లాహే లాహే… లిరిక్స్
చిత్రం: ఆచార్య (2021)
సంగీతం: మణి శర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: హారిక నారాయణ్, సాహితి చాగంటి
నటీనటులు: చిరంజీవి, కాజల్ అగర్వాల్, రాంచరణ్, పూజా హెగ్డే
దర్శకత్వం: కొరటాల శివ
నిర్మాణం: రాంచరణ్, నిరంజన్ రెడ్డి
విడుదల తేది: 13.05.2021
Laahe Laahe Song Telugu Lyrics
లాహే లాహే లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే
కొండలరాజు బంగరు కొండ… కొండా జాతికి అండా దండా
మద్దే రాతిరి లేచి… మంగళ గౌరీ మల్లెలు కోసిందే
ఆటిని మాలలు కడతా… మంచు కొండల సామిని తలసిందే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే
మెళ్ళో మెలికల నాగుల దండ
వలపుల వేడికి ఎగిరి పడంగా
ఒంటి యిబూది జలజల రాలి పడంగా
సాంబడు కదిలిండే
అమ్మ పిలుపుకు సామి
అత్తరు సెగలై విల విల నలిగిండే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే
నరదిన దినదిన నాననా
నరదిన దినదిన నాననా
కొరకొర కొరువులు మండే కళ్ళు
జడలిరబోసిన సింపిరి కురులు
ఎర్రటి కోపాలెగసిన… కుంకంబొట్టు వెన్నెల కాసిందే
పెనిమిటి రాకను చూసి… సీమాతంగి సిగ్గులు పూసిందే
ఉబలాటంగా ముందటికురికి… అయ్యవతారం చూసిన కల్కి
ఎందా శంఖం సూళం భైరాగేసం ఏందని సణిగిందే
ఇంపుగ ఈ పూటైనా రాలేవా అని సనువుగ కసిరిందే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే
లోకాలేలే ఎంతోడైన… లోకువమడిసే సొంతింట్లోన
అమ్మోరు గడ్డంపట్టి బతిమాలినవి అడ్డాల నామాలు
ఆలుమొగల నడుమన అడ్డం రావులే ఎట్టాంటి నిమాలు, వాఁ
ఒకటో జామున కలిగిన విరహం
రెండో జాముకి ముదిరిన విరసం
సర్దుకుపోయే సరసం కుదిరే వేళకు
మూడో జామాయే
ఒద్దిక పెరిగే నాలుగో జాముకి
గుళ్లో గంటలు మొదలాయే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే
ప్రతి ఒక రోజిది జరిగే ఘట్టం
ఎడమొకమయ్యి ఏకం అవటం
అనాది అలవాటీళ్ళకి అలకలలోనే కిలకిలమనుకోటం
స్వయాన చెబుతున్నారు అనుబంధాలు
కడతేరే పాఠం
Acharya Movie All Songs Telugu Lyrics
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****
super song anna
super song
9640095859
super song
super
super lyirc
Geetha
Nice song
BALLE BALLE BANJARA SONG
super excited memory
Telugu st