Alludu Adhurs Lyrics

Alludu Adhurs (2021)

హోలా చిక హోలా హోలా చికా… లిరిక్స్

చిత్రం: అల్లుడు అదుర్స్ (2021)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: జస్ప్రీత్ జస్జ్
నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్, నభా నటేష్, అను ఇమ్మానుయేల్
దర్శకత్వం: సంతోష్ శ్రీనివాస్
నిర్మాణం: గొర్రెల సుబ్రహ్మణ్యం
విడుదల తేది: 14.01.2021

Hola Chica Song Telugu Lyrics

హోలా చిక హోలా హోలా చికా… హోలా చిక హోలా హోలా చికా
హోలా చిక నా… ?? వాట్ నాన్సెన్స్… ??
హలో పిల్లా… ఇట్ మేక్ సెన్స్
హోలా అంటే హలో… చిక అంటే పిల్ల
ఈ మాత్రం దానికి తెలుగులో అంటే పోలా..?
తెలుగులో ఈ వర్డు చాలా వాడేశారు… అందుకని సారు, స్పానిష్ లో దిగారు.

హోలా చిక హోలా హోలా చికా… హోలా చిక హోలా హోలా చికా
హోలా చిక హోలా హోలా చికా… హోలా చిక హోలా హోలా చికా

ఐదేళ్ళ వయసప్పుడు… ఐశ్వర్యరాయ్ అంటే ఇష్టం
హోలా చిక హోలా హోలా చికా… హోలా చిక హోలా హోలా చికా
తర్వాత ఇంకెప్పుడు… చూళ్ళేదు నేనంత అందం
హోలా చిక హోలా హోలా చికా… హోలా చిక హోలా హోలా చికా
ఇన్నాళ్లకు చూసినాను నిన్నే… హోలా చిక హోలా హోలా చికా
స్టాచ్యులా స్టన్నైంది కన్నె… హోలా చిక హోలా హోలా చికా
ఇట్ట ఎట్టా పుట్టినావే అబ్బో అబ్బో… నిన్ను పట్టకుంటే గుండె లబ్బో దిబ్బో

హోలా చిక హోలా హోలా చికా… ఓలమ్మో నువ్వేలే నా మ్యాజిక్కా
హోలా చిక హోలా హోలా చికా… పట్టెయ్ వే నా లవ్వునే క్యాచ్ ఇకా
హోలా చిక హోలా హోలా చికా… హోలా చిక హోలా హోలా చికా

హ్హ… రేటింగ్ లోన ఫైవ్ స్టార్ ఉన్నవాణ్ణి
ఫైటింగ్ లోన ఫస్ట్ ర్యాంకు పొందినోన్ని
డేటింగ్ లోకి ఫస్ట్ టైం వచ్చినానే… డేట్ ఇవ్వవే
ఓటిటి యాప్స్ డౌన్లోడ్ చేసినానే… ఊళ్ళోని పబ్స్ టచ్ లోన ఉన్న వాన్నే
న్యూ ట్రెండ్ బాయ్ ఫ్రెండ్ అంటే నేనే… లేటు చెయ్యకే

ఆవారా లాంటి వాణ్ని నేనే… హోలా చిక హోలా హోలా చికా
వాలెంటైన్ చేసినావే నన్నే… హోలా చిక హోలా హోలా చికా
ఒక్క చిన్న తప్పు చాలు ఒప్పో అప్పో… నీ నవ్వు నాకు ఇవ్వనంటే లబ్బో దిబ్బో

హోలా చిక హోలా హోలా చికా… ఓలమ్మో నువ్వేలే నా మ్యాజిక్కా
హోలా చిక హోలా హోలా చికా… హోలా చిక హోలా హోలా చికా
హోలా చిక హోలా హోలా చికా… పట్టెయ్ వే నా లవ్వునే క్యాచ్ ఇకా
హోలా చిక హోలా హోలా చికా… హోలా చిక హోలా హోలా చికా

