంతా పాకింది వెచ్చగా
గుండెల్లో దూరాడే గుట్టుగా అమ్మమ్మో
కౌగిళ్లే కోరాడే కమ్మగా
అందాలు చూపించి బంధాలు వేసిందే నీ ప్రేమ
అరెరరె మత్తుగా ఉందిరో ఈ కుర్రవాడి ఊపు
అరెరరె కొత్తగా ఉందిరో ఈ కుర్రదాని చూపూ