చిత్రం: అల్లూరి సీతారామరాజు (1974)
సంగీతం: పి.ఆదినారాయణ రావు
సాహిత్యం: డా౹౹. సి. నారాయణ రెడ్డి
గానం: పి.సుశీల
నటీనటులు: కృష్ణ , విజయనిర్మల
దర్శకత్వం: వి.రామచంద్ర రావు
నిర్మాతలు: జి. హనుమంతరావు, జి. అదిశేషగిరి రావు
విడుదల తేది: 01.05.1974
వస్తాడు నా రాజు ఈ రోజు
రానే వస్తాడు నెలరాజు ఈ రోజు
కార్తీక పున్నమి వేళలోన
కలికి వెన్నెల కెరటాల పైన
కార్తీక పున్నమి వేళలోన
కలికి వెన్నెల కెరటాల పైన
తేలి వస్తాడు నా రాజు ఈ రోజు
వేల తారకల నయనాలతో
నీలాకాశం తిలకించేను
వేల తారకల నయనాలతో
నీలాకాశం తిలకించేను
అతని చల్లని అడుగుల సవ్వడి
వీచే గాలీ వినిపించేను
ఆతని పావన పాదధూలికై
అవని అనువనువు కలవరించేను
అతని రాకకై అంతరంగమె
పాల సంద్రమై పరవసించేను
పాల సంద్రమై పరవసించేను
వస్తాడు నా రాజు ఈ రోజు
రానే వస్తాడు నెలరాజు ఈ రోజు
వెన్నెలలెంతగ విరిసినగాని
చంద్రున్నీ విడిపోలేవూ
కెరటాలెంతగ పొంగినగానీ
కడలిని విడిపోలేవూ
కలిసిన ఆత్మల అనుబంధాలు
ఏ జన్మకు విడిపోలేవులే
తనువులు వేరైన దారులు వేరైన
తనువులు వేరైన దారులు వేరైన
ఆ బంధాలే నిలిచేనులే
ఆ బంధాలే, నిలిచేనులే
వస్తాడు నా రాజు ఈ రోజు
రానే వస్తాడు నెలరాజు ఈ రోజు
కార్తీక పున్నమి వేళలోన
కలికి వెన్నెల కెరటాల పైన
వస్తాడు నా రాజు ఈ రోజు
********* ********* *********
చిత్రం: అల్లూరి సీతారామరాజు (1974)
సంగీతం: పి.ఆదినారాయణరావు
సాహిత్యం: శ్రీశ్రీ
గానం: ఘంటసాల
పల్లవి:
ఓ ఓ ఓ ఓ ఓ… ఓ ఓ ఓ.. ఓ ఓ ఓ.. ఓ ఓ ఓ ఓ…
తెలుగు వీర లేవరా.. ఆ ఆ ఆ..
దీక్ష బూని సాగరా.. ఆ ఆ ఆ..
తెలుగు వీర లేవరా దీక్ష బూని సాగరా
దేశమాత స్వేఛ్ఛ కోరి తిరుగుబాటు చేయరా..
తెలుగు వీర లేవరా దీక్ష బూని సాగరా
దేశమాత స్వేఛ్ఛ కోరి తిరుగుబాటు చేయరా
ఆ ఆ ఆ ఆ ఆ…. ఓ ఓ ఓ ఓ ఓ…..
చరణం: 1
దారుణమారణకాండకు తల్లడిల్లవద్దురా… ఆ ఆ ఆ
నీతిలేని శాసనాలు నేటినుండి రద్దురా.. ఆ ఆ ఆ
దారుణమారణకాండకు తల్లడిల్లవద్దురా
నీతిలేని శాసనాలు నేటినుండి రద్దురా
నిదురవద్దు..బెదరవద్దు
నిదురవద్దు..బెదరవద్దు
నింగి నీకు హద్దురా.. నింగి నీకు హద్దురా
ఆ ఆ ఆ ఆ ఆ…. ఓ ఓ ఓ ఓ ఓ…..
చరణం: 2
ఓ ఓ ఓ ఓ ఓ…
ఎవడువాడు?..ఎచటివాడు?
ఎవడు వాడు? ఎచటి వాడు?
ఇటువచ్చిన తెల్లవాడు
కండబలం గుండెబలం
కబళించే దుండగీడు.. కబళించే దుండగీడు
మానధనం.. ప్రాణధనం
దోచుకొనే దొంగవాడు.. దొచుకొనే దొంగ వాడు
ఎవడు వాడు ఎచటి వాడు ఇటు వచ్చిన తెల్లవాడు
తగినశాస్తి చేయరా…తగిన శాస్తి చేయరా …
తరిమి తరిమి కొట్టరా…. తరిమి తరిమి కొట్టరా..
తెలుగు వీర లేవరా! దీక్ష బూని సాగరా!
దేశమాత స్వేఛ్ఛ కోరి తిరుగుబాటు చేయరా!
ఆ ఆ ఆ ఆ ఆ…. ఓ ఓ ఓ ఓ ఓ…..
చరణం: 3
ఈ దేశం… ఈ రాజ్యం…
ఈ దేశం ఈ రాజ్యం .. నాదే అని చాటించి.. నాదే అని చాటించి
ప్రతిమనిషి తొడలు గొట్టి…
శృంఖలాలు పగులగొట్టి..శృంఖలాలు పగులగొట్టి
చురకత్తులు పదునుపెట్టి…
తుది సమరం మొదలుపెట్టి.. తుది సమరం మొదలుపెట్టి..
సింహాలై గర్జించాలీ… సింహాలై గర్జించాలీ
సంహారం సాగించాలీ… సంహారం సాగించాలీ
వందేమాతరం… వందేమాతరం..
వందేమాతరం… వందేమాతరం..
చరణం: 4
ఓ ఓ ఓ ఓ ఓ…
స్వాత్రంత్య వీరుడా స్వరాజ్య పాలుడా
అల్లూరి సీతారామరాజా.. అల్లూరి సీతారామరాజా
స్వాత్రంత్య వీరుడా స్వరాజ్య పాలుడా
అల్లూరి సీతారామరాజా.. అల్లూరి సీతారామరాజా
అందుకో మా పూజ లందుకో.. రాజా..
అందుకో మా పూజ లందుకో.. రాజా..
అల్లూరిసీతారామరాజా.. ఆ…అల్లూరిసీతారామరాజా..
ఓ ఓ ఓ ఓ ఓ…
తెల్లవాడి గుండెల్లో నుదురించినవాడా
మా నిదురించిన పౌరుషాగ్ని అగిలించిన వాడా
తెల్లవాడి గుండెల్లో నుదురించినవాడా
మా నిదురించిన పౌరుషాగ్ని అగిలించిన వాడా
త్యాగాలే భరిస్తాం.. కష్టాలే భరిస్తాం
త్యాగాలే భరిస్తాం.. కష్టాలే భరిస్తాం
నిశ్చయముగ నిర్భయముగ.. నీ వెంటనే నడుస్తాం…
నిశ్చయముగ నిర్భయముగ.. నీ వెంటనే నడుస్తాం…