అవెంజర్స్ థార్… మెరుపు షాట్ కొట్టినట్టు
మ్యాచ్ లాస్ట్ బాలు… సిక్సరేసి బాదినట్టు
నా దిల్లుతోటి ఆడుకోకే… ఇష్టమొచ్చినట్టు, ప్రేమ పంచవే
ప్లగ్గులోన వేలుపెడితే… ఒక్కసారి షాకు
ఓరచూపు తోటి… వంద షాకులివ్వమాకు
నాలాంటి వాడు… ఇంక దొరకడంట నీకు, నన్ను నమ్మవే

స్కూల్లోనే ఈల నేర్చినానే… హోలా చిక హోలా హోలా చికా
నీకోసం వెయ్యడానికేనే… హోలా చిక హోలా హోలా చికా
నువ్వు ఎస్సు అంటే లైఫు అబ్బో అబ్బో… నువ్వుగాని నో అంటే లబ్బో దిబ్బో

హోలా చిక హోలా హోలా చికా… ఓలమ్మో నువ్వేలే నా మ్యాజిక్కా
హోలా చిక హోలా హోలా చికా… హోలా చిక హోలా హోలా చికా
హోలా చిక హోలా హోలా చికా… పట్టెయ్ వే నా లవ్వునే క్యాచ్ ఇకా
హోలా చిక హోలా హోలా చికా… హోలా చిక హోలా హోలా చికా

Alludu Adhurs Movie Songs Telugu Lyrics

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

పడిపోయా పడిపోయా.. నీ ప్రేమలో… లిరిక్స్

చిత్రం: అల్లుడు అదుర్స్ (2021)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: భాస్కర భట్ల
గానం: జావేద్ అలీ
నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్, నభా నటేష్, అను ఇమ్మానుయేల్
దర్శకత్వం: సంతోష్ శ్రీనివాస్
నిర్మాణం: గొర్రెల సుబ్రహ్మణ్యం
విడుదల తేది: 14.01.2021

Padipoya Song Telugu Lyrics

ఓ మేరుపల్లె మెరిసి… ఉరుమల్లె ఉరిమి
వానల్లే కురిసావే… నిజామా లేదా కలా
ఓ గొడుగల్లె తడిసి… వరదల్లె ఉరికి
నీలోకే దూకానే… నాలోంచి నేనే ఇలా
కళ్ళతోటి కళ్ళకి… ఎన్ని చూపు లేఖలో
గుండెతోటి గుండెకెన్ని మౌనభాషలో

పడిపోయా పడిపోయా పడిపోయా… నీ ప్రేమలో
పడిపోయా పడిపోయా పడిపోయా… ఈ హాయిలో
పడిపోయా పడిపోయా పడిపోయా… నీ ప్రేమలో
పడిపోయా పడిపోయా పడిపోయా… ఈ హాయిలో

నెలవంకై వెలిగిందే… నీ పెదవులపై చిరునవ్వు
ఆ వంకే చాలు కదా… నను నీతో రానివ్వు
చలిమంటై తరిమిందే… నీ వెచ్చని ఊపిరి నావైపు
అది మొదలు నీకోసం… రోజూ పడిగాపు
కోలకళ్ల చిన్న కోనేట్లోన… రంగు చేపలాగ ఈదానే
అందమంటూ ఉన్న చెంపల్లోన… దోరసిగ్గు లాగ నేను మారానే

పడిపోయా పడిపోయా పడిపోయా… నీ ప్రేమలో
పడిపోయా పడిపోయా పడిపోయా… ఈ హాయిలో

ఎంతైనా పొగడొచ్చే… నిను చెక్కిన దేవుడి శిల్పకళ
ప్రాణాలే ఇవ్వొచ్చే… నీకే కానుకలా
భద్రంగా దాచొచ్చే… నిను రంగుల బొమ్మల సూచికలా
మురిపంగా చదవొచ్చే… రోజు రోజు ఆలా
గాలికూగుతున్న ముంగురులేమో… కొంటె సైగలే చేస్తుంటే
నిన్ను హత్తుకున్న అత్తరులేమో… గుప్పుమంటు గుండె వీడి పోతుంటే

