చిత్రం: అడవిరాముడు (1977)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్. జానకి, పి. సుశీల, యస్. పి. బాలు
నటీనటులు: యన్.టి.ఆర్, జయప్రద, జయసుధ
దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు
నిర్మాతలు: సత్యనారాయణ, సూర్యనారాయణ
విడుదల తేది: 28.04.1977
ఆరేసుకోబోయి పారేసుకున్నాను
అరె అరె అరె అరె
కోకెత్తుకెళ్ళింది కొండగాలీ…
నువ్వు కొంటె చూపు చూస్తేనే.!
చలి చలి చలి చలి హాఁ చలి చలి
పారేసుకోవాలనారేసుకున్నావు
అరె అరె అరెరె అరెరె
నీ ఎత్తు తెలిపింది కొండగాలీ…
నాకు ఉడుకెత్తిపోతుంది
హరి హరి హరి హరి హరి హరి
ఆరేసుకోబోయి పారేసుకున్నాను
అరె అరె అరె అరె
నా లోని అందాలు నీ కన్నులా
ఆరేసుకోనీ సందేవెళ
ఓ నాపాట ఈపూట నీ పైటలా
దాచేసుకోనీ తొలి పొంగులా
ఆ నా లోని అందాలు నీ కన్నులా
ఆరేసుకోనీ సందేవెళ
హే నాపాట ఈపూట నీ పైటలా
దాచేసుకోనీ తొలి పొంగులా
నీ చూపు సోకాలి
నా ఊపిరాడాలి
ఆ నీ చూపు సోకాలి
నా ఊపిరాడాలి
నీ జంట నా తీపి చలిమంటకావాలీ…
నీ వింత కవ్వింతకే కాగిపోవాలీ…
నీ కౌగిలింతలోనే దాగి పోవాలీ…
ఆరేసుకోబోయి పారేసుకున్నాను
అరె… హా… అరె… హా… అరె… హా… అరె… హా
కోకెత్తుకెళ్ళింది కొండగాలీ…
నాకు ఉడుకెత్తిపోతుందీ హరి హరి హరి హరి
హే… హరి హరి
నీ ఒంపులో సొంపులే హరివిల్లు
నీ చూపులో రాపులే విరిజల్లు
ఆ… నీ రూపు నా వలపు ఏరువాక
నిను తాక నీలిమబ్బు నా కోక
నే వేగి పోవాలి
నేనూగిపోవాలి
నే వేగి పోవాలి
నేనూగిపోవాలి
చెలరేగి ఊహల్లో ఊరేగి రావాలీ…
ఈ జోడు పులకింతలే నా పాట కావాలీ…
ఆ పాట పూబాటగా నిను చేరుకోవాలీ…
ఆరేసుకోబోయి పారేసుకున్నాను
అరె… హా… అరె… హా… అరె… హా… అరె… హా
కోకెత్తుకెళ్ళింది కొండగాలీ…
నువ్వు కొంటె చూపు చూస్తేనే చలి చలి
హా చలి చలి హా చలి చలి
పారేసుకోవాలనారేసుకున్నావు
అరె ఆఁ అరె ఆఁ అరె ఆఁ అరె ఆఁ
నీ ఎత్తు తెలిపింది కొండగాలీ…
నాకు ఉడుకెత్తిపోతుంది
హరి హరి హరి హరి హరి హరి
లాలా లాలా లాలా లాలా లల ల
లల ల… లల ల… లల ల
******** ******** **********
చిత్రం: అడవిరాముడు (1977)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: పి. సుశీల, యస్. పి. బాలు
కుకు కుకు… కుకు కుకు…
కోకిలమ్మ పెళ్ళికి కోనంతా పందిరీ
చిగురాకులు తోరణాలు చిరుగాలి సన్నాయి…
డుడుం డుడుం… డుడుం డుడుం
వసంతుడే పెళ్ళికొడుకు వనమంతా సందడీ…
పూలన్నీ తలంబ్రాలు పున్నమీ తొలిరేయి
తుళ్ళి తుళ్ళి నిన్న మొన్న తూనిగల్లే ఎగిరిన పిల్లదాని కొచ్చిందీ కళా పెళ్ళి కళా…
తలపులన్నీ వలపులైన చూపులు విరి తోపులైన పెళ్ళికొడుకు నవ్వితే కళా…తళ తళా…
పూలగాలితో రేగిన పుప్పొడి పారాణిగా…
చిలక పాట నెమలి ఆట కలిసి మేజువాణిగా
పూలగాలితో రేగిన పుప్పొడి పారాణిగా…
చిలక పాట నెమలి ఆట కలిసి మేజువాణిగా
అందమైన పెళ్ళికి అందరు పేరంటాలే…
