చిత్రం: అభిమానవంతులు (1973)
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
సాహిత్యం: సినారె
గానం: సుశీల
నటీనటులు: కృష్ణంరాజు, శారద, అంజలీ దేవి
దర్శకత్వం: కె.ఎస్.రామిరెడ్డి
నిర్మాతలు: ఎమ్.రామకృష్ణారెడ్డి, బి. నరసింహారావు
విడుదల తేది: 1973
పల్లవి:
ఎప్పటివలె కాదురా.. ఎప్పటివలె కాదురా ..
నా స్వామీ.. ఎప్పటివలె కాదురా
ఈ ముద్దు ఈ మురిపెమే పొద్దు ఎరుగవు లేరా
ఎప్పటివలె కాదురా.. నా స్వామీ ఎప్పటివలె కాదురా
చరణం: 1
పున్నమి కళలన్నీ మోమున ముడిచి అమృతమాధురులు అధరాన దాచీ ఆ…ఆ…ఆ..
పున్నమి కళలన్నీ మోమున ముడిచి అమృతమాధురులు అధరాన దాచీ
నిన్నలేని రమణీయరూప నవనీతకాంతితో వున్నానురా
అభినయం నాదిరా అనుభవం నీదిరా
అభినయం నాదిరా అనుభవం నీదిరా
కులుకు కులుకులో పలుకు పలుకులో లలితరాగములు చిలకరింతురా
ఎప్పటివలె కాదురా..
నా స్వామీ ఎప్పటివలె కాదురా….
చరణం: 2
పదును చూపుతో మదనుని కవ్వించి చిగురునవ్వుతో వగలను రగిలించి.. ఆ.. ఆ..
పదును చూపుతో మదనుని కవ్వించి చిగురునవ్వుతో వగలను రగిలించి.. ఆ.. ఆ..
అందలేని ఆనందలోక నవనందనాల తేలించేనురా
లాలనం నాదిరా పాలనం నీదిరా లాలనం నాదిరా పాలనం నీదిరా
వసంతవేళల రసైకలీలల నిశాంతముల పరవశించేమురా
ఎప్పటివలె.. ఎప్పటివలె కాదురా… నా స్వామి ఎప్పటివలె కాదురా
పా ని స ని గసనిదమ మగసనిదగమగ రినిస
స స రి రి గ గ రిగ రిగ గమ ని గ రి దమని
ఎప్పటివలె కాదురా.. నా స్వామి ఎప్పటివలె కాదురా
****** ******* *******
చిత్రం: అభిమానవంతులు (1973)
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
సాహిత్యం: సినారె
గానం: సుశీల
పల్లవి:
ఈ వీణ పైన పలికిన రాగం… నాలోన విరిసిన అనురాగం
మీటితే మ్రోగేది రాగం… ఎదమాటుగా పెరిగేది అనురాగం
మీటితే మ్రోగేది రాగం… ఎదమాటుగా పెరిగేది అనురాగం
ఈ వీణ పైన పలికిన రాగం… నాలోన విరిసిన అనురాగం
చరణం: 1
కలిమిలోన మిడిసిపడనిది… లేమిలోన కలత పడనిది
కలిమిలోన మిడిసిపడనిది… లేమిలోన కలత పడనిది
ఇరువురి నడుమా ఎల్లలు లేనిది
ఇరువురి నడుమా ఎల్లలు లేనిది
వలచిన హృదయల తొలి కలయిక.. ఆ.. ఆ.. ఆ..
ఈ వీణ పైన పలికిన రాగం… నాలోన విరిసిన అనురాగం
చరణం: 2
కనిపించే ఆతని చిరు నవ్వులోనా… కవితలకందని మధురభావన.. ఆ..
కనిపించే ఆతని చిరు నవ్వులోనా… కవితలకందని మధురభావన
ఆ భావనయే ఆరాధనగా…
ఆ భావనయే ఆరాధనగా… అతనికి నేనే ఒక కానుక.. ఆ.. ఆ.. ఆ
ఈ వీణ పైన పలికిన రాగం… నాలోన విరిసిన అనురాగం
మీటితే మ్రోగేది రాగం… ఎదమాటుగా పెరిగేది అనురాగం
ఈ వీణ పైన పలికిన రాగం… నాలోన విరిసిన అనురాగం