చిత్రం: అభిమన్యుడు (1984)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, సుశీల
నటీనటులు: శోభన బాబు, విజయశాంతి, రాధిక
దర్శకత్వం: దాసరి నారాయణ రావు
నిర్మాత: కె.మురారి
విడుదల తేది: 1984
పల్లవి:
తడిసిన కోరిక తాళం తడుతుంటే…
ముసిరే వయసుకు మువ్వలు కడుతుంటే
రారా చేసిపోరా… శివతాండవం…
హోయ్.. హోయ్.. హోయ్…
రారా చేసిపోరా… శివతాండవం… హాయ్
తడిసిన కోరిక తాళం తడుతుంటే…
ముసిరే వయసుకు మువ్వలు కడుతుంటే
రానా చేసిపోనా… శివతాండవం…
హోయ్.. హోయ్.. హోయ్…
రానా చేసిపోనా… శివతాండవం… హాయ్
చరణం: 1
సరిగంగ స్నానాలు చేసి…ఆహా
తనువెల్ల తాపాలు మోసి… హయ్ హయ్
సరిగంగ స్నానాలు చేసి… తనువెల్ల తాపాలు మోసి
తడితడి పైటా..అహా.. తాకిన చోట.. ఉడికెక్కిపోతుంటే
తడితడి పైటా..అహా.. తాకిన చోట.. ఉడికెక్కిపోతుంటే
అడుగడుగున గంగవెర్రులు అలజడి పెడుతుంటే.. శివతాండవం
తడిసిన కోరిక తాళం తడుతుంటే…
ముసిరే వయసుకు మువ్వలు కడుతుంటే
రారా చేసిపోరా… శివతాండవం…
రానా.. హాయ్… చేసిపోనా… శివతాండవం… హాయ్
చరణం: 2
పుడుతోంది గుండెల్లో ఉరుము… పడగెత్తి పోతోంది నడుము
పుడుతోంది గుండెల్లో ఉరుము… పడగెత్తి పోతోంది నడుము
పిడికిట్లోనా.. అహా.. పిల్లనడుమేమో… గిజగిజలాడుతుంటే
పిడికిట్లోనా.. అబా.. పిల్లనడుమేమో… గిజగిజలాడుతుంటే
పెదవుల్లు పెను దాహం ఉబికిఉబికి వస్తుంటే… శివతాండవం
తడిసిన కోరిక తాళం తడుతుంటే…
ముసిరే వయసుకు మువ్వలు కడుతుంటే
రానా చేసిపోనా… శివతాండవం… హాయ్
హోయ్.. హోయ్.. హోయ్…
రారా చేసిపోరా… శివతాండవం…
శివతాండవం… శివతాండవం
శివతాండవం… శివతాండవం
****** ******* *******
చిత్రం: అభిమన్యుడు (1984)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, సుశీల
పల్లవి:
ఆకేసి.. పప్పేసి.. బువ్వేసి.. నెయ్యేసి
తనకో ముద్ద.. నాకో ముద్ద
ఆకేసి.. పప్పేసి.. బువ్వేసి.. నెయ్యేసి
తనకో ముద్ద.. నాకో ముద్ద
తినిపించువాడొచ్చే వేళయింది.. వళ్ళంతా కళ్ళుగా ఎదురొచ్చింది
ఇలా.. ఇలా.. ఇలా..ఆ..ఇలా.. ఇలా.. ఇలా..