పడిపోయా పడిపోయా పడిపోయా… నీ ప్రేమలో
పడిపోయా పడిపోయా పడిపోయా… ఈ హాయిలో
పడిపోయా పడిపోయా పడిపోయా… నీ ప్రేమలో
పడిపోయా పడిపోయా పడిపోయా… ఈ హాయిలో

Alludu Adhurs Movie Songs Telugu Lyrics

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

అల్లుడు అదుర్స్ టైటిల్ సాంగ్… లిరిక్స్

చిత్రం: అల్లుడు అదుర్స్ (2021)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రీ
గానం: జస్ప్రీత్ జస్జ్, వైష్ణవి
నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్, నభా నటేష్, అను ఇమ్మానుయేల్
దర్శకత్వం: సంతోష్ శ్రీనివాస్
నిర్మాణం: గొర్రెల సుబ్రహ్మణ్యం
విడుదల తేది: 14.01.2021

Alludu Adhurs Title Song Telugu Lyrics

క్రేజీ బేబీ, లెట్ మీ షో యూ ఆర్… లెట్ మీ షో యూ ఆర్
చాక్లెట్ కేక్ మీద చెర్రీలా… ఎంత ముద్దుగున్నావే
రంగు రిబ్బన్ కట్టుకున్న రాకెట్ లా… రావే, ఆ రావే రావే
హాటు హాటు చికెన్ కర్రీలా… నోరూరించావే
నా గుండెమీద గోల్డెన్ లాకెట్ లా… నువ్వే నువ్వే నువ్వే
నీ నడుమ్మీద టాటూ… నా ఫేవరెట్ స్పాటు
దా ఎందుకింక లేటు… స్టెప్పులై దాంతోపాటు
అయ్యబాబు నీ నా జోడి.. సూపర్ హిట్టు

పిల్లడు అదుర్స్… నీ గిల్లుడు అదుర్స్
ప్రేమ జల్లుడు అదుర్స్… మా నాన్నకి అల్లుడు అదుర్స్ ||2||

నువ్వు గళ్ళ లుంగీ కట్టుకుంటే… మాసు లుక్కు
నల్ల కళ్ళజోడు పెట్టుకుంటే… క్లాసు లుక్కు
పేటషేర్వాణీ వేసుకున్న రాజులాగా… వెళ్లి గుఱ్ఱమెక్కూ
నువ్వు కంచిపట్టు కట్టుకున్న జూలియట్
నీకు చందమామ కిందికొచ్చి… దిష్టి పెట్టు
సో లైఫ్ లాంగ్ నిన్ను… నా గుండెలోన దాచిపెట్టు
ఎక్స్ల్లెంట్ పిల్లడు, యాడ దొరికినాడని… అమ్మలక్కలందరీ పచ్చి ముచ్చట
వేవ్ లెంత్ కుదిరినా, వెన్నెలమ్మ నువ్వనీ… వాల్ పోస్టరెయ్యనా లోకమంతటా
నీ కంటికున్న కాటుకల్లే… కాలమంత తోడై ఉంటా

పిల్లడు అదుర్స్… నీ గిల్లుడు అదుర్స్
ప్రేమ జల్లుడు అదుర్స్… మా నాన్నకి అల్లుడు అదుర్స్ ||2||

మెలికలు తిరిగిన నీ మజిల్స్… మస్తు మస్తుగున్న నీ మాన్లీనెస్
నా డ్రీంలాండ్ థియేటర్లో హౌసేఫుల్స్… నీ అన్ని షోస్
చక్కనైన వాస్తు ఉన్న పిల్ల మిస్సు… రంగు రంగు పుస్తకం నీ సొగస్సు
నాకే దక్కెనే లక్కీ ఛాన్స్… మెనీ థాంక్సు
నీ సిక్సు ప్యాక్ వంపులో… సిల్కు పరుపులేసి
రొమాంటిక్ పాటలే పాడుకుంటలే
టిక్కుటాకు చెంపలో మెరుపులన్నీ తీసి… రోజుకొక్క దివాలీ జరుపుకుంటలే
గ్రాము కూడా వదలకుండ… గ్లామర్ అంతా దోచేస్తాలే, హెయ్

