Amayakudu (1968)

చిత్రం: అమాయకుడు (1968)
సంగీతం: బి. శంకర్
సాహిత్యం: దేవులపల్లి
గానం: ఘంటసాల
నటీనటులు: కృష్ణ , జమున, జి. వరలక్ష్మీ
దర్శకత్వం: అడ్డాల నారాయణ రావు
నిర్మాతలు: ఎం. శంకరయ్య, వెంకట నర్సయ్య
విడుదల తేది: 10.05.1968

పల్లవి:
మనిషైతే.. మనసుంటే
మనిషైతే మనసుంటే.. కనులు కరగాలిరా
కరిగి కరుణ కురియాలిరా.. కురిసి జగతి నిండాలిరా

చరణం: 1
ఆగి ఆగి సాగి పోరా.. సాగి పోతూ చూడరా..ఆ..
ఆగి ఆగి సాగి పోరా.. సాగి పోతూ చూడరా..ఆ..
వేగి పోయే ఎన్నెన్నెని బ్రతుకులో.. వేడుకుంటూ ఎన్నెన్ని చేతులో
వేచి ఉన్నాయిరా..

మనిషైతే.. మనసుంటే
మనిషైతే మనసుంటే.. కనులు కరగాలిరా
కరిగి కరుణ కురియాలిరా.. కురిసి జగతి నిండాలిరా

చరణం: 2
తేలిపోతూ నీలి మేఘం.. జాలి జాలిగ కరిగేరా
తేలిపోతూ నీలి మేఘం.. జాలి జాలిగ కరిగేరా
కేలు చాపి ఆ దైవమే తన.. కేలు చాపి ఆకాశమే ఈ..
నేల పై ఒరిగెరా..

మనిషైతే.. మనసుంటే..
మనసుంటే మన్షైతే.. వైకుంఠమే ఒరుగురా
నీ కోసమే కరుగురా..
నీ కోసమే కరుగురా..
నీ కోసమే కరుగురా..

*****  ******  ******

చిత్రం: అమాయకుడు (1968)
సంగీతం: బి. శంకర్
సాహిత్యం: సినారె
గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:
చందమామ రమ్మంది చూడు.. చల్లగాలి రమ్మంది చూడూ..
ఆ పైన.. ఇంక ఆ పైన.. నువ్వు నా కళ్ళలో తొంగి చూడూ

చందమామ బాగుంది నేడు.. చల్లగాలి బాగుంది నేడు
ఏముంది.. ఇంక ఏముంది.. అది అంతే కదా ఏనాడు
చందమామ బాగుంది నేడు

చరణం: 1
పూవులే ఎందుకో నవ్వుతున్నాయి చూడు
పూవులే ఎందుకో నవ్వుతున్నాయి చూడు
వెన్నెలే ఎందుకో నన్ను కవ్వించే నేడు
తెలుసుకోలేవు నీవూ.. పలకగాలేను నేను

చందమామ రమ్మంది చూడూ

చరణం: 2
పూవులే నవ్వితే నవ్వుకోనిమ్ము నేడు
పూవులే నవ్వితే నవ్వుకోనిమ్ము నేడు
ఉందిగా వెన్నెలా ఎందుకమ్మాయి తోడు
నీది నా దారి కాదు.. నాది నీ దారి కాదు

చందమామ బాగుంది నేడు

చరణం: 3
చెంతగా నిలిచినా ఇంత గిలిగింత లేదు
చెంతగా నిలిచినా ఇంత గిలిగింత లేదు
చెంతగా నిలిచినా వింత నాకేమి లేదు
అడవి మనిషివి నీవు.. ఆ మాటే తగదన్నాను

చందమామ రమ్మంది చూడు.. చల్లగాలి రమ్మంది చూడు
ఆ పైన.. ఇంక ఆ పైన.. నువ్వు నా కళ్ళలో తొంగి చూడు
చందమామ రమ్మంది చూడు

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

See More Lyrics
True Love End Independent Film Lyrics
True Love End Independent Film (2019)
error: Content is protected !!