చరణం: 1
అతగడే జతగాడు అనుకున్నది.. అనుకున్నదే కలలు కంటున్నది
అతగాడే జతగాడు అనుకున్నది.. అనుకున్నదే కలలు కంటున్నది
కలలోని విందు… కనులవిందవునా
కలలోని విందు… కనులవిందవునా
మనసులోని ఆశ… మాంగళ్యమౌనా
ఇలా… ఇలా… ఇలా..ఆ..ఇలా… ఇలా… ఇలా
చరణం: 2
ఇది కలా… కలా… కలా… మనమిలా.. ఇలా… ఇలా
గాలిలా పువ్వులా తావిలా… కలిసి ఉన్నాము కలవకనే
కలుసుకున్నాము… తెలియకనే
వెలుగుకు నీడకు చెలిమిలా… ఒక్కటైనాము కలవకనే
ఒదిగి ఉన్నాము… కరగకనే
ఈ ప్రేమపత్రము..ఈ జన్మకు చెల్లువేయ్యుము
ప్రతి జన్మజన్మకు..మరల తిరగ వ్రాసుకొందము
ఎలా ఎలా ఎలా..ఆ ఆ ఆ
ఇలా ఇలా ఇలా..ఇలా ఇలా ఇలా
ఆకుంది పప్పుంది బువ్వుంది నెయ్యుంది
ఆకలి ఉంది..ఆశ ఉంది
చరణం: 3
వెన్నెల కలువలా చెలువలా మందగించాము… జతలుగ
విందులవుదాము… కథలుగా
కన్నుల పాపలా… చూపులా.. చూచుకుందాము… సొగసులుగా
పగలు రేయిగా… రేయి పగలుగా
ఈ రాగసూత్రము… మూడుముళ్ళు వేసుకుందము
ఈ మూగమంత్రము… దీవెనగా చేసుకుందము
ఎలా ఎలా ఎలా..ఆ… ఆ… ఆ…
ఇలా.. ఇలా.. ఇలా..ఇలా… ఇలా… ఇలా
ఆకుంది పప్పుంది బువ్వుంది నెయ్యుంది
ఆకలి ఉంది..ఆశ ఉంది
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్…. మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
****** ******* *******
చిత్రం: అభిమన్యుడు (1984)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, సుశీల
పల్లవి:
ఆ.. ఆ.. ఆహ.. హా.. అహా..హా..
నిసనిస.. నిసనిగ.. సగ సమా.. ఆ.. ఆ..
శృంగార సీమంతిని…
శృంగార సీమంతిని.. నా జీవన మందాకిని
నీ కనుసన్న సైయ్యాటలో.. నను జీవించనీ.. మరణించనీ
శృంగార సీమంతిని.. నా జీవన మందాకిని
నీ కనుసన్న సైయ్యాటలో.. నను జీవించనీ.. మరణించనీ
శృంగార సీమంతిని…
సరిప.. గమ గమని
సరిప.. పమ గపమ
నిసనిస.. సమగమ
చరణం: 1
నీ హృదయాన మ్రోగాలని రవళించు రాగాన్ని…
నీ గుడిలోన వెలగాలని తపియించు దీపాన్ని
నీ పాద కమలాల పారాణిని.. నీ ప్రయణ సన్నిద్ధి పూజారిని
సురలోక వాసిని.. సుమ హాసిని
చిరకాలం ఈ చెలిమి చిగురించి పూయని
శృంగార సీమంతిని.. ఆ.. నా జీవన మందాకిని..మ్మ్..
నీ కనుసన్న సైయ్యాటలో.. ఆ.. నను జీవించనీ.. మరణించనీ… ఆ..
శృంగార సీమంతిని…
పమగా.. మపగగమపగ సనిని…
మా.. మపదమపద మా గా గా
సనిని మాగగ
చరణం: 2
నీ రాయంచ గమనానికి పరిచాను పూదారిని
నువు రానున్న శుభవేళకై వేచాను ఒంటరిని
విన్నాను నీ కాలి సవ్వడిని
కన్నాను నీ కావి కనుదోయిని
కరుణాంతరంగిని… అనురాగిని
నీ అలుకే నా పాళి వరముగా పండనీ…
శృంగార సీమంతిని.. ఆ.. నా జీవన మందాకిని..మ్మ్..
నీ కనుసన్న సైయ్యాటలో.. ఆ.. నను జీవించనీ.. హహ.. మరణించనీ… ఆ..
శృంగార సీమంతిని…
ఆ.. అ…ఆ.. ఆ..హ.. ఆ.. హా.. ఆహ. హా..
****** ******* *******
చిత్రం: అభిమన్యుడు (1984)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, సుశీల
పల్లవి:
ఒకే గొడుగు.. ఒకే అడుగు.. ఒకే నడకగా
ఒకరికొకరుగా.. ఒకే ఒకరుగా
కలిసి పయనించే స్నేహము.. వలపు వర్షించే మేఘము
ఒకే గొడుగు.. ఒకే అడుగు.. ఒకే నడకగా
ఒకరికొకరుగా.. ఒకే ఒకరుగా
కలిసి పయనించే స్నేహము.. వలపు వర్షించే మేఘము
ఒకే గొడుగు.. ఒకే అడుగు.. ఒకే నడకగా
ఒకరికొకరుగా.. ఆ… ఆ.. ఆ.. ఒకే ఒకరుగా… ఆ… ఆ.. ఆ..
