చిత్రం: అడవి దొంగ (1985)
సంగీతం: చక్రవర్తి
సాహిత్యం: వేటూరి (All Songs)
నటీనటులు: చిరంజీవి , రాధ
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాణం: గోపి ఆర్ట్ పిక్చర్స్
విడుదల తేది: 19.11.1985
చిత్రం: అడవి దొంగ (1985)
సంగీతం: చక్రవర్తి
సాహిత్యం: వేటూరి (All Songs)
గానం: యస్.పి.బాలు, సుశీల
పల్లవి:
లలలలల్లాల లాలలల..
లలలలలలల లాలలల..
ఆ..ఆ..ఆ..ఆ..
వీరవిక్రమ ధీరదిగ్గజ నీకే స్వాగతాలు
వీరవిక్రమ ధీరదిగ్గజ నీకే స్వాగతాలు
వాలుచూపుల వన్నెలాడికి వయసే అంకితాలు
మహరాజులా మనసేలుకో
మహరాణిలా మనువాడుకో
చరణం: 1
లలలలల్లాల లాలలల.. లలల లలల లలల..
వచ్చే వసంతకాలం విచ్చే సుమాలగంధం
నీకై తపించి నిన్నే జపించే అందం…
కవ్వించు తేనె దీపం కౌగిళ్ళ ప్రేమ శీతం…
నేనై చలించి.. నిన్నే వరించే బంధం..
కొండ అరటిపండు ముద్దంట
నా కొండమల్లి నువ్వంట
రసాల నవరసాల
యమమసాల వేడిలో
లవ్ బాయ్ లా లాలించవా
కౌ బాయ్ లా కవ్వించనా…
వీరవిక్రమ ధీరదిగ్గజ నీకే స్వాగతాలు
వాలుచుపుల వన్నెలాడికి వయసే అంకితాలు
చరణం: 2
లలలలల్లాల లాలలల..
లల.. లల.. లల..
వాటేయ్యకుంటే పాపం వయ్యరమెంత శాపం
పూచేటి సోకు దాచేసుకోకు నేరం
వలపన్నది ఎంత వేగం వలవేసి పట్టే మొహం
తీరేది కాదు నురేళ్ల తీపి దాహం
నీ రూపు నాకు చుక్కంట
నా లేత బుగ్గకిమ్మంట
పెట్టించు లగ్గం ఎట్టించు
ముద్దు పుట్టించే వేళలో
జాంపండుల దొరికవులే
జేమ్స్ బండులా కలిశావులే
వీరవిక్రమ ధీరదిగ్గజ.. నీకే స్వాగతాలు
వాలుచూపుల వన్నెలాడికి.. వయసే అంకితాలు..
చరణం: 3
లలలల లలలల లలలల
లలలలలల్లాల లల్లాల
లలలలలల్లాల లల్లాల లలలల
కౌగిళ్ళు నీకు పంచి కసి ఈడు కాస్త పెంచే..
కవ్వింతలోనే ఒల్లంతా దోచిపోరా
మల్లెల్లో ఇల్లు కట్టి మసకల్లో కన్ను కొట్టీ
దీపల వేళ తాపలు తీర్చిపోవే
చిలకంటిదాన్ని నేనంట
అలకల్లో ఉంది సోకంతా
తందాన తన తందాన
జత తాళలే సాగనీ
హీరోలకే హీరోవిరా
హీమాన్ లా ప్రేమించనా
వీరవిక్రమ ధీరదిగ్గజ నీకే స్వాగతాలు
వాలుచూపుల వన్నెలాడికి వయసే అంకితాలు
మహరాజులా మనసేలుకో
మహరాణిలా మనువాడుకో
చిత్రం: అడవి దొంగ (1985)
సంగీతం: చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, జానకి
పల్లవి:
అ ఆ ఆ.. వానా వానా వందనం
ఆ ఆ ఆ.. వయసా వయసా వందనం
నీవే ముద్దుకు మూలధనం
పడుచు గుండెలో గుప్తధనం
ఇద్దరి వలపుల ఇంధనం
ఎంత కురిసినా కాదనం
ఏమి తడిసినా… వద్దనం ఈ దినం
లల్లల్ల..లాలా.. లాలా..
అ ఆ ఆ.. వాన వాన వందనం
ఆ ఆ ఆ.. వయసా వయసా వందనం
చరణం: 1
చలి పెంచే నీ చక్కదనం కౌగిట దూరే గాలి గుణం
గాలి వానల కలిసి రేగుతూ కమ్ముకుపోతే యవ్వనం
చినుకు చినుకులో చల్లదనం చిచ్చులు రేపే చిలిపితనం
వద్దంటూనే వద్దకు చేరే ఒళ్లో ఉందీ పడుచుతనం
మెరుపులు నీలో చూస్తుంటే
ఉరుములు నీలో పుడుతుంటే
వాటేసుకొని తీర్చుకో
వానదేవుడి వలపు ఋణం
వాన దేవుడి వలపు ఋణం
అ ఆ ఆ.. వానా వానా వందనం
ఆ ఆ ఆ.. వయసా వయసా వందనం
చరణం: 2
కసిగ ఉన్న కన్నెతనం కలబడుతున్న కమ్మదనం
చెప్పలేక నీ గుండె వేడిలో హద్దుకుపోయిన ఆడతనం
ముద్దుకు దొరికే తియ్యదనం ముచ్చట జరిగే చాటుతనం
కోరి కోరి నీ పైట నీడలో నిద్దుర లేచిన కోడెతనం
చినుకులు చిటపట మంటుంటే
చెమటలు చందనమౌతుంటే
చలి చలి పూజలు చేసుకో
శ్రావణమాసం శోభనం
శ్రావణమాసం శోభనం
అ ఆ ఆ వానా వానా వందనం
ఆ ఆ ఆ వయసా వయసా వందనం
నీవే ముద్దుకి మూలధనం
పడుచు గుండెలో గుప్తధనం
ఇద్దరి వలపుల ఇంధనం
ఎంత కురిసినా కాదనం…
ఏమి తడిసినా… వద్దనం ఈ దినం
లల్లల్ల..లాలా.. లాలా..
అ ఆ ఆ వానా వానా వందనం
ఆ ఆ ఆ వయసా వయసా వందనం