చిత్రం: అల్లరి పిడుగు (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సాహితి
గానం: మల్లికార్జున్ , శ్రీవర్ధిని
నటీనటులు: బాలక్రిష్ణ , కత్రినాకైఫ్, ఛార్మి
దర్శకత్వం: జయంత్ సి.పరాన్జీ
నిర్మాత: యమ్.ఆర్.వి.ప్రసాద్
విడుదల తేది: 05.10.2005
నేడే ఈ నాడే
నేడే ఈ నాడే కరుణించె నన్ను చెలికాడే
నేడే ఈ నాడే కరుణించె నన్ను చెలికాడే
ఆ…ఆ…ఆ…ఆ… ఆ..ఆ..ఆ..
నేడే ఈ నాడే కరుణించె నన్ను చెలికాడే
నేడే ఈ నాడే కరుణించె నన్ను చెలికాడే
ఆ…ఆ…ఆ…ఆ… ఆ..ఆ..ఆ..
వాలుకన్నుల వన్నెలాడివి వగలే చాలు నిరజాణ
దోర ఆశల దొంగ చూపుల చొరవే నీవు అనుకోన
వారేవా వయ్యారమా పలుకేమో బంగారమా
ప్రేమంటే శృంగరమా రమ్మంటే చిరు కోపమా
మహా పెంకి మగువలు మీరు
మనసైతె మీ మగవారు ఇక ఆగలేరని తెలుసు
నేడే ఈ నాడే కరుణించె నన్ను చెలికాడే
నేడే ఈ నాడే కరుణించె నన్ను చెలికాడే
ఆ…ఆ…ఆ…ఆ… ఆ..ఆ..ఆ..
ఆరుబైటిలా కన్ను గీటడం ఔరా మీకు మర్యాదా
కంటి సైగకే పైట జారడం ఐనా తమకు బాగుందా
పైపైకి పరిహాసమా బెట్టంత చెలి కోసమా
పెదవుల్లో దరహసమా అదికూడ ఓ వేషమా
మహారాజు భోగులు మీరు మరి నాకు లొంగకపోరు
పరువాల మేనకగారు నను ఇంక విడిపోలేరు
నేడే ఈ నాడే కలిపింది కన్ను చెలి తానే
నేడే ఈ నాడే కరుణించె నన్ను చెలికాడే
అహ హా… ఆ ఆ ఆ
అహ హా… ఆ ఆ ఆ