పిల్లడు అదుర్స్… నీ గిల్లుడు అదుర్స్
ప్రేమ జల్లుడు అదుర్స్… మా నాన్నకి అల్లుడు అదుర్స్ ||2||

Alludu Adhurs Movie Songs Telugu Lyrics

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

నదిలా నదిలా.. కదిలావే ఓ నదిలా… లిరిక్స్

చిత్రం: అల్లుడు అదుర్స్ (2021)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: సాగర్, హరిప్రియ
నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్, నభా నటేష్, అను ఇమ్మానుయేల్
దర్శకత్వం: సంతోష్ శ్రీనివాస్
నిర్మాణం: గొర్రెల సుబ్రహ్మణ్యం
విడుదల తేది: 14.01.2021

Nadhila Nadhila Song Telugu Lyrics

నదిలా నదిలా నదిలా… కదిలావే ఓ నదిలా
అలలా అలలా అలలా… తడిపావే నన్ను ఇలా
కలలా కలలా కలలా… కలిసావే ఓ కలలా
కథలా కథలా కథలా… మారావే నా కథలా

చకచకమంటూ నా మనసెపుడూ… పరిగెడుతుందే నీ వైపే
టకటకమంటూ నా మదికెపుడూ… వినబడుతుందే నీ పిలుపే
రెపరెపలాడే కనురెప్పలలో… మెరిసేదెపుడూ నీ రూపే
నా ఊపిరికే ప్రాణం అంటే… నీ చూపే

నదిలా నదిలా నదిలా… కదిలావే ఓ నదిలా
అలలా అలలా అలలా… తడిపావే నన్ను ఇలా
కలలా కలలా కలలా… కలిసావే ఓ కలలా
కథలా కథలా కథలా… మారావే నా కథలా

అందంలో నువు హానికరం…
చూస్తేనే చంపే… మెత్తనికత్తె నడుమొంపే
అల్లరిలో నువు కొత్తరకం…
మైకంలో ముంచే మాటలు… హమ్మో వినసొంపే
మల్లెల తీగను అల్లుకు పెరిగిన… రోజా పువ్వువి నువ్వేలే
వెన్నెల కల్లును వెన్నగ పూసెను… నీ చిరునవ్వేలే
సిగ్గుల సంతను బుగ్గన చుట్టి… ఎన్నాళ్లని ఊరిస్తావే
రేపోమాపో నీకే… సొంతం చేస్తాలే

నదిలా నదిలా నదిలా… కదిలావే ఓ నదిలా
అలలా అలలా అలలా… తడిపావే నన్ను ఇలా
కలలా కలలా కలలా… కలిసావే ఓ కలలా
కథలా కథలా కథలా… మారావే నా కథలా

తేనెలలో విరి తేనె నువ్వే…
తియ్యంగా నువ్వే పంచితే… చేదైనా తీపే
మే నెలలో పొగమంచు నువ్వే…
చల్లంగా నువ్వే తాకితే… ఎండైనా మంచేలే
చిరుచిరు పెదవుల… చుర చుర కత్తికి
పదునే పెంచెను… చెలి ముద్దు
గడి గడి పరుగుల గడియారాలకు… సెలవిక ఆపొద్దు
చలిగిలి పెంచుతూ చంపేస్తున్నది… నీ కనుసైగల తీపి విషం
కౌగిలి ఔషధమిస్తారా… ఇక ఈ నిమిషం

నదిలా నదిలా నదిలా… కదిలావే ఓ నదిలా
అలలా అలలా అలలా… తడిపావే నన్ను ఇలా
కలలా కలలా కలలా… కలిసావే ఓ కలలా
కథలా కథలా కథలా… మారావే నా కథలా

