చిత్రం: ఆయుధం (2003)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: భీమ్స్
గానం: ఉదిత్ నారాయన్, ఉష
నటీనటులు: రాజశేఖర్ , సంగీత, గుర్లిన్ చోప్రా
దర్శకత్వం: యన్.శంకర్
నిర్మాత: శ్రీనివాసరావు
విడుదల తేది: 23.05.2003
ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే
ఓయ్ రాజు గుండెల్లో నువ్వే
ఓయ్ రాజు నిను చూడకుంటే మనసాగదయ్యో ఏ మంత్రమేశావయ్యో
ఏయ్ రాణి వెన్నెల్లో నువ్వే
ఏయ్ రాణి పువ్వుల్లో నువ్వే
ఏయ్ రాణి నిను చేరుకుంటా మనువాడుకుంటా మనసంత నీదేనమ్మో
ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే
ఓయ్ రాజు గుండెల్లో నువ్వే
చల్లనీ వేల చింతల్లో మేడ చక్కని రాజు రావయ్యో
ఓయ్ రాజు వయ్యారి వగలు
ఓయ్ రాజు పుట్టించే సెగలు
నల్లనీ మేఘ మెల్లగా నాట్యమే రాణి చెయ్యవే
ఏయ్ రాణి కవ్వించే కళలు
ఏయ్ రాణి నీలోని హొయలు
కన్ను కన్ను కలిసిన వేల కలిగెను కోరికలు
గుండెల్లోకి చేరి నన్నే పెట్టెను గిలిగింతలు
గిచ్చింది నన్ను గిల్లింది ప్రేమ ఏదేదో నన్ను అడిగింది
ఓయ్ రాజు… హొయ్
ఓయ్ రాజు… హొయ్
ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే
ఓయ్ రాజు గుండెల్లో నువ్వే
మేలుకో నువ్వు కోరుకో నేటి రాతిరే నను ఏలుకో
ఓయ్ రాజు కలదోయి రేయి
ఓయ్ రాజు మనదేలే హాయి
దూకొచ్చే నీలో యవ్వనం ఒంపు సొంపుల్లో పూచే మందారం
ఏయ్ రాణి సందేల వీణ
ఏయ్ రాణి సంగీత మేళ
మావో మావో మల్లెల్లో నీ రూపే నే దాచుకున్నానులే
పిల్లో పిల్లో నీ ఒళ్ళో నే వాలి దోచేసుకుంటానులే
రారాజు రారా ఓయ్ రాజు నీపై నా మోజు తీరు ఈరోజు
ఓయ్ రాజు… హొయ్
ఓయ్ రాజు… హొయ్
ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే
ఓయ్ రాజు గుండెల్లో నువ్వే
ఓయ్ రాజు నిను చూడకుంటే మనసాగదయ్యో ఏ మంత్రమేశావయ్యో
ఏయ్ రాణి వెన్నెల్లో నువ్వే
ఏయ్ రాణి పువ్వుల్లో నువ్వే
ఏయ్ రాణి నిను చేరుకుంటా మనువాడుకుంటా మనసంత నీదేనమ్మో
లాలాల లాలాల లాలా (2)
******** ******** ********
చిత్రం: ఆయుధం (2003)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: పద్మ శ్రీనివాస్
గానం: ఉదిత్ నారాయన్, కల్పన
రంగారెడ్డి జిల్లా కన్నా విశాలమైనది హృదయం
పుల్లారెడ్డి మిఠాయి కన్నా భలేగా ఉంది అధరం
అయ్ హాయ్ హయ్ రంగారెడ్డి జిల్లా కన్నా విశాలమైనది హృదయం
పుల్లారెడ్డి మిఠాయి కన్నా భలేగా ఉంది అధరం
సంజీవిరెడ్డి పార్క్ లోన అడుకుందాం చిక్బమ్
బి యన్ రెడ్డి వాస్తులు కట్టి కట్టుకుందాం భవనం
ఆ శిల్పారామం శిల్పంలా నడిసొచ్చాడీ బ్రహ్మం
నీ గుమ్మం దాటి వచ్చావంటే కదిలొస్తుందే ఖమ్మం
నాన్నిట్టా చంపుకు తినకయ్యో నా బుగ్గలు గిచ్చి టు మచ్ అవుతుంది నీ పిచ్చి
అట్టట్టా షాకులు చెప్పొద్దే నా తింగర బుచ్చి మొదలెడదాం కోతి కొమ్మచ్చి
పొట్టేలు మాంసం కిలోడు తెచ్చి పలావు చేసాన్రో
ఈ పటందు సారు రాత్రికి వస్తే సులాము చేస్తారో
దినక్కు దిన్నా దిన్నారే దినక్కు దిన్నా
