Agni Putrudu (1987)

చిత్రం: అగ్ని పుత్రుడు (1987)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి (All)
గానం: యస్.పి.బాలు, పి.సుశీల
నటీనటులు: నాగార్జున, నాగేశ్వరరావు, శివాజీ గణేషన్, శారద, రజిని
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: అక్కినేని వెంకట్
విడుదల తేది: 14.08.1987

చీరలు విడచిన వనితల్లరా
గౌనులు తొడిగిన చిలకల్లరా
అడిగే ప్రస్నకు బదులిస్తే
వందకు వందా వెసేస్తా
అడిగే ప్రస్నకు బదులిస్తా
వందకు వందా కొట్టెస్తా

యెన్ని రకాలో కాలాలు అవి ఏమిటేమిటో చెప్పండీ
ఆ అ ఆ ఆ
గజ గజ లాడే చలి కాలం
చిటపట చినుకుల వానకాలం
కుత కుత లాడే ఎండా కాలం
చలికాలంలో సాయంత్రం
శ్రుంగారానికి తొలి మంత్రం
నొ నొ నొ
భూత భవిష్యత్ వర్తమానం
మూడె మూడు కాలాలు
నిన్న మొన్నలు రేపు మాపులూ నేడు వాటికి రూపాలు

excuse me sir
what do you want
water sir
yes..you can go
excuse me sir
yes
ఏమిటా వేలాకోలాలు class room లో
comman గోడ కుర్చి వెయ్యి

ఎన్ని రకాలో రసాలు అవి ఏమిటేమిటో చెప్పండి
య య య య
నూజివీడుదీ చిన్న రసం
విజయవడది పెద్ద రసం
అదరామ్రుతమే అసలు రసం
ఆ జోడు రసాలే జోడంటా
ఈ మూడో రసమే ముద్దంటా
you silly girl
శ్రుంగార వీర సోకశంతావి
రసాలు తొమ్మిది వినలేదా
వొల్లు దగ్గర పెట్టుకోనిచో
చెల్లు మంటదీ నా బెత్తం

sir sir
what is it now
copy కొడుతుంది sir
హా ఎవరది ఎక్కడ
హరి హరి
excuse me sir
మల్లి ఏమొచ్చింది నీకు
పెట్టండి sir

అలంకారాలు యెన్ని రకాలో చప్పుడు చేయక చెప్పండి
ఆ అ ఆ ఆ
బిర్రు pantu లు bikini లు
బిగి pocket లో lokcet లు
sleave less లు సీత్రు లు
అలకారాలు మీ కోసం
అందాలన్ని మీ సొంతం
oh my god
బాషలో అలంకారాలు
భారతీ స్వర్న హారాలు
ఉత్ప్రేక్షలో ఉఒమానంలో
మీరే కోటి రూపాలు

*******   *******   ********

చిత్రం: అగ్ని పుత్రుడు (1987)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, జానకి

కమలం కమలం కన్నులలో
మధురం మధురం పెదవులలో
కమలం కమలం కన్నులలో
మధురం మధురం పెదవులలో
హ్రుదయం హ్రుదయం తాలంలో
కుసుమం భ్రమరం రాగంలో
లయలె ప్రియమై శ్రుతులె సుఖమై సాగే అనురాగం

కమలం కమలం కన్నులలో
మధురం మధురం పెదవులలో

చిలకలు పలికే నవ్వులలో
చిలిపిగ ఓ సరిగమా
అలకలు చిలికే బుగ్గలలో
పడుచుగ ఓ పదనిసా
తగిలిన చోట తకదిమిగా
తడబడి పొయే పదములుగా
మెలికలు తెరిగే సోయగాలలో
మెరుపు తీగలే కదలాడాల
జతలే కలిసే జతలో శ్రుతిలో సాగే సంగీతం

