చిత్రం: అక్కమొగుడు (1992)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: చిత్ర, మినీ మినీ, ఎస్.పి.బాలు
నటీనటులు: రాజశేఖర్, సుహాసిని మణిరత్నం
దర్శకత్వం: క్రాంతి కుమార్
నిర్మాత: సి.హెచ్.వి.అప్పారావు
విడుదల తేది: 1992
1.శుభలేఖ రాసినట్టె లిరిక్స్
శుభలేఖ రాసినట్టె కన్నుకొట్టె అక్కగారు
నెలవంక ఇచ్చినట్టె ముద్దుపెట్టె బావగారు
మాష్టారు వినండీ.. లవ్ స్టోరీ కనండీ..
సిస్టర్తో క్రికెట్లో.. సిక్సర్లే కదండీ..
లాంగ్ లీవ్ యంగ్ లవ్
శుభలేఖ రాసినట్టె కన్నుకొట్టె అక్కగారు
నెలవంక ఇచ్చినట్టె ముద్దుపెట్టె బావగారు
కనులతో కథలనే అల్లిన రచయితా రసికుడే
పెదవితో నలిపిన వాంఛలో వలపులు అలికిడే
అల్లాటప్పా గోంగూరప్పా పిల్లా పాప నాంచారమ్మ
రూటు మార్చండి బీటు వెయ్యండి
లేటు ప్రేమల్లో పేటు రేగండి
అక్కయ్యే షిఫానూ.. బావయ్యే బఫూనూ..
కవ్విస్తే కమానూ.. కౌగిట్లో తుఫాను
లాంగ్ లీవ్ యంగ్ లవ్
శుభలేఖ రాసినట్టె కన్నుకొట్టె అక్కగారు
నెలవంక ఇచ్చినట్టె ముద్దుపెట్టె బావగారు
వయసులే ముదిరిన బాలిక మనసులే నవనవ
గుసగుస కొరికిన కోరిక చెవులలో కువకువ
కాలేజీలో టీనెజయ్యా చింపాజీకి చిన్నన్నయ్యా
ప్రేమ ట్రాఫిక్కు ఆపితే చిక్కు
ప్రేమ పుట్టింగు పెట్టరా క్కుక్కు
ఊహల్లో షికారు ఊరంతా పుకారు
మోగిస్తే గిటారు జంటల్లో హుషారు
లాంగ్ లీవ్ యంగ్ లవ్
శుభలేఖ రాసినట్టె కన్నుకొట్టె అక్కగారు
నెలవంక ఇచ్చినట్టె ముద్దుపెట్టె బావగారు
మాష్టారు వినండీ.. లవ్ స్టోరీ కనండీ..
సిస్టర్తో క్రికెట్లో.. సిక్సర్లే కదండీ..
లాంగ్ లీవ్ యంగ్ లవ్
********** ********** ********** **********
2.అక్కమ్మ అక్కమ్మ లిరిక్స్
అక్కమ్మ అక్కమ్మ అందాల చుక్కమ్మ ఏమమ్మ? వైనమేమ్మా?
చెక్కిళ్ల చుక్కమ్మ ఉక్కళ్లొజారింది ఏలమ్మ? ఏమి గోలమ్మా?
గొంతు దాటని మాట గొళ్ళాలు వేసింది లేవమ్మ పోయిరరావమ్మా
చెప్పుకుంటే సిగ్గు ఒప్పుకుంటే ఒప్పు బుల్లెమ్మా చిట్టి చెల్లమ్మా
అక్కమ్మ అక్కమ్మ అందాల చుక్కమ్మ ఏమమ్మ? వైనమేమ్మా?
చెక్కిళ్ల చుక్కమ్మ ఉక్కళ్లొజారింది ఏలమ్మ? ఏమి గోలమ్మా?
తెల్లారి మాపక్క చల్లంగ చేరావు ఏమమ్మ? సంగతేమమ్మా?
ఆ.. ఆ.. ఆ.. హ హ ఆ.. ఆ..
నీలాగ లేకుండ ఓలాగ ఉన్నావు సీతమ్మ ఎందుచేతమ్మా?
అ అ అ ఆ.. ఒ ఒ ఒ ఓ..
