ఓ మై గాడ్.. డాడీ.. లిరిక్స్
సినిమా: అల వైకుంఠపురములో (2020)
దర్శకుడు: త్రివిక్రమ్
గానం: తెలుగు రాప్ – రోల్ రిడా
ఇంగ్లీష్ ర్యాప్ – రాహుల్ నంబియార్
అవివాహిత ర్యాప్ – లేడీ కాష్
గాయకుడు – రాహుల్ సిప్లిగుంజ్
అదనపు గాయకుడు – బ్లేజీ
సంగీతం: తమన్ ఎస్
సాహిత్యం: కృష్ణ చైతన్య
తారాగణం: అల్లు అర్జున్, పూజా హెగ్డే
ఆడియో: ఆదిత్య మ్యూజిక్
ల ల ల లాలా..
లా లా లా లా ల…
నా స్టోరీ చెప్పలేను… నా బాధకంతు లేదు
ఈ డాడీలందరు ఎందుకిట్ల పీక్కుతింటున్నారు…
మాట విన్నిపించుకోరు… అస్సలర్థం చేసుకోరు…
ఆలోచిస్తేనే నాన్న పేరు… రాలుతుంది నా హేయిరు…
వంద రూపాయలివ్వమంటే… మనమేమన్నా రిచ్చా, అని
క్లాసు పీకుతుంటే ఏమైనా పిచ్చా…అనుకుంటూ ఏడుచుకుంటూ నేను బైటికొచ్చా…
అందరింట సేమ్ సీను… ఏమంటావ్ చిచ్చా…
ఓ మై గాడ్… డాడీ… జస్ట్ స్టాప్ బీయింగ్ మై బ్యాడి
ఓ మై గాడ్… డాడీ… జస్ట్ స్టాప్ బీయింగ్ మై బ్యాడి
ఓ మై గాడ్… డాడీ… జస్ట్ స్టాప్ బీయింగ్ మై బ్యాడి
డోంట్ బి సో హార్డీ…
దట్ విల్ మేక్ మి స్యాడి…
మేరా నామ్ బంటు… కాని పేరుకి కొట్టారే ఇంటు..
చార్సౌ బీస్ డాడీ తోనే… చేసానే ఫైటే డే అండ్ నైటు..
ఓ.. ఓ.. ఓ.. ఓహో.. అమ్మకి మొగుడు
ఓ.. ఓ.. ఓ.. ఓహో.. నాన్నైనాడు…
వర్షాన్ని ఓ చిట్టి బాటిల్ లో నింపలేవు…
సంతోషాన్ని కుట్టి నువ్వు యూనిఫామ్ వెయ్యలేవు…
స్వేచ్చకేమి షార్ట్ కట్ కనిపెట్టలేదు ఒట్టు…
కాదంటే నన్ను తిట్టు… లేదా నాజట్టు కట్టు…
అడివేమో బ్యాక్ యార్డ్ లో పెట్టలేవు మచ్చా…
పావురాన్ని పేపర్ వెయిట్ చెయ్యలేవు పిచ్చా…
వాల్కనోతో చలి మంటే వెయ్యలేవు చిచ్చా
బ్లాంక్ చెక్ రా మనం చెప్పి మరీ వచ్చా…
హి ఈజ్ నాట్ ఆల్వేస్ రైట్… స్పై డాడీ స్పై డాడీ
హి ఈజ్ నాట్ ఆల్వేస్ రైట్… స్పై డాడీ స్పై డాడీ
స్పై డాడీ.. స్పై డాడీ… స్పై డాడీ.. స్పై డాడీ…
స్పై డాడీ… స్పై డాడీ… స్పై డాడీ…
సన్ అఫ్ వాల్మీకి అంటే… కేర్ అఫ్ కష్టాలున్నట్టే…
ఈ ఇంట్లో నవ్వాలంటే… థానోస్ చిటికెయ్యాలంతే…
ఓ.. ఓ.. ఓ.. ఓహో.. మమ్మీ మొగుడు…
ఓ.. ఓ.. ఓ.. ఓహో.. డమ్మీ గాడు…
ఓ మై గాడ్… డాడీ… జస్ట్ స్టాప్ బీయింగ్ మై బ్యాడి
ఓ మై గాడ్… డాడీ… జస్ట్ స్టాప్ బీయింగ్ మై బ్యాడి
ఓ మై గాడ్… డాడీ… జస్ట్ స్టాప్ బీయింగ్ మై బ్యాడి
డోంట్ బి సో హార్డీ…
దట్ విల్ మేక్ మి స్యాడి…
ల ల ల లాలా.. లా లా లా లా ల…
********** ********** **********
సామజవరగమన.. లిరిక్స్
సినిమా: అల వైకుంఠపురములో (2020)
గానం: సిద్ శ్రీరామ్
సంగీతం: ఎస్ ఎస్ తమన్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
తారాగణం: అల్లు అర్జున్, పూజా హెగ్డే
ఆడియో: ఆదిత్య మ్యూజిక్
నీ కాళ్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు..
