Allari (2002)

చిత్రం: అల్లరి (2002)
సంగీతం: పాల్ .జె
సాహిత్యం: సిరివెన్నెల
గానం: అపర్ణ, చిన్మయి
నటీనటులు: నరేష్ , శ్వేతా అగర్వాల్
దర్శకత్వం: రవిబాబు
నిర్మాత: రవిబాబు
విడుదల తేది: 10.05.2002

కింగిని మింగిని కింగిని మింగిని
కింగిని మింగిని కింగిని మియామావ్
కింగిని మింగిని
కింగిని మింగిని కింగిని మియా ఆ ఆవ్
కింగిని మింగిని
కింగిని మింగిని కింగిని మింగిని
కింగిని మింగిని కింగిని మింగిని
కింగిని మింగిని కింగిని మియా మ ఆ ఆవ్

హేయ్ చిలిపి చిలక వలకు పడిందోయ్
వలపు చిటిక చెలికి మహా నచ్చిందోయ్
ఉడుకు దుడుకు వయసుగనక
కునుకు విడని కలల వెనక
నదురు బెదురు అనక ఎగిరి పోతోందోయ్

ఫ్రీగా వదిలేసే నీ సోకు సైగ చూశా
డైలీ లైనేసి నిను పట్టేశా
పాపం తెగ చూసే నీ సంగతేదో చూశా
చాలా జాలేసి మనసిచ్చేశా
ఓటేసే వయసేలేదే మరి
లవ్ చేస్తే మతిచెడుతుందే
ప్రేమ పిచ్చి పుట్టుకొచ్చి తరుముకొచ్చెనోయ్
కింగిని మింగిని కింగిని మియా మ ఆ ఆవ్

ముందే చెబుతున్నా చెడిపోకు పిచ్చికన్నా
దిగితే అయిపోతావ్ నువు దీవానా
నిండా మునిగాక దిగులేమీ ఉండదింక
నువ్వే అవునంటావే దిగి చూశాక
ఏమైనా ఎవరేమన్నా ఎదురేమున్నా ఇది ఆగేనా
ప్రేమ పిచ్చి పుట్టుకొచ్చి తరుముకొచ్చెనోయ్
కింగిని మింగిని కింగిని మియా మ ఆ ఆవ్

*********   *********   **********

చిత్రం: అల్లరి (2002)
సంగీతం: పాల్ .జె
సాహిత్యం: సిరివెన్నెల
గానం: అర్చన, దేవన్

రా పోదాం షికారుకి చాలందాం ఇవ్వాళకి
టాసేద్దాం ప్రోగ్రాముకి
సరెలే కాని ఎగరెయ్ కాయన్ని
హెడ్సైతే మనింటికి వెల్దాంలే పదింటికి
ఏం చెబుదాం పెద్దాళ్ళకి
ప్రయివేట్ క్లాసు ఒకే బాసు

చరణం: 1
పిజ్జా వేస్టు బర్గర్ బెస్టు అడ్జస్ట్ అయిపోదామా
ఫ్రెండ్‌షిప్పంటే అడ్జస్ట్‌మెంటే ఎహే కాదనకమ్మా
స్నేహం అంటే ఒక్కరు కాదు ఇద్దరు ఉంటారమ్మా
ఇష్టం నీది కష్టం నాది ఏం చెయ్యను ఖర్మ
మాటల్లో నిను కాదంటున్నా
టోటలుగా నువు చెప్పిందే వింటున్నా
ఆటల్లో నిను వదిలేస్తున్నా
లైఫ్‌లో ఈ ఫ్రీడం నీకిస్తానా
వెనకే ఉంటా నిను చూస్తుంటా

చరణం: 2
ఎన్నాళ్ళైనా ఇలాగేఇల్లా పిల్లాడై ఉంటావా
చెయ్యాల్సింది అంతా చేసి సేవ్‌మి అంటావా
రైటో లెఫ్టో నా రూట్లోకి రానుపొమ్మంటావా
నీ కేరాఫై ఉండను అంటే చాలా ఫీలైపోవా
జన్మంతా నిన్ను జాగ్రత్తగా నడపనా
ఇక వేరే పనేంలేదా
అందుకే నువ్వు పుట్టావుగా
తప్పదే అలా రాసిపెట్టున్నాక
నిజమంటావా నమ్మనంటావా
ఋజువుందా నీ మాటకి ఒట్టేస్తా ముమ్మాటికి
అయితేరా నా దారికి
ఇంకాసేపు  పరుగే ఆపు

*********   **********   *********

చిత్రం: అల్లరి (2002)
సంగీతం: పాల్ .జె
సాహిత్యం: సిరివెన్నెల
గానం: అపర్ణ , శ్రీనివాస్

నరనరం ఉలికి పడేట్టు అలా నవ్వకే అందమా
ఒక్క క్షణం తెగించమన్నాను కదా అంత సందేహమా
ఏం చేద్దాం – జత పడదాం
ఈ దూరం – పని పడదాం
ఆనందం కనిపెడదాం
నువు సరేనంటె సరిహద్దే తెంచుకుందాం

లేత పెదవి తడి తగిలి మేను కరిగిపోవాలి
వేడి చూపు సెగ తగిలి ఈడు కందిపోవాలి
ఎమన్నదో నీ ఊపిరి – ఏం విన్నదో నీ తిమ్మిరి
ఎందుకట అరచేతుల్లో ఈ చెమట
కొత్త కదా సరసం కోరే నీ సరదా
మొదలయేదిక్కు ముదిరితే ముప్పు కాదా

కైపు కళ్ళ గమ్మత్తు రేపుతోంది ఓ మత్తు
చీకటల్లె నీ జుట్టు కలలు నింపె నా చుట్టూ
ఆపేదెలా నీ అల్లరి – ఆర్పేదెలా ఈ ఆవిరి
ఒడికొస్తే తికమకలన్ని వదిలిస్తా
చనువిస్తే ఇక నీ వెనుకే పడి ఛస్తా
అడగాలా చెప్పు మొహమాటం తప్పు కాదా

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Prathista (1998)
error: Content is protected !!