Akbar Salim Anarkali (1978)

చిత్రం: అక్బర్ సలీం అనార్కలి (1978)
సంగీతం: సి.రామచంద్ర
సాహిత్యం: సినారే
గానం: మహమ్మద్ రఫీ, పి.సుశీల
నటీనటులు: యన్.టి.రామారావు, బాలకృష్ణ , జమున, దీప
దర్శకత్వం: యన్.టి.రామారావు
నిర్మాత: యన్.టి.రామారావు
విడుదల తేది: 09.05.1979

పల్లవి:
సిపాయీ.. సిపాయీ..
సిపాయీ.. సిపాయీ..
నీకై ఎంత ఎంత వేచి వేచి ఉన్నానో…
ఈ వాలుకనులనడుగు అడుగు చెపుతాయీ
సిపాయీ.. ఓ..సిపాయీ..

హసీనా.. హసీనా..
నీకై ఎంత ఎంత వేగి వేగి పోయానో
ఈ పూలమనసునడుగు అడుగు ఇకనైనా
హసీనా.. ఓ.. హసీనా..

చరణం: 1
జడలోనా మల్లెలు జారితే నీ ఒడిలో ఉన్నాననుకున్నా
చిరుగాలిలో కురులూగితే చిరుగాలిలో కురులూగితే..
నీ చేయి సోకెనని అనుకున్నా

ఆ.. మల్లెలలో కదలాడినవి నా కలవరింపులే
ఆ గాలిలో చెలరేగినవి ఆ గాలిలో చెలరేగినవి
నా నిట్టూరుపులే… హసీనా..

చరణం: 2
తడి ఇసుకను గీసిన గీతలు అల తాకితే మాసి పోతాయి
ఎదలోన వ్రాసిన లేఖలు..ఎదలోన వ్రాసిన లేఖలు..
బ్రతుకంతా వుండి పోతాయి..

ఆ.. లేఖలలో ఉదయించినవి నా భాగ్యరేఖలే..
మన ఊపిరిలో పులకించినవి మన ఊపిరిలో పులకించినవి..
వలపు వాకలే.. సిపాయీ…

error: Content is protected !!