Ala Vaikunthapurramuloo Ninu Chusina Kshanam loo Lyrics

Ala Vaikunthapurramuloo Ninu Chusina Kshanam loo Lyrics

Ala Vaikunthapurramuloo Ninu Chusina Kshanam loo Lyrics

అల వైకుంఠపురంలో.. నిను చూసిన క్షణంలో… లిరిక్స్

సంగీతం: నవీన్ జె.
సాహిత్యం: దేవా
గానం: నవీన్ జె.
దర్శకత్వం: అంజనీదాస్
నిర్మాణం: అంజనీదాస్
విడుదల తేది: 05.12.2019

పండగ పూట పరికిణీలో పరిచయమయ్యావే పిల్లా..
సాయంత్రం వేళా సూర్యకాంతంలా..
ఆడిపోసుకోకే నన్నంతలా..

ఎలా.. ఇంకెలా .. అల వైకుంఠరపురంలో..
నిను చూసిన క్షణంలో.. మైమరచి పోయానిల్లా..
అల వైకుంఠపురంలో.. నిను చూసిన క్షణంలో..
మైమరచి పోయానిల్లా..

తను మాటాడే మాటా.. అది ఐన్‌ స్టీన్‌ సిద్ధాంతం
E=mc2 అని, చెప్పిన రాద్దాంతం
ఆవిడ పాడే పాటా, మాతా మంగేష్కర్‌ గాత్రం
చెవులు చిల్లు పడినా ఆశ్చర్యం లే, అతిపెద్ద నమ్మశక్యం

ముక్కుమీద కోపం, మరుక్షణం మందహాసం
వాలు కళ్ళతో గాలం, వెయ్యమాకు జర శాంతం

ఎలా.. ఇంకెలా .. అల వైకుంఠరపురంలో..
నిను చూసిన క్షణంలో.. మైమరచి పోయానిల్లా..
అల వైకుంఠపురంలో.. నిను చూసిన క్షణంలో..
మైమరచి పోయానిల్లా..

గ్రాహంబెల్‌ ఫోన్‌ లా, ట్రింగ్‌ ట్రింగ్‌ మందే నీ అందం
నీ ఫస్ట్‌ కాల్‌ కై వెయిట్ చేస్తా, నేను నా జీవితాంతం
బ్రహ్మ గారితో, నీకోసం చేస్తా యుద్దం
ప్రతి జన్మ జన్మకి కావాలే, నువ్వే నా సొంతం

నడుమే అయస్కాంతం, నడకే భరతనాట్యం
అణుబాంబై ఆసాంతం, దూకేయకే ఒసేయ్ కాంతం!

ఎలా.. ఇంకెలా .. అల వైకుంఠరపురంలో..
నిను చూసిన క్షణంలో.. మైమరచి పోయానిల్లా..
అల వైకుంఠపురంలో.. నిను చూసిన క్షణంలో..
మైమరచి పోయానిల్లా..

అల వైకుంఠపురంలో.. నిను చూసిన క్షణంలో..
మైమరచి పోయానిల్లా..

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

error: Content is protected !!