ఎందరో కవుల కలం నుంచి వెలువడిన తెలుగు సాహిత్యం సంపూర్ణం అవ్వాలంటే సంగీతంతో జతకట్టి గళంతో మమేకమై గానం అవ్వాలి. అటువంటి గళ మాధుర్యాన్ని సొంతం చేసుకున్న మహోన్నత వ్యక్తి “శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం” (ఎస్.పి. బాలు) గారు స్వర్గ సీమకి పయనమయ్యారు. అమరం అఖిలం ఆయన గానం. ఆయన స్వరం మనకు వరం. భౌతికంగా దూరమైన, మన మనస్సులో చెరగని ముద్ర వేశారు. ఆయన పాడిన ఎన్నో వేల పాటల నుంచి కొన్ని మీ కోసం…
ఒక్కడై రావడం.. ఒక్కడై పోవడం… లిరిక్స్
చిత్రం: ఆ నలుగురు (2004)
సంగీతం: ఆర్.పి. పట్నాయక్
సాహిత్యం: చైతన్య ప్రసాద్
గానం: ఎస్.పి.బాలు
ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం…
నడుమ ఈ నాటకం, విధి లీలా..
వెంట ఏ బంధమూ రక్తసంబంధము…
తోడుగా రాదుగా తుదివేళా…
మరణమనేది ఖాయమనీ…
మిగిలెను కీర్తి ఖాయమనీ…
నీ బరువూ… నీ పరువూ మోసేదీ ఈ ఈ ఈ…
ఆ నలుగురూ… ఆ నలుగురూ…
ఆ నలుగురూ… ఆ నలుగురూ…
రాజనీ పేదనీ మంచనీ చెడ్డనీ…
భేదమే ఎరుగదీ యమపాశం
కోట్ల ఐశ్వర్యము కటిక దారిద్ర్యము…
హద్దులే చెరిపెలే మరుభూమి..
మూటలలోని మూలధనం…
చెయ్యదు నేడు సహగమనం..
మనవెంటా కడకంటా నడిచేదీ…
ఆ నలుగురూ… ఆ నలుగురూ…
ఆ నలుగురూ… ఆ నలుగురూ…
నలుగురు మెచ్చినా.. నలుగురు తిట్టినా..
విలువలే శిలువగా మోశావు
అందరు సుఖపడే.. సంఘమే కోరుతూ..
మందిలో మార్గమే వేశావు..
బతికిన నాడు బాసటగా..
పోయిన నాడు ఊరటగా..
అభిమానం అనురాగం చాటేదీ…
ఆ నలుగురూ… ఆ నలుగురూ…
ఆ నలుగురూ… ఆ నలుగురూ…
పోయిరా నేస్తమా.. పోయిరా ప్రియతమా..
నీవు మా గుండెలో నిలిచావు..
ఆత్మయే నిత్యము జీవితం సత్యము..
చేతలే నిలుచురా చిరకాలం..
నలుగురు నేడు పదుగురిగా..
పదుగురు వేలు వందలుగా..
నీ వెనుకే.. అనుచరులై నడిచారు…
ఆ నలుగురూ… ఆ నలుగురూ…
ఆ నలుగురూ… ఆ నలుగురూ…
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****
చిరునవ్వులతో బ్రతకాలి… లిరిక్స్
చిత్రం: మీ శ్రేయోభిలాషి (2008)
సంగీతం: కోటి
సాహిత్యం: వెనిగళ్ల రాంబాబు
గానం: ఎస్.పి.బాలు
ఆత్మీయత కరువైనా అంధకారమెదురైనా
బ్రతకడమే బరువైనా స్థితి గతులవి ఏవైనా
చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి
చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి
చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి
ఆనందాలను అన్వేషిస్తూ అందరి కోసం బ్రతకాలి
అందరినీ బ్రతికించాలి
చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి
బ్రతుకే నీకు బరువైతే ఆ భారం దించుకో
బరువేదైన గురితో ఓ నలుగురితో పంచుకో
కలతే లేని జీవితమంటే విలువే లేదులే
అలుపే లేక అవలీలగ ఏ గెలుపూ రాదులే
నింగినంటు ఎవరెస్టైనా నేల నుండి మొదలౌతుంది
నమ్ముకోకు అదృష్టాన్ని నమ్ముకో ధైర్యాన్ని
మెరుపులే పిడుగులై ఉరుముతున్నా…
ఉరకలు వేసే కిరణం జీవితం
చిరునవ్వులతో బ్రతకాలి చిరుదివ్వెలుగా వెలగాలి
చిరునవ్వులతో బ్రతకాలి చిరుదివ్వెలుగా వెలగాలి
లోకం నిండిన శోకం తుడిచే వేకువలా ఉదయించాలి
వెన్నెలలే కురిపించాలి
చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి
పెరిగే పక్షి రెక్కకు సహజం ఎగిరే లక్షణం
వదిలేస్తుంది నిన్నటి గూటిని కదిలే ఆ క్షణం
ఏదీ నీది కాదని అనుకో ఏదో నాటికీ
ఐనా రేపు మిగిలే ఉంది ఆశావాదికీ
కొమ్మలన్ని చుక్కలవైపే కోరి కోరి చూస్తున్నా
మట్టితోటి అనుబంధాన్ని చెట్టు మరువగలదా
చీడలే నీడలై వీడకున్నా…
అందరి బృందావనమే జీవితం
చిరునవ్వులతో బ్రతకాలి శ్రీకారంలా బ్రతకాలి