గుచ్చిగుచ్చి అడిగి కచ్చె తెప్పించొద్దు పోవమ్మ కాఫీ తేవమ్మా
కప్పు లిప్పు మధ్య కథలెన్నివున్నాయో కోకమ్మా దాచుకోకమ్మా
అక్కమ్మ అక్కమ్మ అందాల చుక్కమ్మ ఏమమ్మ? వైనమేమ్మా?
చెక్కిళ్ల చుక్కమ్మ ఉక్కళ్లొజారింది ఏలమ్మ? ఏమి గోలమ్మా?
సాకింటి కోకమ్మ నీవంటి సోకమ్మ ఓలమ్మ నలిగెనేవమ్మా?
ఆ.. ఆ.. ఆ.. హ హ ఆ.. ఆ..
తల్లోని జాజమ్మ జల్లోని పూవమ్మ ఓలమ్మ వాడనేమమ్మా?
ఒ ఒ ఒ ఓ.. అ అ అ ఆ..
ఒత్తిల్లనే కొత్త అత్తిల్లలో తెల్లచీరమ్మ నలిగెలేవమ్మా
రేరేగు బోగిళ్ళ రెక్కూడిపోయింది పూవమ్మ చాలుపోవమ్మా
అక్కమ్మ అక్కమ్మ అందాల చుక్కమ్మ ఏమమ్? వైనమేమ్మా?
చెక్కిళ్ల చుక్కమ్మ ఉక్కళ్లొజారింది ఏలమ్మ ఏమి గోలమ్మా?
రైకమ్మ బిర్రెక్కి రేపట్టు వీడింది ఏమమ్మ? మర్మమేమమ్మా?
ఆ.. ఆ.. ఆ.. హ హ ఆ.. ఆ..
కైపెక్కి నీచూపు కవ్వింతగున్నాది అక్కమ్మ ఏమి తిక్కమ్మా?
అ అ అ ఆ.. ఒ ఒ ఒ ఓ..
కయ్యాల మీ బావ కళ్యాణి మొదలెట్టెనోయమ్మ ఎంతమాయమ్మా
తొంగున మంచాన అందంగ మర్యాద వద్దమ్మ గుట్టు రట్టమ్మా
గొంతు దాటని మాట గొళ్ళాలు వేసింది లేవమ్మ పోయిరరావమ్మా
చెప్పుకుంటే సిగ్గు ఒప్పుకుంటే ఒప్పు బుల్లెమ్మా చిట్టి చెల్లమ్మా
********** ********** ********** ********** **********
3.చెలియ చెలియ లిరిక్స్
చెలియ చెలియ మదంతా గోల గోల
కలలో కలిగే కవ్వింతే కౌగిలీవ
జోరుగా దోర ప్రేమలూరవా..
చెలియ చెలియ మదంతా గోల గోల
కలలో కలిగే కవ్వింతే కౌగిలీన
కేళిలో తేలి ఊయలలాడమా..
చెలియ చెలియ మదంతా గోల గోల
కలలో కలిగే కవ్వింతే కౌగిలీన
నీ…. కిలకిల నవ్వుల్లో
నా…. వసంతమే పూసింది
ఈ…. మిలమిల వెన్నెల్లో
నీ…. సరాగమే సయ్యంది
గుమ్మెత్తే నీసోకే గమ్మత్తులా నివాళికే మతాబులే చూపే
ఊరించే నీ చూపే పసందుల ఉగాదికి హుషారులే రేపే
పాల మేగాల పానుపేసుకో..
ప్రేమరాగాల వీణ మీటుకో..
చెలియ చెలియ మదంతా గోల గోల
కలలో కలిగే కవ్వింతే కౌగిలీన
నీ…. నయాగరా ప్రేమల్ని
నా…. నిఘంటువే చేస్తాలే
నీ…. మొనాలిసా రూపాన్నే
నే… పెదాలతో గీస్తాలే
నీ నామం జపియిస్తా పదే పదే ప్రపంచమే అదే వినేదాక
నీకోసం తపియిస్తా ప్రియానివే ప్రియ నువ్వే సరే అనేదాక
చేరనీ నిన్ను చంద్రవంకలో..
పొందనీ నిన్ను పాలపుంతలో..