ఆ చూపులనలా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు.
నీ కాళ్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు..
ఆ చూపులనలా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు.
నీ కళ్ళకి కావాలి కాస్తాయే కాటుకలా నా కళలు..
నువ్వు నులుముతుంటే ఎర్రగా కంది చిందేనే సెగలు.
నా ఊపిరి గాలికి ఉయ్యాలలూగుతూ ఉంటే ముంగురులు..
నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టూర్చవటే నిష్టూరపు విలవిలలు.
సామజవరగమన.. నిను చూసి ఆగగలనా..
మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా.
సామజవరగమన.. నిను చూసి ఆగగలనా..
మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా.
నీ కాళ్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు..
ఆ చూపులనలా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు.
మల్లెల మాసమా… మంజుల హాసమా…
ప్రతి మలుపులోన ఎదురుపడిన వెన్నెల వనమా.
విరిసిన పించామా… విరుల ప్రపంచమా…
ఎన్నెన్ని వన్నె చిన్నలంటే ఎన్నగ వశమా.
అరె! నా గాలే తగిలినా… నా నీడే తరిమినా…
ఉలకవా.. పలకవా.. భామా…
ఎంతో బ్రతిమాలినా… ఇంతేనా అంగనా…
మదిని మీటు మధురమైన మనవిని వినుమా……..!!!!!!
సామజవరగమన.. నిను చూసి ఆగగలనా..
మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా.
సామజవరగమన.. నిను చూసి ఆగగలనా..
మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా.
నీ కాళ్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు..
ఆ చూపులనలా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు..
నీ కళ్ళకి కావాలి కాస్తాయే కాటుకలా నా కళలు..
నువ్వు నులుముతుంటే ఎర్రగా కంది చిందేనే సెగలు..
********** ********** **********
బుట్టబొమ్మా బుట్టబొమ్మా.. లిరిక్స్
సినిమా: అల వైకుంఠపురములో (2020)
దర్శకుడు: త్రివిక్రమ్
గానం: అర్మాన్ మాలిక్
సంగీతం: తమన్ ఎస్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
తారాగణం: అల్లు అర్జున్, పూజా హెగ్డే
ఆడియో: ఆదిత్య మ్యూజిక్
ఇంతకన్న మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్ము
ఈ లవ్వనేది బబులు గమ్ము
అంటుకున్నదంటే పోదు నమ్ము
ముందు నుంచి అందరన్నమాటే గానీ మళ్లీ అంటున్నానే అమ్ము..
ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము..
ప్రేమనాపలేవు నన్ను నమ్ము..
ఎట్టాగా అనే ఎదురు చూపుకీ
తగినట్టుగా నువ్వు బదులు చెబితివే..
అరి దేవుడా! ఇదేందనేంత లోపటే
పిల్లడా అంట దగ్గరై నన్ను చేరదీస్తివే..
బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్ను సుట్టూకుంటివే…
జిందగీకే అట్టబొమ్మై జంట కట్టూకుంటివే..
బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్ను సుట్టూకుంటివే…
జిందగీకే అట్టబొమ్మై జంట కట్టూకుంటివే..
మల్టీప్లెక్సులోని ఆడియన్సులాగా మౌనంగున్నాగానీ అమ్ము
లోన డండనక జరిగిందే నమ్ము
దిమ్మ తిరిగినాదే మైండు సిమ్ము
రాజుల కాలం కాదు… రథము గుర్రం లేవు..
అద్దం ముందర నాతో నేనే యుద్ధం చేస్తాంటే..
గాజుల చేతులు జాపి దగ్గరకొచ్చిన నువ్వు..
చెంపల్లో చిటికేసి చక్కరవర్తిని చేసావే..
చిన్నగా చినుకు తుంపరడిగితే
కుండపోతగా తుఫాను తెస్తివే…
మాటగా ఓ మల్లెపువ్వునడిగితే
మూటగా పూలతోటగా పైనొచ్చి పడితివే…
బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్ను సుట్టూకుంటివే…
జిందగీకే అట్టబొమ్మై జంట కట్టూకుంటివే..
వేలి నిండా నన్ను తీసి బొట్టు పెట్టూకుంటివే
కాలికింది పువ్వు నేను నెత్తినెట్టూకుంటివే
ఇంతకన్న మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్ము
ఈ లవ్వనేది బబులు గమ్ము
అంటుకున్నదంటే పోదు నమ్ము
ముందు నుంచి అందరన్నమాటే గానీ మళ్లీ అంటున్నానే అమ్ము..
ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము..
