Abhilasha (1983)

చిత్రం: అభిలాష (1983)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, ఎస్. జానకి
నటీనటులు: చిరంజీవి , రాధిక
దర్శకత్వం: ఏ. కోదండ రామిరెడ్డి
నిర్మాత: కె.ఎస్. రామారావు
విడుదల తేది: 11.03.1983

సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది
అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది
మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బులయ్యే ఒళ్ళు
ఎవ్వరికిస్తుందో ఏమౌతుందో
ఎవ్వరికిస్తుందో ఏమౌతుందో
సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది
అందగాడికి తోడు చలిగాలి రమ్మంది
ఎల్లువయ్యే ఈడు ఏడెక్కీపోయే వాడు
ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో
ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో

చరణం: 1
కొండాకోన జలకాలాడే వేళ
కొమ్మరెమ్మ చీర కట్టే వేళ
పిందె పండై చిలక కొట్టే వేళ
పిల్ల పాప నిదరే పోయే వేళ
కలలో కౌగిలి కన్నులు దాటాల
ఎదలే పొదిరిల్లై వాకిలి తియ్యాల
ఎదటే తుమ్మెద పాట పువ్వుల బాట వెయ్యాల

సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది
అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది
ఎల్లువయ్యే ఈడు ఏడెక్కీపోయే వాడు
ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో
ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో

చరణం: 2
మల్లె జాజి మత్తు చల్లే వేళ
పిల్లా గాలి జోల పాడే వేళ
వానే వాగై వరదై పొంగే వేళ
నేనే నీవై వలపై సాగే వేళ
కన్నులు కొడుతుంటే ఎన్నెల పుట్టాల
పుట్టిన ఎన్నెల్లో పుట్టకళ్ళు తాగాల
పగలే ఎన్నెల గుమ్మా చీకటి గువ్వాలాడాల

సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది
అందగాడికి తోడు చలిగాలి రమ్మంది
మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బులయ్యే ఒళ్ళు
ఎవరికిస్తుందో ఏమౌతుందో
ఎవరికిస్తుందో ఏమౌతుందో
సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది
అందగాడికి తోడు చలిగాలి రమ్మంది

*******   ****** ********

చిత్రం: అభిలాష (1983)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, ఎస్.జానకి

బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే
మల్లీ మందారం పెళ్ళాడుకున్నాయిలే
నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని
నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని
బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే

తేనెవాగుల్లో మల్లె పూలల్లే తేలిపోదాములే
గాలీవానల్లో మబ్బు జంటల్లే రేగిపోదాములే
విసిరే కొసచూపే ముసురై పోతుంటే
ముసిరే వయసుల్లో మతి అసలే పోతుంటే
వేడెక్కి గుండెల్లో తలదాచుకో
తాపాలలో ఉన్న తడి ఆర్చుకో
ఆకాశమంటే ఎదలో జాబిల్లి నీవే వెన్నెల్లు తేవే

బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే
నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని
నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని
బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే

తారత్తా తరతత్ తరతా
తారత్తా తరతత్ తరరా

పూతపెదవుల్లో పుట్టు గోరింట బొట్టు పెట్టిందిలే
ఎర్ర ఎర్రంగా కుర్ర బుగ్గల్లో సిగ్గు తీరిందిలే
ఒదిగే మనసేదో ఒకటై పొమ్మంటే
ఎదిగే వలపంతా ఎదలొకటై రమ్మంటే
కాలాలు కరిగించు కౌగిళ్ళలో
దీపాలు వెలిగించు నీ కళ్ళతో
ఆ మాట వింటే కరిగే నా ప్రాణమంతా నీ సొంతమేలే

బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే
మల్లీ మందారం పెళ్ళాడుకున్నాయిలే
నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని
నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని

*******   *******   ********

చిత్రం : అభిలాష (1992)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, ఎస్.జానకి

ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి
సొగసులై బృందావని విరిసె నా సిగలోనికి
జత వెతుకు హృదయానికీ శృతి తెలిపె మురళీ
చిగురాకు చరణాలకి సిరిమువ్వ రవళీ
రసమయం జగతి

ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి

నీ ప్రణయభావం నా జీవ రాగం
నీ ప్రణయభావం నా జీవ రాగం
రాగాలు తెలిపే భావాలు నిజమైనవి
లోకాలు మురిసే స్నేహాలు రుజువైనవి
అనురాగ రాగాల స్వరలోకమె మనదైనది

ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి
జత వెతుకు హృదయానికీ శృతి తెలిపె మురళీ
చిగురాకు చరణాలకి సిరిమువ్వ రవళీ
రసమయం జగతి

నా పేద హృదయం నీ ప్రేమ నిలయం
నా పేద హృదయం నీ ప్రేమ నిలయం
నాదైన బ్రతుకే ఏనాడో నీదైనది
నీవన్న మనిషే ఈ నాడు నాదైనది
ఒక గుండె అభిలాష పది మందికి బ్రతుకైనది

ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి
సొగసులై బృందావని విరిసె నా సిగలోనికి
జత వెతుకు హృదయానికీ శృతి తెలిపె మురళీ
చిగురాకు చరణాలకి సిరిమువ్వ రవళీ
రసమయం జగతి
బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Sneha Geetham (2010)
error: Content is protected !!