చెలియ చెలియ మదంతా గోల గోల
కలలో కలిగే కవ్వింతే కౌగిలీవ
కేళిలో తేలి ఊయలలాడమా
చెలియ చెలియ మదంతా గోల గోల
కలలో కలిగే కవ్వింతే కౌగిలీన
********** ********** ********** ********** **********
4.భజన సేయవే.. లిరిక్స్
ఆ.. ఆ.. భజన సేయవే.. భజన సేయవే..
మనస భజన సేయవే.. రామ భజన సే..యవే..
మనస భజన సే..యవే.. మనస పరమభక్తితో
మనస పరమభక్తితో మనస పరమభక్తితో
భజన సేయవే.. మనస భజన సేయవే..
ఖగమృగాదులను భాషరాని తరుల గిరులగూడి
భజన సేయవే.. రామ భజన సేయవే..
భజన సేయవే.. మనస భజన సేయవే..
కాకలేని శాదములకు కారుకూత కార్మికులకు
కాకలేని శాదములకు కారుకూత కార్మికులకు
కమ్మనైన కర్ణాటక సంగీతము కాదా!
నీరులేని ఒట్టిఘటవు నీరజాక్షి మువ్వలసడి
నీరులేని ఒట్టిఘటవు నీరజాక్షి మువ్వలసడి
రూపకాన తాళజతుల సంసారము కాదా!
దైనందిన జనజీవన నాటకాన చిత్రగతుల
స్పందనమొక నవరసాల సామ్రాజ్యము కాదా!
కోకిలమ్మ పంచమ శృతి కొండగాలి గాంధారము
కోకిలమ్మ పంచమ శృతి కొండగాలి గాంధారము
సప్తస్వర గానానికి సంకేతము కాగా
సుత్తిలోని శృతిలయలే భుక్తి మార్గమని తెలిసి
సుత్తిలోని శృతిలయలే భుక్తి మార్గమని తెలిసినవాడ
తర్కమేల? ఓ బాల తర్కమేల? ఓ ఏల తర్కమేల?
షడ్యమాది ఋషబమంద్ర దైవతానిలగొలిచిన
నాధయోగ విధిని ఆ.. నాధయోగ విధిని
శ్రీమధాది త్యాగరాజను తునియ
భజన సేయవే.. మనస భజన సేయవే..
రామ భజన సేయవే..
********** ********** ********** ********** **********
5.సంసారం సంతానం లిరిక్స్
కోరస్:
పసుపు కుంకుమల పడతి గంగకిది
చిలకపచ్చని సీమంతం
మగని ప్రేమలకు మగువ నోములకు
నేడే పేరంటం
పల్లవి:
సంసారం సంతానం సతి కోరేటి సౌభాగ్యం
మమకారం మందారం పసుపే ఆది మంగల్యం
చల్లరే యదజల్లరే ముత్తైదువులీవేళ
సంసారం సంతానం సతి కోరేటి సౌభాగ్యం
మమకారం మందారం పసుపే ఆది మంగల్యం
చరణం: 1
అందంతో తానే అరవిచ్చిన అరవిందం
అనురాగంలోన మనసిచ్చిన మకరందం
సీతా… గౌరీ… కలిశారే నీలోనే
నెలవంక లేత పొడుపుల్లో
వెలిశారే నీలోనే తొలిశూలు మొగ్గ ఎరుపుల్లో
ఈయరే శుభ హారతి సుమతీమనులీవేళ
సంసారం సంతానం సతి కోరేటి సౌభాగ్యం
మమకారం మందారం పసుపే ఆది మంగల్యం
చరణం: 2
ఎవరు నీవు ఎదలేని నీవు
మము వేటలాడుటే నీ క్రీడా
బ్రహ్మ రాతలని బొమ్మలాడుకొను వేడుక నీదేగా
పాపం నీరూపం ఈ ప్రళయం నీ దీపం
శిలకే ప్రతిరూపం నీ బ్రతుకే మా శాపం
ప్రేమా… బంధం…
మనసుంటే మీరాల మరణాలులేని మమతల్లో
వికసిస్తూ రాలాల చితిమంటవేగు గుండెల్లో
పాడన మది కీర్తన విదివంచిత రాగంలో
సంసారం సంతానం సతి కోరేటి సౌభాగ్యం
మమకారం మందారం పసుపే ఆది మంగల్యం
చల్లరే యదజల్లరే ముత్తైదువులీవేళ