చిత్రం: అదృష్టం (2002)
సంగీతం: దిన
సాహిత్యం: సాహితి
గానం: సుజాత, ఉన్ని కృష్ణన్
నటీనటులు: తరుణ్ కుమార్, గజాల, రీమాసేన్
దర్శకత్వం: శేఖర్ సూరి
నిర్మాతలు: మాన్సూర్ అహ్మద్, పరాస్ జైన్, వాకాడ అప్పారావు
విడుదల తేది: 06.06.2002
పల్లవి:
వయసా వయసా నిను నే మరిచా
మనసే తెరచి ఇపుడే చూశా
మొదటిసారిగా కలిశా
అతని ధ్యాసలో తడిశా
తెలియకున్నదే వయసా
ప్రేమకాదు కద బహుశా
వయసా వయసా నిను నే మరిచా
మనసే తెరచి ఇపుడే చూశా
చరణం: 1
ఆకతాయి చెలి నవ్వుల మహిమలు వారెవా
తాడులేని గాలమేసి మనసును లాగవా
ఎంతహాయి మరి వెతికిన దొరకదు ఓ ప్రియా
ఓపలేని తీపి బాధ బహుమతి లేవయా
ఆశలు తీరాలి కలలే నిజమవ్వాలి
జాబిలి పంపాలి నడిజాబులునవ్వాలి
ఇదివరకింతలేదులే వయసుకి తొందర
ఈనాడే నే వింటున్నా మది చేసే గోడవ
వయసా వయసా నిను నే మరిచా
మనసే తెరచి ఇపుడే చూశా
చరణం: 2
రాక రాక వనికిన పెదవుల గతి చూడవా
మౌనరాగ మాలకించి ఎదగుడి చేరవా
ఈడులోన ప్రతి నిమిషము తికమకలే కదా
ఆడగాలి తాకినంత బడలిక తీరదా
నా జత చేరాలి ఒకటై చలరేగాలి
ఓపిక కావాలి సుముహూర్తము రావాలి
కుదురగ ఉండలేనయ ఉంటా నీ దయా
ఈనాడే నే చూస్తున్నా కనులారా నీ చొరవ
వయసా వయసా నిను నే మరిచా
మనసే తెరచి ఇపుడే చూశా
మొదటిసారిగా కలిశా
అమె ధ్యాసలో తడిశా
తెలియకున్నదే వయసా
ప్రేమకాదు కద బహుశా
వయసా వయసా నిను నే మరిచా
ఇపుడే చూశా… ఇపుడే చూశా…