చరణం: 1
నీలి మబ్బు మెరిసి మెరిసి.. నీళ్ళ మనసు మురిసి మురిసి
ఎన్ని జలదరింపులో.. ఎన్నెన్ని పులకరింతలో
చినుకు చినుకు కలిసి కలిసి.. చెలిమి జల్లు కురిసి కురిసి
ఎన్ని వలపు వరదలో.. ఎన్నెన్ని కలల వాగులో
ఇది భూదేవికి సీమంతం.. అనురాగానికి వసంతం
ఇది భూదేవికి సీమంతం.. అనురాగానికి వసంతం
ఒకే గొడుగు.. ఒకే అడుగు.. ఒకే నడకగా
ఒకరికొకరుగా.. ఆ… ఆ.. ఆ.. ఒకే ఒకరుగా… ఆ… ఆ.. ఆ..
చరణం: 2
కన్నె తీగ తడిసి తడిసి.. వన్నె మొగ్గ తొడిగి తొడిగి
ఎన్ని పూలపొంగులో.. ఎన్నెన్ని రంగవల్లులో
ఇంద్రధనస్సు పందిరేసి.. రంగులేడు ముగ్గులేసి
ఎన్ని మధనపూజలో.. ఎన్నెన్ని మరులవిందులో
ఇది ఈ సృష్టికి ఆనందం… ఇది మన ఇద్దరి అనుబంధం
ఇది ఈ సృష్టికి ఆనందం… ఇది మన ఇద్దరి అనుబంధం
ఒకే గొడుగు.. ఒకే అడుగు.. ఒకే నడకగా
ఒకరికొకరుగా.. ఒకే ఒకరుగా
కలిసి పయనించే స్నేహము.. వలపు వర్షించే మేఘము
ఒకే గొడుగు.. ఒకే అడుగు.. ఒకే నడకగా
ఒకరికొకరుగా.. ఆ… ఆ.. ఆ.. ఒకే ఒకరుగా… ఆ… ఆ.. ఆ..
****** ******* *******
చిత్రం: అభిమన్యుడు (1984)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, సుశీల
పల్లవి:
సూర్యుడు చూస్తున్నాడు..చంద్రుడు వింటున్నాడు…
నీవు నమ్మని వాడు నిజము చెబుతున్నాడు..
సూర్యుడు చూస్తున్నాడు..చంద్రుడు వింటున్నాడు…
నీవు నమ్మని వాడు నిజము చెబుతున్నాడు..
వాడు నీ వాడూ…నేడు రేపు ఏనాడూ…
సూర్యుడు చూస్తున్నాడు..చంద్రుడు వింటున్నాడు…
నీవు నమ్మని వాడు నిజము చెబుతున్నాడు..
వాడు నీ వాడూ…నేడు రేపు ఏనాడూ…
చరణం: 1
నిన్ను ఎలా నమ్మను? ఎలా నమ్మించను..?
ఆ ఆ..ప్రేమకు పునాది నమ్మకము..
అది నదీ ..సాగర సంగమము…
ఆ ఆ.. కడలికి ఎన్నో నదుల బంధము
మనిషికి ఒకటే హృదయము…
అది వెలిగించని ప్రమిదలాంటిది…ఈ..ఈ..
వలచినప్పుడే వెలిగేది…
వెలిగిందా మరి? వలచావా మరి..
వెలిగిందా మరి? వలచావా మరి..
యెదలో ఏదో మెదిలింది..అది ప్రేమని నేడే తెలిసింది…
సూర్యుడు చూస్తున్నాడు..చంద్రుడు వింటున్నాడు…
సూర్యుడు చూస్తున్నాడు..చంద్రుడు వింటున్నాడు…
నీవు నమ్మని వాడు నిజము చెబుతున్నాడు..
వాడు నీ వాడూ…నేడు రేపు ఏనాడూ…
చరణం: 2
ఏయ్.. వింటున్నావా?..
ఊ.. ఏమని వినమంటావ్?
ఆ..ఆ.. మనసుకు భాషే లేదన్నావు..మరి ఎవరి మాటలని వినమంటావు?
ఆ..ఆ..మనసు మూగగా వినపడుతోంది?
అది విన్నవాళ్ళకే భాషవుతుంది …
అది పలికించని వీణ వంటిది…మీటి నప్పుడే పాటవుతుంది…
మిటేదెవరని…పాడేదేమని…
మిటేదెవరని…పాడేదేమని…
మాటా..మనసు ఒక్కటని..
అది మాయని చెరగని సత్యమని…
సూర్యుడు చూస్తున్నాడు..చంద్రుడు వింటున్నాడు…
నీవు నమ్మని వాడు నిజము చెబుతున్నాడు..
వాడు నా వాడూ…నేడు… రేపు… ఏనాడూ…