Adugu Jaadalu (1966)

చిత్రం: అడుగు జాడలు (1966)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: ఘంటసాల , బి.వసంత
నటీనటులు: యన్.టి.రామరావు, జమున
దర్శకత్వం: తాపీ చాణక్య
నిర్మాతలు: ఎమ్.సాంబశివరావు, జి. వందనం
విడుదల తేది: 29.09.1966

మల్లెలు కురిసిన చల్లని వేళలో
మనసే పలికెను నేడేలనో… ఎలానో
మల్లెలు కురిసిన చల్లని వేళలో
మనసే పలికెను నేడేలనో… ఎలానో
మల్లెలు కురిసిన చల్లని వేళలో
మనసే పలికెను నేడేలనో… ఎలానో

చరణం: 1
చలిచలి గాలులు చిలిపిగ వీచే….జిలిబిలి తలపులు చిగురులు వేసే
తొలకరి వయసే తొందర చేసే
యవ్వనమేమో సవ్వడి చేసే….యవ్వనమేమో సవ్వడి చేసే….
సవ్వడి చేసే

మల్లెలు కురిసిన చల్లని వేళలో
మనసే పలికెను నేడేలనో… ఎలానో

చరణం: 2
పిలువని కనులే పిలిచెను నన్నే…పలుకని జాబిలి వలచెను నన్నే …
అందాలేవో అలలై ఆడే… అందని కౌగిళి అందెను నేడే..
అందని కౌగిళి అందెను నేడే .. అందెను నేడే !

మల్లెలు కురిసిన చల్లని వేళలో
మనసే పలికెను నేడేలనో… ఎలానో

చరణం: 3
సొగసులు విరిసే వెన్నెలలోన
ఎగిసే ఊహల పల్లకి పైన
నీవే నేనై పయనించేమా
నేనే నీవై పయనించేమా
జీవన రాగం పలికించేమా….జీవన రాగం పలికించేమా….
పలికించేమా

మల్లెలు కురిసిన చల్లని వేళలో
మనసే పలికెను నేడేలనో… ఎలానో
అహ…హ…అహ..హా…అహ…హ…అహ…హా…

error: Content is protected !!