Alludu Adhurs Movie Songs Telugu Lyrics

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

రంభ ఊర్వశి మేనకా… లిరిక్స్

చిత్రం: అల్లుడు అదుర్స్ (2021)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: మంగ్లీ, హేమచంద్ర
నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్, నభా నటేష్, అను ఇమ్మానుయేల్
దర్శకత్వం: సంతోష్ శ్రీనివాస్
నిర్మాణం: గొర్రెల సుబ్రహ్మణ్యం
విడుదల తేది: 14.01.2021

Ramba Ooravasi Menaka Song Telugu Lyrics

హే… సిల్క్ స్మిత, జయమాల్ని… జ్యోతి లచ్చిమి
అందంలో చందంలో… రిలేటెడ్ టు మీ
హే… కత్తిరీనా, కర్రీనా… సన్నీ లియోనీ
అందరూ నా సిస్టర్సే… ప్లీజ్ బిలీవ్ మీ

హే కోకారైకా నేనేసాక… నాసాటి రాలేదు ఏ తారక
కుర్రాలింకా ఈలెయ్యక… ఎట్టాగ ఆగేది నేనొచ్చాక
రంభ ఊర్వశి మేనకా… అందర్నీ కలిపేస్తే నేనిక
రంభ ఊర్వశి మేనకా… అందర్నీ కలిపేస్తే నేనిక

హే… సిల్క్ స్మిత, జయమాల్ని… జ్యోతి లచ్చిమి
అందంలో చందంలో… రిలేటెడ్ టు మీ
హే… క క కత్తిరీనా, కర్రీనా… సన్నీ లియోనీ
అందరూ నా సిస్టర్సే… ప్లీజ్ బిలీవ్ మీ

హెయ్… దినక్కుతా కసక్కురో
దినక్కుతా… కసక్ కసక్ కసక్
దినక్కుతా కసక్కురో
దినక్కుతా… ఫసక్ ఫసక్ ఫసక్
దినక్కుతా కసక్కురో
దినక్కుతా… ఫసక్ ఫసక్ ఫసక్

హే… ఫస్టు ఫస్టు ఆడబొమ్మ చెక్కినోడికి
రోల్ మోడలేదంటే నీ పిక్చరే
నా సొంపాపిడి లాంటి సోయగానికి
సూటబుల్ మ్యాచ్ అంటే నీ స్ట్రక్చరే

హెయ్ పోరి… నా షర్టు పైన పూల ప్రింట్
నీ వల్లే సెంటల్లే మారిందే…
నీ స్మైలే ఇష్టయిలుగొచ్చి… తాకగానే
నా ఒళ్ళే తెగ ఊగిపోతుందే
రంభ ఊర్వశి మేనకా… అందర్నీ కలిపేస్తే నేనిక
రంభ ఊర్వశి మేనకా… అందర్నీ కలిపేస్తే నువ్విక

హే… లిక్కరంటి నీ పెదాల్లో… నక్కి ఉంటదే
చెక్కరంటే నీ పదాల్లో చిక్కి ఉంటదే
నీ ఉక్కులాంటి ఒంటి తీరు గ్రీకు శిల్పమే
మాట తేనె పూసుకున్న… కత్తి వాటమే
నీ షేపే కొత్తందాలకే బెస్ట్ షాప్… ఏ స్ట్రీటే నీ కేరాఫ్ అడ్రస్సు
నా పేరే నువ్వు జస్ట్ చెప్పు చాలు బాసు
ఈ ఊళ్ళో నేను చాలా ఫేమస్సు

రంభ ఊర్వశి మేనకా… అందర్నీ కలిపేస్తే నేనిక, హా హా
హెయ్… రంభ ఊర్వశి మేనకా… అందర్నీ కలిపేస్తే నువ్విక

Alludu Adhurs Movie Songs Telugu Lyrics

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

See More Lyrics
Lion (2015)
error: Content is protected !!