చిరునవ్వులతో బ్రతకాలి శ్రీకారంలా బ్రతకాలి
గతమంతా కనుమరుగౌతున్నానిన్నటి స్వప్నం నిలవాలి
నీ సంకల్పం గెలవాలి
చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి
ఆశే నిన్ను నడిపిస్తుంది ఆకాశానికీ
ఆశే దారి చూపిస్తుంది అవకాశానికీ
ఆశే నీకు లక్ష్యం చేరే అస్త్రం మిత్రమా
ఆశే నీకు ఆయువు పెంచే అమృతం నేస్తమా
ఆశ వెంట ఆచరణుంటే అద్భుతాలు నీ సొంతం
ఆదమరిచి నిదురిస్తుంటే అందదే వసంతం
నిప్పులే గుండెలో నిండుతున్నా…
ఉప్పొంగే జలపాతం జీవితం
చిరునవ్వులతో బ్రతకాలి చిగురాశలతో బ్రతకాలి
చిరునవ్వులతో బ్రతకాలి చిగురాశలతో బ్రతకాలి
అంతిమ విజయం అనివార్యమని ఆశిస్తూ నువు బ్రతకాలి
ఆశయాన్ని బ్రతికించాలి
చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి
నీడే నిన్ను భయపెడితే ఆ నేరం వెలుగుదా
నలుసే బాధ పెడుతుంటే ఆ దోషం కంటిదా
నేస్తం చూడు జీవితమంటే నిత్యం సమరమే
సమరంలోనె కనుమూస్తే ఆ మరణం అమరమే
పారిపోకు ఏ ఓటమికీ ప్రపంచాన్ని విడిచి
జారిపోకు పాతాళానికీ బ్రతుకు బాట మరచి
వరదలా మృత్యువే తరుముతున్నా…
ఆరని అగ్నిజ్వాలే జీవితం
చిరునవ్వులతో బ్రతకాలి శిఖరంలా పైకెదగాలి
చిరునవ్వులతో బ్రతకాలి శిఖరంలా పైకెదగాలి
చావుకు చూపే ఆ తెగింపుతో జీవించాలనుకోవాలి
నువు జీవించే తీరాలి
చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి
విజయం తలుపు తెరిచే వరకూ విసుగే చెందకూ
విసుగే చెంది నిస్పృహతొ నీ వెనకే చూడకూ
చిందే చెమట చుక్కకు సైతం ఉందీ ఫలితమే
అది అందే వరకు సహనంతో సాగాలీ పయనమే
అంతరాత్మ గొంతే నులిమి శాంతి కోరుకుంటావా
అల్లుకున్న అనుబంధాలే తల్లడిల్లిపోవా
అలజడే నిలువునా అలుముకున్నా…
అలుపెరుగని చైతన్యం జీవితం
చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి
చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి
ఆనందాలను అన్వేషిస్తూ అందరి కోసం బ్రతకాలి
అందరినీ బ్రతికించాలీ
చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి
చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి
ఆనందాలను అన్వేషిస్తూ అందరి కోసం బ్రతకాలి
అందరినీ బ్రతికించాలి
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****
సూర్యుడే సెలవని అలసి పోయేనా… లిరిక్స్
చిత్రం: స్టాలిన్ (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: ఎస్.పి.బాలు
సూర్యుడే సెలవని అలసి పోయేనా…
కాలమే శిలవలే నిలిచిపోయేనా…
మనిషి మనిషిని కలిపిన ఓ ఋషీ…
భువిని చరితని నిలిపెను నీ కృషి
మహాశయా విధి బలై తరిమెనా…
మహో శనమై వృధిరమే మరిగెనా…
ఆగిపోయెనా త్యాగం కథా…
ఆదమరిచెనా దైవం వృధా…
సూర్యుడే సెలవని అలసి పోయేనా…
కాలమే శిలవలే నిలిచిపోయేనా…
ఆకశం నినుగని మెరిసిపోతుంది
నేల నీ అడుగుకై ఎదురు చూసింది
చినుకు చినుకున కురిసెను నీ కలా…
మనసు మనసున రగిలెను జ్వాలలా…
తుఫానులా ఎగిసెనీ ప్రవచనం
ప్రభోజ్వలా కదిలెనీ యువజనం
పంచభూతాలే తోడై సదా…
పంచ ప్రాణాలై రావా పదా…
ఓం…. ఓం…
ద్వయం భకం యజమహే సుగంధింపుష్టి వర్థనం
ఉర్వానుక హిమ బంధనా.. మృత్యో వృక్షియ మామృతా..
స్వార్థమే పుడమిపై పరుగు తీస్తుంటే…
ధూర్తులే అసురులై ఉరక లేస్తుంటే…
యుగము యుగమున వెలిసెను దేవుడూ…
జగము జగములు నడిపిన ధీరుడూ…
మహొదయా అది నువ్వే అనుకొనీ…
నిరీక్షతోనిలిచె ఈ జగతనీ…
మేలుకో రాదా మా దీపమై
ఏలుకో రాదా మా బంధమై
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****
ఆయన స్థానాన్ని యెవరూ భర్తీ చేయలేరు.