Ala Modalaindi (2011)

చిత్రం: అలా.. మొదలైంది (2011)
సంగీతం: కె.కళ్యాణి మాలిక్
సాహిత్యం: అనంతశ్రీరామ్
గానం: కె.కళ్యాణి మాలిక్, నిత్య మీనన్
నటీనటులు: నాని, నిత్యా మీనన్
దర్శకత్వం: బి. వి. నందిని రెడ్డి
నిర్మాతలు: కె.ఎల్. దామోదర్ ప్రసాద్, వివేకానందా కుచిబోట్ల
విడుదల తేది: 21.01.2011

అమ్మమ్మో అమ్మో అమ్మాయి అంటే
అందంతో అల్లే వల
అబ్బబ్బో అబ్బో అబ్బాయి అంటే
మాటల్లో ముంచే అల
కవ్వించే నవ్వే పువ్వై పూసినా
గుండెల్లో ముళ్ళై తాకగా
ఊహల్లో ఎన్నో ఎన్నో పంచినా
చేతల్లో అన్నీ అందునా

అమ్మమ్మో అమ్మో అమ్మాయి అంటే
అందంతో అల్లే వల

ఆహా ఏం కన్నులు ఓహో ఏం చూపులు
అవి కావా మా ఆస్తులు
మ్మ్…ప్రేమించక ముందరే ఈ తియ్యని కవితలు
తర్వాత అవి కసురులు
అన్నీ వింటూ ఆనందిస్తూ ఆపైన ఐ యామ్ సారీ అంటారు
చుట్టూ చుట్టూ తిప్పుకుంటూ సింపుల్‌గా నో అందురు

అమ్మమ్మో అమ్మో అమ్మాయి అంటే
అందంతో అల్లే వల

కన్నీటి బాణమే వేసేటి విద్యలో
ముందుంది మీరే కదా
హే మౌనాన్నే కంచెగా మలిచేటి కోర్సులో
డిస్టెన్క్షన్ మీదే కదా
కన్నీరైనా మౌనం అయినా చెప్పేది నిజమేలే ప్రతిరోజు
అంతే కాని అరచేతుల్లో ఆకాశం చూపించకు

అమ్మమ్మో అమ్మో అమ్మాయి అంటే
అందంతో అల్లే వల
కవ్వించే నవ్వే పువ్వై పూసినా
గుండెల్లో ముళ్ళై తాకగా
ఊహల్లో ఎన్నో ఎన్నో పంచినా
చేతల్లో అన్నీ అందునా

**********   **********  ***********

చిత్రం: అలా.. మొదలైంది (2011)
సంగీతం: కె.కళ్యాణి మాలిక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హేమచంద్ర

చెలీ వినమని…
చెప్పాలి మనసులో తలపుని
మరీవాళే త్వరపడనా
మరో ముహూర్తం కనపడునా
ఇది ఎపుడో మొదలైందనీ
అది ఇప్పుడే తెలిసిందనీ

తనక్కూడా ఎంతో కొంత
ఇదే భావం ఉండుంటుందా
కనుక్కుంటే బాగుంటుందేమో
అడగ్గానే అవునంటుందా
అభిప్రాయం లేదంటుందా
విసుక్కుంటూ పొమ్మంటుందేమో
మందార పూవులా కందిపోయి
ఛీ ఆంటే సిగ్గనుకుంటాం కానీ
సందేహం తీరక ముందుకెళ్లితే
మర్యాదకెంతో హానీ…

ఇది ఎపుడో మొదలైందనీ
అది ఇప్పుడే తెలిసిందనీ

పిలుస్తున్నా వినపణ్ణట్టు పరాగ్గా నేనున్నానంటూ
చిరాగ్గా చినబోతుందో ఏమో
ప్రపంచంతో పన్లేనట్టు తదేకంగా చూస్తున్నట్టు
రహస్యం కనిపెట్టేస్తుందేమో
అమ్మాయి పేరులో మాయ మైకం
ఏ లోకం చూపిస్తుందో గానీ
వయ్యారి ఊహలో వాయువేగం
మేఘాలు దిగి రానంది

ఇది ఎపుడో మొదలైందనీ
అది ఇప్పుడే తెలిసిందనీ

**********   **********  ***********

చిత్రం: అలా.. మొదలైంది (2011)
సంగీతం: కె.కళ్యాణి మాలిక్
సాహిత్యం: లక్ష్మి భోపాల్
గానం: దీపు, నిత్యా మీనన్

ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే
నాకే అనుకుంటే అది నీకూ జరిగిందే
సర్లే గగ్గోలు పెట్టకే అంతా మన లైఫు మంచికే
మందుంది మనసు బాధకి
వదిలేద్దాం కథని కంచికే
అసలీ ప్రేమ దోమ ఎందుకు టెల్ మి వై
ఎవరిష్టం వాళ్ళది మనకెందుకు వదిలేయ్
ఏయ్ ప్రేమ దోమ ఎందుకు టెల్ మి వై

ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే
నాకే అనుకుంటే అది నీకూ జరిగిందే

మ్ ప్రేమించినా మ్ పెళ్ళాడకు
వైఫ్ ఒక్కటే తోడెందుకు
మ్ మగ వాళ్ళని మ్ టైం పాసని
అనుకుంటూ వెంట తిరగనీ
మన ఖర్చే వాళ్ళు పెట్టనీ
ఆ పైన వాళ్ళ ఖర్మ పోనీ
మరి పెళ్ళి గిల్లి ఎందుకు టెల్ మి వై
అది బుర్రే లేని వాళ్ళకి వదిలేసేయ్
మరి పెళ్ళి గిల్లి ఎందుకు టెల్ మి వై

ఆ నువ్వొక్కడే మ్ పుట్టావురా
నువ్వొక్కడే పోతావురా
మ్ ఆ మధ్యలో మ్ బతకాలిగా
ఆరడుగుల పెళ్ళి గొయ్యికి
ఏడడుగుల తొందరెందుకు
సూసైడు నేడు ముద్దు మనకి
మరి లైఫూ గీఫూ ఎందుకు టెల్ మి వై
నువ్ మళ్ళీ మళ్ళీ మొదలెట్టకు వదిలేయ్
ఏయ్ ప్రేమ దోమ ఎందుకు టెల్ మి వై

**********   **********  ***********

చిత్రం: అలా.. మొదలైంది (2011)
సంగీతం: కె.కళ్యాణి మాలిక్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: కె.కళ్యాణి మాలిక్, గీతామధురి

ఇన్నాళ్ళు నా కళ్ళు గ్రహించలేదు నన్ను నువ్వు చూస్తుంటే
చూపుల్లో ఇలాంటి ప్రేమ దాగి ఉందని
ఎలా ఎలా క్షణాలనే వెనక్కి రప్పించడం
ఎలా ఎలా గతాలనే ఇవ్వాళగా మార్చడం

ఇన్నాళ్ళు నా కళ్ళు గ్రహించలేదు నన్ను వువ్వు చూస్తుంటే
చూపుల్లో ఇలాంటి ప్రేమ దాగి ఉందని

చివరిదాకా చెలిమి పంచే చిలిపితనమే నీవని
మనసు దాకా చేరగలిగే మొదటి పిలుపే నీదని
తెలియకుండా ఇంత కాలం ఏమి చేశానో
తెలుసుకున్న వేళలోన దూరమెంతుందో ఇలా…

ఎవరు చేరి తీర్చగలరు మనసులోని లోటుని
ఎవరు మాత్రం చూపగలరు వెలుగు నింపే తోడుని
ఎదురు చూస్తూ ఉండిపోనా నేను ఇక పైన
జ్ఞాపకాన్నై మిగిలిపోనా ఎన్నినాళ్ళైనా ఇలా…

**********   **********  ***********

చిత్రం: అలా.. మొదలైంది (2011)
సంగీతం: కె.కళ్యాణి మాలిక్
సాహిత్యం: వీణా సాహితి
గానం: వీణా సాహితి

చిన్నారి సండే పార్టీ
మ్యూజిక్ లో మునగాలి
ప్రతినరము నాట్యం చేయాలి
మనసే ఫుల్ కిక్కివ్వాలి
బాధల్ని మరవాలి
ప్రతిరోజు లక్కే అవ్వాలి

ఓ బేబీ  ఓ బేబీ (6)

ఏ నిమిషం ఆగదు లేవోయ్
అడుగేస్తే చాలదు బాబోయ్
నీ ఆశలు వెంటే పరుగులు తీయ్
ఏర్రీ డే ఒక తీయని వలపు
కేర్ ఫ్రీ గా నవ్వుతు గడుపు
మనకేమి టెన్షన్ లేనట్టు
గతమంతా గాలికి వదిలేయ్
లోకాన్ని కొత్తగ చూసేయ్
ఏదైనా పర్లేదంటూ సూటిగ నమ్మితే
లైఫంతా బిందాసేలే…

ఓ బేబీ  ఓ బేబీ (6)

స్వర్గంలో పుట్టిన పలుకు
గుండెల్లో తిరిగిన మెరుపై
ఇక బయటికి దూసుకు వస్తుంటే
వన్ టైం డు సో మై హ్యాండ్
కం డార్లింగ్ డాన్స్ విత్ మి

నాతోనే అడుగేస్తావా
థ్రిల్ అంటే చూపిస్తాగా
పగలైన కలలే కంటూ హాయిగ తేలితే
ఇంకేమి కావాలిలే…

ఓ బేబీ  ఓ బేబీ (11)

Your email address will not be published. Required fields are marked *

Previous
Dil (2003)

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Pelli Sandadi (1996)
error: Content is protected !!