Agni (1989)

చిత్రం: అగ్ని (1989)
సంగీతం: హంసలేఖ
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు
నటీనటులు: నాగార్జున, శాంతి ప్రియ
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: కె.యస్.ప్రకాష్ రావు
విడుదల తేది: 09.08.1989

అందాల కోట లోన టింగు రంగ రంగసాని
రంగు పొంగు హంగు చూడరొ
ఓయబ్బ లిప్పు కేకు కొరకరో
శ్రుంగార పెటలోన లింగు లిటుకు దొగసాని
కంగు తిన్న కథలు చూడరో
ఓయబ్బ లాలిపప్పలడగరో
మందార గందమిచ్చి మంచమేసి పంచిపెట్టు నీ ఊపులే
సందేల ఈల వేసి గోల చేసి పంచనివ్వు నీ షేపులే
జనకుజ్ అనకు లబకు జబకు తకిట తదిమి దరువు మనదిలే

అందాల కోట లోన టింగు రంగ రంగసాని
రంగు పొంగు హంగు చూడరొ
ఓయబ్బ లిప్పు కేకు కొరకరో

గుట్టూ రట్టూ గుమ్మ లేడికీ కిలాడీకీ
చలకి చంపమీద ముద్దు గుద్ది ముట్టడించి పోదునా
ఓట్టు పొడుగు కోమలానిగికీ లవాంగికీ
బడాయి బుంగమూతి బెంగ తీర్చి యెంగిలెట్టి కొట్టనా
పిడికిలడిగినా పిడక నడుములో
జమలహాటు జముకు మీటనా
అదుపుతొలిగినా కుదుపు నడకలే
డబురు మీటు గుబులు పెంచనా
మండపేట తోపు కాడ మాపటెల ఊపు వచ్చి
మంచమీద దుప్పటేసి మల్లెమొగ్గ దీపమెట్టి
మజాల పట్టు నిన్ను పట్టనా

అందాల కోట లోన టింగు రంగ రంగసాని
రంగు పొంగు హంగు చూడరొ
ఓయబ్బ లిప్పు కేకు కొరకరో

టింగు టింగు చెంగు సానికీ బటానికీ
బజారు సందులోన విందు చేసి వీదికెక్కి పోదునా
వంగి వంగి వన్నె లాడికీ వయ్యరికీ
హమ్మము సోపు వేసి స్నోను వేసి పాపు ట్యూను పాదనా
పదుచు పలుకులా పదక రానికి
త్రిబులు కాటు ట్రబులు ఇవ్వనా
ఒడుకు తెలిసినా వలపు వేనికి
తమలపాకు తడిపి ఇవ్వనా
పూల పల్లి సంత డాటి పాల కొల్లు చేరినాక
చల్లకొచ్చి ముంత దాచి చక్కిలాలు చేతికిస్తె
షిఫాను చీర కట్టు జారులె

అందాల కోట లోన టింగు రంగ రంగసాని
రంగు పొంగు హంగు చూడరొ
ఓయబ్బ లిప్పు కేకు కొరకరో
శ్రుంగార పెటలోన లింగు లిటుకు దొగసాని
కంగు తిన్న కథలు చూడరో
ఓయబ్బ లాలిపప్పలడగరో
మందార గందమిచ్చి మంచమేసి పంచిపెట్టు నీ ఊపులే
సందేల ఈల వేసి గోల చేసి పంచనివ్వు నీ షేపులే
జనకు జనకు లబకు జబకు తకిట తదిమి దరువు మనదిలే

*******  *******  ******

చిత్రం: అగ్ని (1989)
సంగీతం: హంసలేఖ
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

జాబిల్లి ఎండల్లొ సరసాలో సరదాలో కసిగా కథల మొదలాయే
ఈ పూల దండల్లొ గమకాలో చమకాలో తొలిగా చలిగా కథలాయే
తనువుల కదలిక నడుముల కలయిక యేమి తాలమో
అది నను అడగక బిగువునవదలక యెంత తాపమో

జాబిల్లి ఎండల్లొ సరసాలో సరదాలో కసిగా కథల మొదలాయే
ఈ పూల దండల్లొ గమకాలో చమకాలో తొలిగా చలిగా కథలాయే

చిన్నప్పుడు ఈడున్నప్పుడు వేడున్నప్పుడు రేగెచప్పుడు
యెక్కడికక్కడ యెక్కిడి తొక్కిడి
సోకుల సిక్కడి ముద్దుల ముట్టడి
సాగినప్పుడు తొనదరే పుట్టినప్పుడూ
ఈ గుప్పెడు నా గుట్టిప్పుడు
విడగొట్టిప్పుడు జతకట్టిప్పుడు
చక్కెర చెక్కిలి చెక్కిన యెంగిలి
అంటిన కౌగిలి అత్తిటి లోగిలి చేరినప్పుడు సిగ్గులు జారినప్పుడు
గాజుల మల్లెల మోజుల వెల్లువ రోజుక వెన్నెల చిలికిన వలపుల
అలికిడికి తడిచిన తనువుల సందెల చిందిన
చందన కుంకుమ వందనమన్నది ఇందనమైనది
ఇద్దరి మోహన లాహిరిలో