అబ్బా దినక్కు దిన్నా దిన్నారే దినక్కు దిన్నా
అమాసకోసం పినాకినెక్కి తెనాలి వచ్చానే
ఈ ఆషాఢమాసం పక్కకు నెట్టి పల్లకి తెచ్చానే
నీ బొంగా గుంట నువ్వంటే తెగ పడిచస్తది మామా
ఈ గుంటడు గుంటది లవ్వంటే మరి ఏమనుకున్నావ్ భామా
ఈ రబ్బరు బొమ్మను చూస్తుంటే చిరు చమటలు పట్టి నా లివరుకు చలి జ్వరమొచ్చిందే
ఈ అబ్బడి తిప్పలు చూస్తుంటే నా చాపల చెట్టి తుక తుక తుక తొందరపెట్టిందే
హే రంగారెడ్డి జిల్లా కన్నా విశాలమైనది హృదయం
పుల్లారెడ్డి మిఠాయి కన్నా భలేగా ఉంది అధరం
సంజీవిరెడ్డి పార్క్ లోన అడుకుందాం చిక్బమ్
బి యన్ రెడ్డి వాస్తులు కట్టి కట్టుకుందాం భవనం
భంచికి భం భం కంచికి మొక్కి కండలు పెంచానే
చించికి ముద్దులు పెట్టావంటే విశాఖ ఉక్కేనే
దినక్కు దిన్నా దిన్నారే దినక్కు దిన్నా
దినక్కు దిన్నా దిన్నారే దినక్కు దిన్నా
హే భం భం బోలే బాదం పప్పు బండెడు తెచ్చారో
మా బాపట్లోస్తే ఎవ్రీ మార్నింగ్ వాటరు ఇస్తారో
నీ స్టెప్పులు చూసి ఈస్ట్ వెస్ట్ స్లిప్పయ్యి బెదిరే భామా
నీ స్టెప్పును చుసి ఆంధ్రా సీడెడ్ నైజాం అదిరే మామా
హే జెడ్చర్ల జంక్షన్ కొచ్చింది నా మిర్చి బజ్జి రోడ్డంతా టెన్షన్ పెట్టిందే
మాచర్ల ఫంక్షన్ కొచ్చింది నా అయిసర్ బజ్జి సూపులుతో సోకులు గిచ్చింది
అయ్ హాయ్ హయ్ రంగారెడ్డి జిల్లా కన్నా విశాలమైనది హృదయం
పుల్లారెడ్డి మిఠాయి కన్నా భలేగా ఉంది అధరం
సంజీవిరెడ్డి పార్క్ లోన అడుకుందాం చిక్బమ్
బి యన్ రెడ్డి వాస్తులు కట్టి కట్టుకుందాం భవనం
******** ******** ********
చిత్రం: ఆయుధం (2003)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: వరంగల్ శ్రీనివాస్
గానం: స్వర్ణలత, శంకర్ మహదేవన్
భుహికి మైనానీ కోనయమోని కోనయమోని
భూషధపోలాలే కోనయమోని
షాహిత కైనీలే కోనయమోని కోనయమోని
ఆహిస్త కైనీలే కోనయమోని
ఏ హే హే హే… ఓ ఓ ఓ అ…అ… అ… ఆ
మేఘాలె ఈ వేళా చినుకల్లే రావాలా చినుకల్లే రావాలా
నామేను తడవాలా పులకింత నవ్వాలా
భూదేవి నాఇంటి శ్రీదేవి కావాలా శ్రీదేవి కావాలా
నింగికి నాదేవి అందాలు తేవాలా
అంబరాల పందిరి వెయ్యలా హో…
కొండంచు పీటలు కావాలా హో…
ధాలో పైట వాలియే సీలి మనిజారి
ధాలో పైట వాలియే సీలి మనిజారి
సిల్మా మైనా ఈరో ఛాల తోని కాలివాలోయే సోని ఏరేఛాలి
ఊహాలకే ఓ యవ్వనాల ఊపిరి పొయ్యాలా…
రిమ రిమ రిమ రిమ రిమ రిమ
రెక్కలతొ దిక్కులన్నింటిని చుట్టీ రావాలా
కూహూ కూహూ కోకిలమ్మ కొత్త పాట పాడాలా కూనలమ్మ గంతులేసి ఆడాలా
వేకువమ్మా మూతి ముడుచుకోవాలా ముక్కున వేలేసి మెచ్చుకోవలా
ఓ లాలో ఓలా ఓలా ఓలా ఓలా ఓ లాలో
మేఘాలె ఈ వేళా చినుకల్లే రావాలా చినుకల్లే రావాలా
భూదేవి నాఇంటి శ్రీదేవి కావాలా
చిమ్మచెక్కా చిమ్మచెక్కారే మరో జీవ బరూచేని
చిమ్మచెక్కా చిమ్మచెక్కారే మరో జీవ బరూచేని
వరంగల్లు జాను వారుతరాల మరో జీవ బరూచేని
నల్లగొండ జాను వారుతరాల మరో జీవ బరూచేని
వన్నెలలో వెన్నదొంగ నువ్వే కావాలా…