అడవిలోని వాగులన్నీ ఆనందపు కెరటాలే
కుకు కుకు… కుకు కుకు…
కోకిలమ్మ పెళ్ళికి కోనంతా పందిరీ
చిగురాకులు తోరణాలు చిరుగాలి సన్నాయి…
కన్ను కన్ను కలుపుకున్న కన్నె మనసు తెలుసుకున్న కనుల నీలి నీడలే కథా… ప్రేమ కథా…
బుగ్గలలో నిగ్గుదీసి సిగ్గులలో చిలకరించి మొగ్గ వలపు విచ్చితే కథా… పెళ్ళి కథా…
ఇరుమనసులకొక తనువై ఇరు తనువులకొక మనువై
మనసులోని వలపులన్నీ మల్లెల విరి పానుపులై
ఇరుమనసులకొక తనువై ఇరు తనువులకొక మనువై
మనసులోని వలపులన్నీ మల్లెల విరి పానుపులై
కలిసి వున్న నూరేళ్ళు కలలుగన్న వెయ్యేళ్ళు
మూడు ముళ్ళు పడిన నాడు ఎదలు పూల పొదరిళ్ళు
కుకు కుకు… కుకు కుకు…
కోకిలమ్మ పెళ్ళికి కోనంతా పందిరీ
చిగురాకులు తోరణాలు చిరుగాలి సన్నాయి…
డుడుం డుడుం… డుడుం డుడుం
వసంతుడే పెళ్ళికొడుకు వనమంతా సందడీ…
పూలన్నీ తలంబ్రాలు పున్నమీ తొలిరేయి
కుకు కుకు… కుకు కుకు…
డుడుం డుడుం… డుడుం డుడుం
********** ********** **********
చిత్రం: అడవి రాముడు (1977)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల
పల్లవి:
మనిషై పుట్టినవాడు కారాదు మట్టిబొమ్మా…
పట్టుదలే వుంటే కాగలడు మరో బ్రహ్మ..
కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు..
మహాపురుషులౌతారు…
తరతరాలకి తరగని వెలుగౌతారు..
ఇలవేలుపులౌతారు…
చరణం: 1
అడుగో అతడే వాల్మీకీ.. బ్రతకు వేట అతనికి..
అతిభయంకరుడు యమకింకరుడు.. అడవి జంతువుల పాలిటి..
అడుగో అతడే వాల్మీకీ
పాల పిట్టల జంట వలపు తేనెల పంట పండించుకొని పరవశించి పోయేవేళా..
ఆ పక్షుల జంటకు గురిపెట్టాడు..
ఒక పక్షిని నేల కూల్చాడు..
జంట బాసిన పక్షి కంటపొంగిన గంగ తన కంటిలో పొంగ…
మనసు కరగంగ…
ఆ శోకంలో ఒక శ్లోకం పలికే..
ఆ చీకటి ఎదలో దీపం వెలిగే…
కరకు బోయడే అంతరించగా.. కవిగా ఆతడు అవతరించగా…
మనిషి అతనిలో మేల్కొన్నాడు.. కడకు మహర్షే అయినాడు..
నవరసభరితం రాముని చరితం.. జగతికి ఆతడు పంచిన అమృతం
ఆ వాల్మీకి మీవాడూ… మీలోనే వున్నాడు…
అక్షరమై మీ మనసు వెలిగితే… మీలోనే వుంటాడు..
అందుకే…. కృషి…
చరణం: 2
ఏకలవ్యుడంటేనే ఎదురులేని బాణం..
తిరుగులేని దీక్షకు అతడే ప్రాణం..
కులం తక్కువని విద్య నేర్పని గురువు బొమ్మగా మిగిలాడు..
బొమ్మ గురుతుగా చేసుకొని బాణవిద్యలో పెరిగాడు
హుటాహుటిని ద్రోణుడపుడు తటాలుమని తరలి వచ్చి పక్షపాత బుద్దితో దక్షిణ ఇమ్మన్నాడు..
ఎదుట నిలిచిన గురుని పదమంటి…
ఏమివ్వ గలవాడననే ఏకలవ్యుడు..
బొటనవేలిమ్మని కపటి ఆ ద్రోణుడు..
వల్లెయని శిష్యుడు… చెల్లె ద్రోణుని ముడుపు..
ఎరుకలవాడు అయితేనేమి గురికలవాడే మొనగాడు..
వేలునిచ్చి తన విల్లును విడిచి ఇలవేలుపుగా ఇల వెలిగాడు..
అందుకే…. కృషి…
చరణం: 3
శబరి…
ఇంతకాలము వేచినది ఈ పిలుపుకే శబరి..
ఆశ పరుగిడి అడుగు తడబడి రామ పాదము కన్నది…
వంగిపోయిన నడుముతో నగుమోము చూడగలేక అపుడు..
