Amarajeevi (1983)

చిత్రం: అమరజీవి (1983)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు
నటీనటులు: నాగేశ్వరరావు, జయప్రద
దర్శకత్వం: జంధ్యాల
నిర్మాత: భీమవరపు బుచ్చిరెడ్డి
విడుదల తేది: 19.08.1983

మల్లెపూల మారాణికి బంతిపూల పారాణి
మల్లెపూల మారాణికి బంతిపూల పారాణి
గున్నమావి పందిళ్ళలోనా..ఆ..
కన్నెజాజి ముంగిళ్ళలోనా..హా..
కోకిలమ్మ పాటకచేరీ

మల్లెపూల మారాణికి బంతిపూల పారాణి
గున్నమావి పందిళ్ళలోనా..ఆ..
కన్నెజాజి ముంగిళ్ళలోనా..హా..
కోకిలమ్మ పాటకచేరీ

లలల్లలా..లల్లల్లలా..లల్లల్లలా..

పొగడ పూలైనా.. పొగడే అందాలే
మెరిసే మలిసంజెవేళలో
మల్లీ మందారం.. పిల్లకి సింగారం
చేసే మధుమాసవేళలో
నా రాగమే నీ ఆరాధనై
చిరంజీవిగా దీవించనా
Happy Birthday to you !

మల్లెపూల మారాణికి బంతిపూల పారాణి
గున్నమావి పందిళ్ళలోనా..ఆ..
కన్నెజాజి ముంగిళ్ళలోనా..హా..
కోకిలమ్మ పాటకచేరీ

లలల్లలా..లల్లల్లలా..లల్లల్లలా..

రెల్లు చేలల్లో.. రేయీ వేళల్లో
కురిసే వెన్నెల్ల నవ్వుతో
పుట్టే సూరీడు.. బొట్టై ఏనాడు
మురిసే ముత్తైదు శోభతో
నీ సౌభాగ్యమే నా సంగీతమై
ఈ జన్మకీ జీవించనా
Happy Birthday to you!

మల్లెపూల మారాణికి బంతిపూల పారాణి
గున్నమావి పందిళ్ళలోనా..ఆ..
కన్నెజాజి ముంగిళ్ళలోనా..హా..
కోకిలమ్మ పాటకచేరీ

మల్లెపూల మారాణికి బంతిపూల పారాణి
గున్నమావి పందిళ్ళలోనా..ఆ..
కన్నెజాజి ముంగిళ్ళలోనా..హా..
కోకిలమ్మ పాటకచేరీ