ప్రేమనాపలేవు నన్ను నమ్ము..
********** ********** **********
అల వైకుంఠ పురంబులో.. లిరిక్స్
సినిమా: అల వైకుంఠపురములో (2020)
గానం: శ్రీ కృష్ణ, ప్రియా సిస్టర్స్
సంగీతం: ఎస్ ఎస్ తమన్
సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి
తారాగణం: అల్లు అర్జున్, పూజా హెగ్డే, సుశాంత్
ఆడియో: ఆదిత్య మ్యూజిక్
అల వైకుంఠ పురంబులో నగరిలో నా మూల సౌధంబు దా..
పల మందార వనాంత రామృత సరః ప్రాంతేందు కాంతోపలో..
త్పల పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము “పాహి పాహి” యనఁ గుయ్యాలించి సంరంభి యై.
అలా వైకుంఠపురములో.. అడుగుమోపిందిపాశమే..
విలాపాలున్న విడిదికే.. కలాపం కదిలివచ్చెనే..
అలా వైకుంఠపురములో..బంటుగాచేరెబంధమే..
అలై పొంగేటికళ్ళలో కులాసాతీసుకొచ్చెనే..
గొడుగుపట్టింది గగనమే..కదిలివస్తుంటె మేఘమే..
దిష్టితీసింది దీవెనై..ఘనకూష్మాండమే..
భుజము మార్చింది భువనమే..బరువుమోయంగ బంధమే..
స్వాగతించింది చిత్రమై..రవిసింధూరమే…
వైకుంఠపురములో.. ల ల ల లాలా..
వైకుంఠపురములో.. ల ల ల లాలా..
వైకుంఠపురములో.. ల ల ల లాలా..
వైకుంఠపురములో.. ల ల ల లాలా..
వైకుంఠపురములో..ఆ మూలనగరిలో..
వైకుంఠపురములో..సౌధంబుదాపల..
వైకుంఠపురములో..తారంగంచేరెనే..
వైకుంఠపురములో..తాండవమేసాగెనే..
********** ********** **********
రాములో రాములా.. లిరిక్స్
సినిమా: అల వైకుంఠపురములో (2020)
గానం: అనురాగ్ కులకర్ణి, సత్యవతి (మంగ్లీ)
సంగీతం: ఎస్ ఎస్ తమన్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
తారాగణం: అల్లు అర్జున్, పూజా హెగ్డే, సుశాంత్
ఆడియో: ఆదిత్య మ్యూజిక్
హేయ్ బ్రదర్ ఆపమ్మా.. ఈ డిక్ చిక్ డిక్ చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా..!
అబ్బా.. కడుపు నిండిపోయింది బంగారం..
బంటూ గానికి ట్వంటీ టూ… బస్తిల మస్తు కటౌటు..
బచ్చాగాండ్ల బ్యాచుండేది… ఒచ్చినమంటే చుట్టూ..
కిక్కే సాలక ఓ నైటు… ఎక్కీ డొక్కు బుల్లెట్టు..
సందూ సందుల మందూ కోసం ఎతుకుతాంటే రూటూ..
సిల్కూ చీర కట్టూకొని… చిల్డూ బీరు మెరిసినట్టు..
పొట్లం కట్టిన బిర్యానీకి… బొట్టూబిల్ల పెట్టినట్టు..
బంగ్లా మీద నిలుసోనుందిరో ఓ సందామామ…
సుక్క దాగక శెక్కరోచ్చెరో .. ఎం అందం మామ..
జింక లెక్క దునుకుతుంటేరో ఆ సందమామ…
జుంకీ జారి చిక్కుకుందిరో… నా దిల్లుకు మామ..
రాములో రాములా నన్నాగం జెసిందిరో… రాములో రాములా నా పాణం తీసిందిరో
రాములో రాములా నన్నాగం జెసిందిరో… రాములో రాములా నా పాణం తీసిందిరో
రాములో రాములా నన్నాగం జెసిందిరో… రాములో రాములా నా పాణం తీసిందిరో
రాములో రాములా నన్నాగం జెసిందిరో… రాములో రాములా నా పాణం తీసిందిరో
రాములో రాములా నన్నాగం జెసిందిరో… రాములో రాములా నా పాణం తీసిందిరో
ఏ.. తమ్మలపాకే ఏస్తుంటే… కమ్మగ వాసన వస్తావే..
ఎర్రగ పండిన బుగ్గలు రెండూ యాదీకోస్తాయే..
అరె.. పువ్వుల అంగీ ఎస్తుంటే… గుండీ నువ్వై పూస్తావే..
పండూకున్న గుండెల దూరి లొల్లే జేస్తావే..
అరె.. ఇంటి ముందు లైటు మిణుకు మిణుకుమంటాంటే…
నువ్వు కన్ను కొట్టినట్టు సిగ్గు పుట్టిందే..