జాబిల్లి ఎండల్లొ సరసాలో సరదాలో కసిగా కథల మొదలాయే
ఈ పూల దండల్లొ గమకాలో చమకాలో తొలిగా చలిగా కథలాయే

మాటిచ్చుకో యెద చోటిచ్చుకో
పొద మాటిచ్చుకో పెదవే పుచ్చుకో
అత్తరు మల్లెల మత్తులలో పడి
ఒంటరి జీవుడు హత్తుకు పోయిన రాసలీలలో
ఇప్పుడె బాస చేసుకో
పువ్వందుకో చిర్నవ్వందుకో జత నువ్వెందుకో నీకు లవ్వెందుకో
మెత్తని కాముడి జిత్తులలో పడి
ఒత్తుకు పోయెడి ఒంపులలో సుడి తాకి చూడనా
చూడనీ తలుకు చూడనా
చుక్కల పందిట చిక్కనిసందిట
చెక్కిలి గిచ్చుట తెలిసిన వయసుల
మధన ముడి బిగసిన మనసుల
సందడి ఊహల సందుల దూరిన
పొందుల వేలకు విందులు కోరిన తేనెల వానల తాకిడిలో

జాబిల్లి ఎండల్లొ సరసాలో సరదాలో కసిగా కథల మొదలాయే
ఈ పూల దండల్లొ గమకాలో చమకాలో తొలిగా చలిగా కథలాయే
తనువుల కదలిక నడుముల కలయిక యేమి తాలమో
అది నను అడగక బిగువునవదలక యెంత తాపమో

జాబిల్లి ఎండల్లొ సరసాలో సరదాలో కసిగా కథల మొదలాయే
ఈ పూల దండల్లొ గమకాలో చమకాలో తొలిగా చలిగా కథలాయే

*******  *******  ******

చిత్రం: అగ్ని (1989)
సంగీతం: హంసలేఖ
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

ప్రేమ నగరు ప్రేయసికి టాట చెప్పేశా
కామ నగరు కౌగిలిలో వాట కొట్టెశా
ప్రేమ లేని లోకంలో దేవదాసునీ
తాగి ఉన్న మైకంలొ కామదాసునీ
ఊహలలోన ఊర్వసి నీవే ప్రేయసి నీవే రావమ్మో

ప్రేమనగరు ప్రేమికుడా నీకే ఓటేసా
కామనగరు వాకిలిలో కాకపట్టెసా

సుందరానిగివే యమ యమ అందగత్తవే
సందుగుందుల పొడిచిన చందమామవే
మాయలేడి లా కనపడి మనసు దోచనే
వెర్రిపుట్టినా మదనా వేనువూదకా
పిచ్చి ఈలతో వసును రెచ్చగొట్టకా
పైట లాగితే పెదవికి ముద్దు వస్తదీ
నీస రసం ప్రేమ రసం గుండెకెక్కిందీ
నీ పరువం పడుచుదనం నాకునచ్చిందీ
పార్వతులైనా స్రీమతులైనా యేమతులైనా బలాదూర్

ప్రేమనగరు ప్రేమికుడా నీకే ఓటేసా
కామనగరు వాకిలిలో కాకపట్టెసా

మోజు పడితిని శివ శివ మోసపోతినీ
మొగుడి కోసమే వెతుకుతుంటినీ
మోడలింగు టీములో మొదటి ఫిగరునీ
సంద్య వేలకీ సలసల సోకులివ్వవే
మందువేలకీ చిమచిమ చీకులివ్వవే
మొదటి చూపు విసురికే మొగుడునతినే
నీ వలపూ నీ ఒడుపు నాకు నచ్చిందీ
నీ వరస నీ దరువు నాకు వచ్చిందీ
ప్రేమికుడినా యేనటుడైనా చీకటి లోనె బలదూర్

ప్రేమ నగరు ప్రేయసికి టాట చెప్పేశా
కామ నగరు కౌగిలిలో వాట కొట్టెశా
ప్రేమ లేని లోకంలో దేవదాసువీ
తాగి ఉన్న మైకంలొ కామదాసువీ
ఊహలలోన ఊర్వసి నేనె ప్రేయసి నేనె రావయ్యో

ప్రేమ నగరు ప్రేయసికి టాట చెప్పేశా
కామ నగరు కౌగిలిలో వాట కొట్టెశా

Previous
Tarak (2003)
error: Content is protected !!