చిత్రం: అహ నా పెళ్ళంటా (2011)
సంగీతం: రఘు కుంచె
సాహిత్యం: వేటూరి
గానం: రఘు కుంచె, అంజనా సౌమ్య
నటీనటులు: అల్లరి నరేష్ , రీతూ బర్మచా, అనిత
దర్శకత్వం: వీరభద్రమ్
నిర్మాతలు: రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర
విడుదల తేది: 02.03.2011
చినుకులా రాలి
చినుకులా రాలి నదులుగా సాగి
వరదలైపోయి కడలిగాపొంగు
నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ
నదివి నీవు కడలి నేను
మరిచిపోబోకుమా హా మమత నీవేసుమా
చినుకులా రాలి నదులుగా సాగి
వరదలైపోయి కడలిగాపొంగు
నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ
ఆకులురాలె వేసవిగాలి నా ప్రేమ నిట్టూర్పులే కుంకుమపూసె వేకువ నీవై తేవాలి ఓదార్పులే
ప్రేమలుకోరె జన్మలలోని నేవేచి ఉన్నానులే
జన్మలుదాటె ప్రేమను నేనై నేవెల్లువౌతానులే
ఆ చల్లనీ గాలులే…
హిమములా రాలి సుమములై పూసి
రుతువులై నవ్వి మధువులై పొంగి
నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ
శిశిరమైన సిధిలమైన
విడిచిపోబోకుమా విరహమై పోకుమా
తొలకరికోసం తొడిమనునేనై అల్లాడుతున్నానులే పులకరమూదె పువ్వులకోసం వేసారుతున్నానులే
నింగికినేల అంటిసలాడె ఆ పొద్దురావాలిలే
నిన్నలు నేడై రేపటి నీడై నాముద్దు తీరాలిలే
ఆ తీరాలు చేరాలిలే…
మౌనమై మెరిసి గానమై పిలిచి
అలలతో అలిసి గగనమై ఎగసి
నీ ప్రేమ నా ప్రేమ తారాడే మన ప్రేమ
భువనమైనా గగనమైనా
ప్రేమమయమే సుమా… ప్రేమ మనమే సుమా…