చిత్రం: అగ్గిపిడుగు (1964)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: సినారె
గానం: ఎస్.జానకి
నటీనటులు: యన్.టి.రామారావు, కృష్ణకుమారి
నిర్మాత, దర్శకత్వం: బి. విఠలాచార్య
విడుదల తేది: 31.7.1964
తప్పంటావా నా తప్పంటావా
తెలియని ప్రేమకు పలుకులు నేర్పిన
తెలిసిపోయే పో పొమ్మంటావా
కొలనులోన నీవుంటివి
కొన కొమ్మమీద నేనుంటిని
మిసిమి వలపు నీదంటిని
నువు బుసలుకొడుతు నిలుచుంటివి
నిన్నే కోరెను వన్నెల రోజా
సిగ్గెందుకోయ్ నా చిన్నారి రాజా
తప్పంటావా నా తప్పంటావా
పొదలు దాగుకొనుటెందుకు
కదలి కదలి రా ముందుకు
ఒడలు ఆరిపోనీయకు
ఈ గడియ జారిపోనియకు
ఎవ్వరు లేని ఈ చలివేళ
సింగారింతు నిను బంగారు రాజా