సీరకొంగు తలుపుసాటు సిక్కుకుంటాంటే…
ఎహె.. నువ్వు లాగినట్టు ఒళ్ళు జల్లు మంటాందే..
నాగాస్వరం ఊదూతుంటే నాగుపాము ఊగినట్టు…
ఎంటబడి వస్తున్నానీ పట్టాగొలుసు సప్పూడింటు..
పట్టనట్టు తిరుగుచున్నావే… ఓ సందామామ..
పక్కకుపోయి తొంగి సూస్తవే.. ఎం టెక్కుర మామ.
రాములో రాములా నన్ను ఆగం జెసిందిరో… రాములో రాములా నా పాణం తీసిందిరో
రాములో రాములా నన్ను ఆగం జెసిందిరో… రాములో రాములా నా పాణం తీసిందిరో
రాములో రాములా నన్ను ఆగం జెసిందిరో… రాములో రాములా నా పాణం తీసిందిరో
రాములో రాములా నన్ను ఆగం జెసిందిరో… రాములో రాములా నా పాణం తీసిందిరో..
********** ********** **********
సిత్తరాల సిరపడు.. లిరిక్స్
సినిమా: అల వైకుంఠపురములో (2020)
దర్శకుడు: త్రివిక్రమ్
గానం: సూర్రన్న, సాకేత్ కె
సంగీతం: తమన్ ఎస్
సాహిత్యం: విజయ్ కుమార్ భల్ల
తారాగణం: అల్లు అర్జున్, పూజా హెగ్డే
ఆడియో: ఆదిత్య మ్యూజిక్
సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు..
పట్టుపట్టినాడ ఒగ్గనే ఒగ్గడు…
పెత్తనాలు నడిపేడు సిత్తరాల సిరపడు..
మంతనాలు చేసినాడు సిత్తరాల సిరపడు..
ఊరూరు ఒగ్గేసినా ఉడుం పట్టు ఒగ్గడు…
బుగతోటి ఆంబోతూ రంకేసి కుమ్మబోతే…
బుగతోటి ఆంబోతూ రంకేసి కుమ్మబోతే..
కొమ్ములూడదీసి మరీ.. పీపలూదినాడురో.
జడలిప్పి మర్రి సెట్టు దెయ్యాల కొంపంటే
జడలిప్పి మర్రి సెట్టు దెయ్యాల కొంపంటే
దెయ్యముతొ కయ్యానికి తొడగొట్టీ దిగాడు….
అమ్మోరి జాతరలో ఒంటి తల రావణుడు..
అమ్మోరి జాతరలో ఒంటి తల రావణుడు..
గుంటలెంట పడితేనూ గుద్ది గుండ సెసినాడు..
గుంటలెంట పడితేనూ గుద్ది గుండ సెసినాడు..
వరదలో గుంటగాళ్ళు చిక్కుకోని బిక్కుమంటే..
వరదలో గుంటగాళ్ళు చిక్కుకోని బిక్కుమంటే..
ఈడీదుకుంటుబోయి గుంజుకొచ్చినాడురో..
ఈడీదుకుంటుబోయి గుంజుకొచ్చినాడురో.
పొన్నూరు వస్తాదు దమ్ముంటే రమ్మంటె…
పొన్నూరు వస్తాదు దమ్ముంటే రమ్మంటె..
రొమ్ముమీదొక్కటిచ్చి కుమ్మి కుమ్మి పోయాడు..
రొమ్ముమీదొక్కటిచ్చి కుమ్మి కుమ్మి పోయాడు.
పదిమంది నాగలేని పదిమూర్ల సొరసేప…
పదిమంది నాగలేని పదిమూర్ల సొరసేప..
ఒడుపుగా ఒంటి సేత్తో ఒడ్డుకట్టుకొచ్చినాడు…
ఒడుపుగా ఒంటి సేత్తో ఒడ్డుకట్టుకొచ్చినాడు..
సాముసేసె కండతోటి దేనికైన గట్టిపోటి…
సాముసేసె కండతోటి దేనికైన గట్టిపోటి..
అడుగడుగు ఏసినాడ అదిరేను అవతలోడు.
సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు..
ఉత్తరాల ఊరి సివర సిత్తరాల సిరపడు..
గండు పిల్లి సూపులతో గుండెలోన గుచ్చాడు..
సక్కనమ్మ యెనకబడ్డ పోకిరొల్లనిరగదంతె..
సక్కనమ్మ యెనకబడ్డ పోకిరొల్లనిరగదంతె..
సక్కనమ్మ కల్లల్లో యేల యేల సుక్కలచ్చే..
సక్కనమ్మ కల్లల్లో యేల యేల సుక్కలచ్చే..
super
super
super
super
good
????
super super
🤗
super