చిత్రం: ఆకాశ వీధిలో (2001)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: దేవి శ్రీ ప్రసాద్, గంగ
నటీనటులు: నాగార్జున, రవీనా టండన్, కస్తూరి
దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు
నిర్మాత: రామోజీరావు
విడుదల తేది: 23.08.2001
వెన్నెల్లొ ఆడపిల్ల నువ్వైతే
వెచ్చని అల్లరి నాదైతే
ఊహలకేవో రెక్కలు రాగా
ఎగిరి పోతుంటె ఆకాశవీధిలో
వెన్నెల్లొ ఆడపిల్ల నేనైతే
వెచ్చని అల్లరి నీదైతే
ఊహలకేవో రెక్కలు రాగా
ఎగిరి పోతుంటె ఆకాశవీధిలో
మేఘాలే ముగ్గులు పెట్టె మేలల్లో
దేహాలే ఉగ్గులు కోరె దాహంలో
చందమామే మంచం…ఓహో హో…సర్దుకుందం కొంచం
అహో రాత్రులూ ఒకే యాత్రలూ
రహస్యాల రహదారిలో ఆకాశవీధిలో
వెన్నెల్లొ ఆడపిల్ల నేనైతే
వెచ్చని అల్లరి నాదైతే
భూదేవె బిత్తరపోయె వేగంలో
నా దేవె నిద్దర లేచె విరహంలో
తోక చుక్కై చూస్తా…ఓహో హో…సోకు లెక్కె రాస్తా
ముల్లోకాలకే ముచ్చెమటెయగా
ముస్తాబంత ముద్దడుకో ఆకాశవీధిలో
వెన్నెల్లొ ఆడపిల్ల నువ్వైతే
వెచ్చని అల్లరి నాదైతే
ఊహలకేవో రెక్కలు రాగా
ఎగిరి పోతుంటె ఆకాశవీధిలో
వెన్నెల్లొ ఆడపిల్ల నేనైతే