కమలం కమలం కన్నులలో
మధురం మధురం పెదవులలో

ముందుగ కొసరే ముద్దులలో
తెలియని ఓ స్వర సుదా
అందం కరిగే ఆవిరిలో
మత్తుగ ఓ గుస గుసా
గిచ్చిన చోట కీర్తనలూ
కిక్కురు మననీ యాతనలూ
తపనలు తెంచే తందనాలలో
పులకరింతలే పురి వీడ
యదలో తమకం వొడిలో గమకం సాగే సాయంత్రం

కమలం కమలం కన్నులలో
మధురం మధురం పెదవులలో
హ్రుదయం హ్రుదతం తాలంలో
కుసుమం భ్రమరం రాగంలో
లయలె ప్రెయమై శ్రుతులె సుఖమై సాగే అనురాగం
కమలం కమలం కన్నులలో
మధురం మధురం పెదవులలో

*******   *******   ********

చిత్రం: అగ్ని పుత్రుడు (1987)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, సుశీల

పెట్టు పెట్టు పెట్టు పెట్టు ముద్దూ
ముద్దుకో ముద్దెట్టు
కట్టుకో నా జట్టు
ముద్దుకో ముద్దెట్టు
కట్టుకో నా జట్టు
ఒక పట్టు పడతాను ఒడిచేరుకో
కౌగిట్లొ నా మీద కసి తీర్చుకో
డీ డిక్కుం డీ డిక్కుం డీ డీ డీ
డీ డిక్కుం డీ డిక్కుం డీ డీ డీ

పెట్టు పెట్టు పెట్టు పెట్టు ముద్దూ
ముద్దుకో ముద్దెట్టు
కట్టుకో నా జట్టు
ముద్దుకో ముద్దెట్టు
కట్టుకో నా జట్టు
మొగ్గలా విచ్చింది వలపిప్పుడే
బుగ్గలో కొచ్చింది ఎరుపిప్పుడే
డీ డిక్కుం డీ డిక్కుం డీ డీ డీ
డీ డిక్కుం డీ డిక్కుం డీ డీ డీ

పెదవి మీద ముద్దెడితే బుగ్గల్లో సిగ్గు పొడా
బుగ్గల్లొ ముద్దెడితే గుండెల్లొ సన్న దడా
చెంగు మీద ముద్దెడుతే చెదిరింది పావడా
మూడింతలై దొరికే మురిపాలే యెడా పెడా
పదహారు కలలు చూసి పావలించరా
పొదరింటి తలుపు చిలక తగిలించరా
ముసుగులో గుద్దులాట ఇంకేల రా
మసకలో ముద్దులాట కిది వేల రా

ముద్దుకో ముద్దెట్టు
కట్టుకో నా జట్టు
ఒక పట్టు పడతాను ఒడిచేరుకో
కౌగిట్లొ నా మీద కసి తీర్చుకో
డీ డిక్కుం డీ డిక్కుం డీ డీ డీ
డీ డిక్కుం డీ డిక్కుం డీ డీ డీ

చేతి మీద ముద్దెడితే చెంపకొచ్చె తిమ్మిరీ
చంపమీద ముద్దెడితే వంపు సొంపులల్లరీ
నడుము మీద చెయ్యేస్తె పుట్టింది చాటు గిలి
లాగించు ఇట్టాగే ఈ ముద్దుల cetury
పొలిమేర దాటినాక పొగరెందుకో
సగమైనా కాకముందె చలి ఎందుకో
అందమైన నిబ్బరాలు చేజిక్కితే
అంతకన్న దెబ్బలాట ఏముంటదీ

పెట్టు పెట్టు పెట్టు పెట్టు ముద్దూ
ముద్దుకో ముద్దెట్టు
కట్టుకో నా జట్టు
ముద్దుకో ముద్దెట్టు
కట్టుకో నా జట్టు
ఒక పట్టు పడతాను ఒడిచేరుకో
కౌగిట్లొ నా మీద కసి తీర్చుకో
డీ డిక్కుం డీ డిక్కుం డీ డీ డీ
డీ డిక్కుం డీ డిక్కుం డీ డీ డీ