కనుల నీరిడీ… ఆ రామ పాదము కడిగినది శబరి…
పదముల ఒరిగినది శబరి
ప్రేమ మీరగ రాముడప్పుడు శబరి తల్లి కనులు తుడిచి..
కోరి కోరి శబరి కొరికిన దోర పండ్లను ఆరగించే..
ఆమె ఎంగిలి గంగ కన్న మిన్నగా భావించిన రఘురాముండెంతటి ధన్యుడో…
ఆ శబరి దెంతటి పుణ్యమో..
ఆమె ఎవ్వరో కాదు సుమా.. ఆడపడుచు మీ జాతికి…
జాతిరత్నములు ఎందరెందరో మీలో కలరీనాటికి…
అడవిని పుట్టి పెరిగిన కథలే అఖిల భారతికి హారతులు..
నాగరికతలో సాగు చరితలో మీరే మాకు సారథులూ…
********* ********* *********
చిత్రం: అడవి రాముడు (1977)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, యస్.జానకి
పల్లవి:
అమ్మతోడు…అబ్బతోడు..నా తోడు…నీ తోడు
అన్నిటికి నువ్వే నా తోడు…ఇంకెన్నటికి నేనే నీ తోడు
అమ్మతోడు…అబ్బతోడు..నా తోడు…నీ తోడు
అన్నిటికి నువ్వే నా తోడు…ఇంకెన్నటికి నేనే నీ తోడు
చరణం: 1
ఆకలన్నదే లేదు.. హర హరా..రామ రామా
అన్నమే రుచికాదు …శివ శివా..కృష్ణ కృష్ణా..
ఆకలన్నదే లేదు.. హర హరా…
అన్నమే రుచికాదు… శివ శివా…
వెన్నెలలొస్తె వేడిరా నా దొరా… ఆ వేడిలోనే చలేసింది రా
ఆకలన్నదే నీకు లేకపోతే… ఈ కేకలెందుకే రాకపోకలెందుకే
ఒట్టిమాటలింక నీవు కట్టిపెట్టు… నీ ఒట్టు తీసి గట్టుమీద అట్టిపెట్టు
అమ్మతోడు…అబ్బతోడు..నా తోడు…నీ తోడు
అన్నిటికి నువ్వే నా తోడు… ఇంకెన్నటికి నేనే నీ తోడు
చరణం: 2
కళ్ళు కాయలు కాచే హర హరా…. ఈశ్వరా
నిన్ను చూడకమాకు శివ శివా…. శ్రీహర
కళ్ళు కాయలు కాచే … హర హరా
నిన్ను చూడకమాకు … శివ శివా
పొద్దె గడవదు మాకు ఓ దొరా…నిద్దరన్నదే లేదు రా
నిద్దరన్నదే నీకు లేకపోతే… ఈ పిలుపులెందుకే .. ఆ కులుకులెందుకే
గుట్టు బయట పెట్టకుంటే … పెద్ద ఒట్టు
గట్టు మీద చిలక వింటే గుట్టు రట్టు…
అమ్మతోడు… అబ్బతోడు..నా తోడు…నీ తోడు
అన్నిటికి నువ్వే నా తోడు…ఇంకెన్నటికి నేనే నీ తోడు
చరణం: 3
ఆ శివుడే వరమిచ్చాడే …అదిరిపడకే ఆడవి జింకా
అంబ పలికే జగదంబ పలికెనే… ఆశవదులుకో నీవింకా
ఆహాఁ భోలా శంకరుడయినా నిన్ను బొల్తాకొట్టించాడమ్మా
చిత్తైపోయావమ్మో… ఓ సిగ్గులదొరసానమ్మా
తెల్లారే తల్లో పూలు పెట్టుకురమ్మన్నాడు
తేల్లారకనే తలస్నానం చేసి రమ్మన్నాడు
చిటికెడు విబూది ఇచ్చాడు..
పిడికెడు నాకు ఇచ్చాడు..
అమ్మతోడు అందాల రాముడు… నా వాడన్నాడు
నా అన్నవాడు అడవి రాముడు …నా తోడన్నాడు
అందుకే వాడు నా వాడు…
కాడు కాడు …కాలేడు….
అబ్బ.. అమ్మా…
అమ్మ తోడు అబ్బ తోడు నా తోడు నీ తోడు
అన్నిటికి మీరే నా తోడు… ఇంకెన్నటికి నేనే మీ తోడు
అమ్మ తోడు అబ్బ తోడు నా తోడు నీ తోడు
అన్నిటికి మీరే నా తోడు… ఇంకెన్నటికి నేనే మీ తోడు
ఇంతటితో ఆపండి… మీగోడు