రిమ రిమ రిమ రిమ రిమ రిమ
మండుతున్న సూరీడికి మతే పోవాలా ఓహో ఓహో
చెప్పరాని మాట విప్పి చెప్పాలా వెచ్చని కౌగిట్లో హత్తుకోవాలా
రెప్పచాటు పాపా దాగిపోవలా రెయ్యంత ఇట్టాగే ఉండిపోవాలా
ఓ లాలే ఓలా ఓలా ఓలా ఓ లాలే
మేఘాలె ఈ వేళా చినుకల్లే రావాలా చినుకల్లే రావాలా
భూదేవి నాఇంటి శ్రీదేవి కావాలా
******** ******** ********
చిత్రం: ఆయుధం (2003)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: ఉష, వందేమాతరం శ్రీనివాస్
బంగారు బొమ్మరావే పందిట్లో పెళ్లి నేడే
ఇక లేవులే రణాలు ఎటుచూడు తోరణాలు
కక్షలు ఇంకా లేనేలేవమ్మా అక్షింతలును కలపండోయమ్మా
కళ్ళల్లోన కన్నీరేంటమ్మా చెల్లెలుకిచ్చే కట్నం లేదమ్మా
బంగారు బొమ్మరావే పందిట్లో పెళ్లి నేడే
పెన్నా సాక్షి మన పెళ్లిపీట వేసింది చిన్నిప్రేమా
ఈ సూర్యచంద్రులను బావమరుదులుగా చూసి మురిసె సీమా
బాంబులు నేడు తాంబూలాలై సంకల్పాలే సుముహూర్తాలై
మెల్లంగా కొంటె వరుడు ఉంగరాలు మార్చు వేళ
గిల్లగా ఈ పిల్లకు అణువణువున ఆనందం
గుడు గుడు గుంచం గుండెల్లో రాగం…
డుం డుం బాజా సన్నాయి మేళం…
హా హా… గుడు గుడు గుంచం గుండెల్లో రాగం…
హే… డుం డుం బాజా సన్నాయి మేళం…
బంగారు బొమ్మరావే పందిట్లో పెళ్లి నేడే
ఎదురు పడితే తొడ చరిసి పగతో ఉరిమురిమి చూసెవాళ్ళు
ఈ రోజు పెళ్లి మండపము ముందు బంధువులు అయ్యినారు
పసుపు రాసిన మూరెడు తాడు ఒక్కటి చేసే పల్లెలు నేడూ
మీ గుండెల్లోన ఉంది రాల్లనైన నీరు చేసే త్యాగము అనురాగము ఇక ప్రేమే అనుబంధం
ప్రేమా ప్రేమా మీదే ఊరమ్మా…
రాయలసీమ పుట్టిల్లేనమ్మా…
అ ఆ… ప్రేమా ప్రేమా మీదే ఊరమ్మా…
రాయలసీమ పుట్టిల్లేనమ్మా…
బంగారు బొమ్మరావే పందిట్లో పెళ్లి నేడే
ఇక లేవులే రణాలు ఎటుచూడు తోరణాలు
లలలా లలలా లలలా లలలా
లల లాలే లాలలా లల లాలే లాలలా
******** ******** ********
చిత్రం: ఆయుధం (2003)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: ఉదిత్ నారాయన్, ఉష
ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా
ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా
ఆ ఇంద్ర లోకం నిన్ను నన్ను ఏకం కమ్మందా
ముత్యమా ముత్యమా వస్తవా ముద్దులే మత్తుగా ఇస్తవా
ఓవింత కవ్వింత నీకంత చొరవా
ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలిప్రేమ ఫలితమా
పరువమా ప్రణయమా నీ చెలిమిలో తీపి మధురిమా
ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా
ఆ ఇంద్ర లోకం నిన్ను నన్ను ఏకం కమ్మందా
శ్రీరంగా నిను కోరంగా ఈ గిలిగింతలు చలిలో చమటలు
గారంగా నువు తేరంగా మదిలో మెరుపులు ఎధలో పరుగులు
దాయి దాయి దాయి దామ్మా దరి దాయి దాయి దాయి దామ్మా
పాపలయ్యి పాడుకుందామా చేపలల్లే ఈదుకుందామా
గుండె బావి తోడుకుందామా ఈడు దాహం తీర్చుకుందామా
నీళ్లలోనే మనముంటున్నా తీరని దాహాలేంటమ్మా
ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా
ఆ ఇంద్ర లోకం నిన్ను నన్ను ఏకం కమ్మందా
వేసవిలో నిను చూస్తుంటే చలివేస్తున్నది చెలి ఏంటే ఇది
వేకువలో నువులేకుంటే వెలుగే ఎలుగుతూ రానంటున్నది
దాయి దాయి దాయి దామ్మా దరి దాయి దాయి దాయి దామ్మా
తాజమహల్ చేరుకుందామా లవ్ గజల్ పాడుకుందామా
తారలన్నీ తెంచుకుందామా తోరణాలే కట్టుకుందామా
ఓ చంద్రమండల వీధుల్లోన చెలియా మీటే అవుదామా
ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా
ఆ ఇంద్ర లోకం నిన్ను నన్ను ఏకం కమ్మందా
ముత్యమా ముత్యమా వస్తవా ముద్దులే మత్తుగా ఇస్తవా
ఓవింత కవ్వింత నీకంత చొరవా
ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలిప్రేమ ఫలితమా
పరువమా ప్రణయమా నీ చెలిమిలో తీపి మధురిమా
లాల లాల లాలా లాలా లాల లాలాలా
లాల లాల లాలా లాలా లాల లాలాలా
******** ******** ********
చిత్రం: ఆయుధం (2003)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సీనారే (సి. నారాయణ రెడ్డి)
గానం: శంకర్ మహదేవన్, అనురాధ శ్రీరామ్
అబ్బ ఎం నడుమయ్యె నాయనో ఓరి నాయనో ఓరి నాయనో ఓరి నాయనో
హమ్మా ఎం నడకయ్యో నాయనో ఓరి నాయనో ఓరి నాయనో ఓరి నాయనో
ఈ పిల్లది కుయ్యో మొర్రో మిగిలున్నది నుయ్యో గొయ్యో చలిగాలి పడదోయమ్మో నా జోలికి రావద్దమ్మో
నేనే నీ వెంట చూసినాక ఇట్టే లొట్టలేసినారో పిలగా నీకు మొక్కినారో నక్క తొక్కినానో
దూర దూర మున్నావ్ ఎవరో దోచుకోర నన్నే జర దారి చూపుతారో రారా దుమ్ములేపుకోరా
హే ఢమ ఢమ ఢమ ఢమ ఢమ ఢమ ఢమ ఢమ మరదలాయే మద్దెల్
అబ్బ ఎం నడుమయ్యె నాయనో ఓరి నాయనో ఓరి నాయనో ఓరి నాయనో
హమ్మా ఎం నడకయ్యో నాయనో ఓరి నాయనో ఓరి నాయనో ఓరి నాయనో
హే… మనోహర నీ మారుమల్లే రా బండిడు సిగ్గుల్రో బావా నీకేరో బుగ్గల్ని పిండేస్తూ
హో… నా మరదలా ఎం మరియాదలే కుంచడు కులుకులుతో సోలడు సోకులతో కంచి దాటి రాకే పిల్లా కవ్వించేలా
కడవలాగ చంకను ఎక్కి చెక్కిలిగిలి నడుముకి పెట్టి ఒట్టేడో పక్కనపెట్టి ఉట్టి కట్ట వచ్చి
హే నీ దూకుడు ఆపవే బుల్లో నీ జిత్తులు పారవే పిల్లో ఓసోసి టక్కరి కన్నె నువ్వు తోక ముడిసెయ్
హే కిటకిట కిటకిట లకుముకి పిట్ట పిట్టగోడ దూకేయ్
అబ్బ ఎం నడుమయ్యె నాయనో ఓరి నాయనో ఓరి నాయనో ఓరి నాయనో
హమ్మా ఎం నడకయ్యో నాయనో ఓరి నాయనో ఓరి నాయనో ఓరి నాయనో
హో నా సుందర ఇక లేటేందిరా మెట్టలు పెట్టాల్రోయ్ గుట్టల్ పట్టాల్రోయ్ బాజా బజంత్రీలు మొగిద్దామా
హ తకదిం
ఓ… నీలాంబరి నా కాదంబరి పెళ్ళిగిళ్లంటూ పిల్లజల్లంటు ఎందుకింత పై పై కొస్తూ చంపేస్తావే
తలుపులుకు గొళ్ళెం పెట్టే మంచానికి గజ్జలు కట్టి మల్లెలకు వాసన చూసి చడుగుడాడుకుందాం
హే… వెన్నెలనీ ఒంటికి చుట్టి చికటినీ కురులకి కట్టి
బిగ్గరగా కౌగిట బట్టి తప్పెటాడుకుందాం
హే నయాన భయాన స్వయాన నువ్వే లొంగిపోయే గిలికే
అబ్బ ఎం నడుమయ్యె నాయనో ఓరి నాయనో ఓరి నాయనో ఓరి నాయనో
హమ్మా ఎం నడకయ్యో నాయనో ఓరి నాయనో ఓరి నాయనో ఓరి నాయనో
ఓరి నాయనో ఓరి నాయనో ఓరి నాయనో