*******   *******   ********

చిత్రం: అగ్ని పుత్రుడు (1987)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి (All)
గానం: మనో, జానకి

ఎర్ర ఎర్రానీ బుగ్గమీద
ఎంద బడి మెరిసింది జిగి జిగి
అహా జిగి జిగి
సన్న సన్నానీ నడుము మీదా
చల్ల గాలి విసిరింది గిలి గిలి
అహా గిలి గిలి
ఎర్ర ఎర్రానీ బుగ్గమీద
ఎంద బడి మెరిసింది జిగి జిగి
అహా జిగి జిగి
సన్న సన్నానీ నడుము మీదా
చల్ల గాలి విసిరింది గిలి గిలి
అహా గిలి గిలి

చకనమ్మ వల్లంతా చందనాలో
కౌగిట్లొ ఎన్నెన్ని బందనాలో
చకనమ్మ వల్లంతా చందనాలో
కౌగిట్లొ ఎన్నెన్ని బందనాలో
ఎర్ర ఎర్రానీ బుగ్గమీద
ఎంద బడి మెరిసింది జిగి జిగి
అహా జిగి జిగి
సన్న సన్నానీ నడుము మీదా
చల్ల గాలి విసిరింది గిలి గిలి
అహా గిలి గిలి

కౌగిట్లో నా చిలక కవ్విస్తేనే అలక
తలపడి నాతో కలబదీ
అందాలలో ఎంతో అలజడీ
ఊపే ఉరవడీ
కొత్త రుచి కోడె కసి తెలిసిందిలే
సిగ్గు తడి చిక్కు ముడి తీరిందిలే
విరజాజులా పొద తొలి రోజులా కథ
కౌగిల్లలో కరిగే
చిరు నొక్కిల్లకే చెలి చెక్కిల్లలో
ముద్ద మందారాలె విచ్చె తేనెలొచ్చెనమ్మా
రేపు మాపు నిన్నె రెచ్చ గొట్టుకుంటా
పచ్చి ముద్దు లెన్నొ అచ్చు గుద్దుకుంటా
ఒలియో ఒలియో ఒడిలో ఒదిగే

హేయ్ ఎర్ర ఎర్రానీ బుగ్గమీద
ఎంద బడి మెరిసింది జిగి జిగి
అహా జిగి జిగి
సన్న సన్నానీ నడుము మీదా
చల్ల గాలి విసిరింది గిలి గిలి
అహా గిలి గిలి

పగలంత చీకట్లో రాత్రంత ఎన్నెట్లో
జతపడి నీతో తలపడి
నీ పక్క లోగిల్లే స్తిరపడీ
నీతో పడి పడి
నిద్దరకి నిలకడకి వీడుకోలు
ఇద్దరికి మీగడతో వేడి పాలు
పెనవేతలో ఇక తరువాతలేమిటొ శ్రీవారికే తెలుసు
యదా అంటించకే సొద రెట్టింతలై
ముద్దబంతి మొగ్గ విచ్చుకున్న వేలనాలో
తుమ్మెదల్లె వచ్చి వచ్చి వాలుతుంతా
రెమ్మచాటు కొమ్మ సోకులంకుంటా
కలయో నిజమో కలిసే శ్రుతిలో

ఎర్ర ఎర్రానీ బుగ్గమీద
ఎంద బడి మెరిసింది జిగి జిగి
అహా జిగి జిగి
సన్న సన్నానీ నడుము మీదా
చల్ల గాలి విసిరింది గిలి గిలి
అహా గిలి గిలి

చకనమ్మ వల్లంతా చందనాలో
కౌగిట్లొ ఎన్నెన్ని బందనాలో
చకనమ్మ వల్లంతా చందనాలో
కౌగిట్లొ ఎన్నెన్ని బందనాలో

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

See More Lyrics
Mangalya Balam (1958)
error: Content is protected !!