అమ్మ పాడని జోల ఆకాశజోలా… లిరిక్స్
చిత్రం: కౌరవుడు (2000)
సంగీతం: మణి శర్మ
సాహిత్యం: వేటూరి
గానం: కె. ఎస్. చిత్ర
నటీనటులు: నాగేంద్ర బాబు, రమ్య కృష్ణ
దర్శకత్వం: జోతి కుమార్
నిర్మాణం: కె. పద్మజ
విడుదల తేది: 2000
అమ్మ పాడని జోల ఆకాశజోలా.. ఆ.. ఆ..
అమ్మ పాడని జోల ఆకాశజోల
అమ్మపోయని లాల మేఘాలలాల
అమ్మగా నీజోల నే పాడు వేళ
అమ్మోరు చల్లగా కాపాడు వేళ
లాలి లాలి లాలి లాలి
వెదురు తోటలు వేసే వేసంగి ఈలా..
సందె పొద్దులు వేసే సంపంగి మాలా..
వెదురు తోటలు వేసే వేసంగి ఈల
సందె పొద్దులు వేసే సంపంగి మాల
గొంతువిప్పని ప్రేమ కోయిలలు పాడ..
గొంతువిప్పని ప్రేమ కోయిలలు పాడ..
కొమ్మనై ఊంచేను అమ్మ ఉయ్యాల
లాలి లాలి లాలి లాలి
ఏడుకొండలవాడి ఎత్తుగా పాడి
అన్నమయ్య ఊపేను తెలుగుటుయ్యాల
ఆ ఏడుకొండలవాడి ఎత్తుగా పాడి
అన్నమయ్య ఊపేను తెలుగుటుయ్యాల
వరదయ్య పాటలో వరదలై పొంగే
వరదయ్య పాటలో వరదలై పొంగే
ముద్దుమురిపాల మా మువ్వగోపాలా
లాలి లాలి లాలి లాలి
అమ్మ పాడని జోల ఆకాశజోల
అమ్మపోయని లాల మేఘాలలాల
అమ్మగా నీజోల నే పాడు వేళ
అమ్మోరు చల్లగా కాపాడు వేళ
లాలి లాలి లాలి లాలి
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****
Nice song